
TECNO సంస్థ తాజాగా భారత్ లో ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ Tecno POP 7 Pro ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ Tecno POP 6 Pro కి సక్సెసర్ గా వచ్చింది. ఇది గతేడాది సెప్టెంబర్ లో లాంచైంది. గత మోడల్ తో పోల్చితే Tecno POP 7 Pro డివైజ్ ఇంప్రూవ్డ్ కెమెరా సిస్టమ్, రెట్టింపు ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది. భారత్ లో ఈ ఫోన్ ఎంట్రీ లెవెల్ కొనుగోలుదారులకి మంచి ఆప్షన్ గా నిలవనుంది.
Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్, టైప్ సీ పోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి Tecno POP 7 Pro ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
భారత్ లో Tecno POP 7 Pro ధర, లభ్యత
భారత్ లో Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ 2జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ధరను రూ.6,799 గా నిర్ణయించారు. 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ. 7,299 గా ఉంది. Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 22 నుంచి అమెజాన్ ద్వారా కొనుగోలుకి అందుబాటులోకి వస్తుంది.
Tecno POP 7 Pro స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 480 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.
Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం IMG PowerVR GPU వినియోగించారు. ఏ22 ప్రాసెసర్ ని రెడ్మీ ఏ1, పోకో సీ50, లావా ఎక్స్3, టెక్నో పాప్ 6 ప్రో ఫోన్లో వాడారు. Tecno POP 7 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఓఎస్ ఆధారిత హైఓఎస్ 11.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ 2జిబి + 64జిబి మరియు 3జిబి + 64జిబి వేరియంట్స్ లో లభిస్తుంది. 2జిబి వేరియంట్ 2జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. 3జిబి ర్యామ్ వేరియంట్ 3జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది.
Tecno POP 7 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 12ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఫ్రంట్ డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉండటం విశేషం.
Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.
Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ ఎండ్‌లెస్ బ్లాక్, ఉయుని బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 163.86 మిల్లీ మీటర్ల పొడవు, 75.51 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.9 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. ఈ డివైజ్ ఐపీఎక్స్2 స్ప్లాష్-రెసిస్టంట్ రేటింగ్ తో వస్తోంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












