
Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ దేశంలో తొలిసారిగా సేల్ కి వచ్చింది. ఈ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ గత వారం భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. Tecno POP 7 Pro మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్, 3జిబి ర్యామ్, హెచ్డీ+ డిస్ప్లే, 12ఎంపి కెమెరా సెటప్ తో వచ్చింది.
Tecno POP 7 Pro డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్ సపోర్ట్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, టైప్-సీ పోర్ట్ అందించారు. సరే, ఓసారి Tecno POP 7 Pro ధర, లభ్యత, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
భారత్ లో Tecno POP 7 Pro ధర, లభ్యత
Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ 2జిబి + 64జిబి మరియు 3జిబి + 64జిబి వేరియంట్స్ లో లభిస్తుంది. 3జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.7299 గా ఉంది. బేస్ వేరియంట్ ధరను రూ.6,799 గా నిర్ణయించారు. నేడు అనగా ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ద్వారా Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
Tecno POP 7 Pro స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
Tecno POP 7 Pro లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే ప్యానెల్ 480 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కి సపోర్ట్ చేస్తుంది. వాటర్ డ్రాప్ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. Tecno POP 7 Pro లో మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్, ఐఎంజీ పవర్‌వీఆర్ జీపీయూ వాడారు. పోకో సీ50, లావా ఎక్స్3, రెడ్మీ ఏ1 వంటి ఎంట్రీ లెవెల్ ఫోన్లలో హీలియో ఏ22 చిప్సెట్ ని వాడటం జరిగింది. ఇకపోతే Tecno POP 7 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఆధారిత హైఓఎస్ 11.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ 12ఎంపి ప్రైమరీ రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, ఒక ఏఐ లెన్స్ ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ లో కూడా డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఇవ్వడం విశేషం.
Tecno POP 7 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ లో టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. Tecno POP 7 Pro డివైజ్ ఎండ్‌లెస్ బ్లాక్, ఉయిని బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఐపీఎక్స్2 స్ప్లాష్ రెసిస్టన్స్ రేటింగ్ తో ఈ ఫోన్ వచ్చింది. డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











