Tecno Pova 6 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 20 Aug 2024 03:40:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Fastest charging phones: రూ.20,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్స్ (జులై 2024) https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-20000-july-2024-india/ https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-20000-july-2024-india/#respond Fri, 26 Jul 2024 18:27:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=12715 స్మార్ట్‌ఫోన్ కొనేముందు అందరూ చూసే ముఖ్యమైన ఫీచర్లలో చార్జింగ్ స్పీడ్ ఒకటి. తొందరగా చార్జ్ అయ్యే ఫోన్ ఉంటే, పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. అర్జంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, చార్జింగ్ తక్కువగా ఉంటే, ఫాస్ట్ చార్జింగ్ తో ఇట్టే ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్ చార్జింగ్ వల్లన ఎన్నో లాభాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సమయం వృథా కాదు. బిజీ బిజీగా ఉండే వారికి ఈ చార్జింగ్ స్పీడ్ ఫీచర్ ఎంతో మేలు చేస్తుంది. […]

The post Fastest charging phones: రూ.20,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్స్ (జులై 2024) first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనేముందు అందరూ చూసే ముఖ్యమైన ఫీచర్లలో చార్జింగ్ స్పీడ్ ఒకటి. తొందరగా చార్జ్ అయ్యే ఫోన్ ఉంటే, పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. అర్జంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, చార్జింగ్ తక్కువగా ఉంటే, ఫాస్ట్ చార్జింగ్ తో ఇట్టే ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్ చార్జింగ్ వల్లన ఎన్నో లాభాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సమయం వృథా కాదు. బిజీ బిజీగా ఉండే వారికి ఈ చార్జింగ్ స్పీడ్ ఫీచర్ ఎంతో మేలు చేస్తుంది. రూ.20,000 లోపు ధరలో భారత్ లో అందుబాటులో ఉన్న ఉత్తమమైన ఫాస్టెస్ట్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.

Realme Narzo 70 Pro

Realme Narzo 70 Pro స్మార్ట్‌ఫోన్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ అడాప్టర్ తో వచ్చింది. 20 శాతం నుంచి 100 శాతం వరకు చార్జ్ అయ్యేందుకు 42 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 16 గంటల 24 నిమిషాల స్కోర్ నమోదు చేసింది.

యూట్యూబ్ లో 30 నిమిషాలు వీడియోలు చూస్తే, కేవలం 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. ఇక ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.19,999 గా పెట్టారు. 8జిబి/256జిబి మోడల్ ధర రూ.21,999 గా ఉంది.

Realme P1

Realme P1 స్మార్ట్‌ఫోన్ 45 వాట్ ఫాస్ట్ చార్జర్ తో వచ్చింది. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 48 నిమిషాల సమయం పడుతుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 16 గంటల 20 నిమిషాల స్కోర్ నమోదు చేసింది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.

ఇప్పుడు టెస్టింగ్ వివరాలు తెలుసుకుందాం. 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలను చూస్తే, 3 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. ఈ ఫోన్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉన్నాయి.

Realme P1 స్మార్ట్‌ఫోన్ యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.15,999 గా ఉంది. 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది.

OnePlus Nord CE 4 Lite

OnePlus Nord CE 4 Lite స్మార్ట్‌ఫోన్ 80 వాట్ ఫాస్ట్ చార్జర్ తో వచ్చింది. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 50 నిమిషాల సమయం పడుతుంది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ డివైజ్ 11 గంల 30 నిమిషాల స్కోర్ నమోదు చేసింది. ఈ ఫోన్ లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.

ఇప్పుడు టెస్ట్ వివరాలు చూద్దాం. 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలు చూస్తే 3 శాతం బ్యాటరీ డ్రాప్ అయ్యింది. ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్, 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

OnePlus Nord CE 4 Lite యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.22,999 గా ఉంది.

Tecno POVA 6 Pro

Tecno POVA 6 Pro స్మార్ట్‌ఫోన్ 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. ఈ ఫోన్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 51 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఫోన్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 15 గంటల 56 నిమిషాల స్కోర్ నమోదు చేసింది.

30 నిమిషాల పాటు యూట్యూబ్ లో వీడియోలు చూస్తే 3 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. ఈ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, డైమెన్సిటీ 6080 చిప్సెట్, 108ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Tecno POVA 6 Pro స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.21,999 గా ఉంది.

Realme Narzo 70

Realme Narzo 70 స్మార్ట్‌ఫోన్‌ 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. బ్యాటరీ 20 శాతం నుంచి 100 శాతం వరకు చార్జ్ అయ్యేందుకు 52 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 14 గంటల 49 నిమిషాల స్కోర్ నమోదు చేసింది.

30 నిమిషాల పాటు యూట్యూబ్ లో వీడియోలు చూస్తే 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. Realme Narzo 70 లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Realme Narzo 70 యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,999 గా ఉంది.

The post Fastest charging phones: రూ.20,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్స్ (జులై 2024) first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/fastest-charging-phones-under-rs-20000-july-2024-india/feed/ 0
Tecno: 70W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన Pova 6 Pro 5G https://www.91mobiles.com/telugu/tecno-pova-6-pro-5g-launched-india-70w-fast-charging-support/ Fri, 29 Mar 2024 09:52:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=10886 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno భారతీయ మార్కెట్ లో Pova 6 Pro 5G డివైజ్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై ఎల్ఈడీ లైట్స్ తో వచ్చింది. దీంతో ఫోన్ లుక్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. Tecno Pova 6 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఎన్నో మంచి ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ 24జిబి వరకు ర్యామ్ పవర్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 6.78-ఇంచ్ భారీ […]

The post Tecno: 70W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన Pova 6 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Tecno Pova 6 Pro 5G లాంచ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్
  • Tecno Pova 6 Pro 5G ప్రారంభ ధర రూ.19,999

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno భారతీయ మార్కెట్ లో Pova 6 Pro 5G డివైజ్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై ఎల్ఈడీ లైట్స్ తో వచ్చింది. దీంతో ఫోన్ లుక్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. Tecno Pova 6 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఎన్నో మంచి ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ 24జిబి వరకు ర్యామ్ పవర్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 6.78-ఇంచ్ భారీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Tecno Pova 6 Pro 5G ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Tecno Pova 6 Pro 5G ధర, లభ్యత

Tecno Pova 6 Pro 5G డివైజ్ భారత్ లో రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Tecno Pova 6 Pro 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ బేస్ మోడల్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు.

Tecno Pova 6 Pro 5G 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.21,999 గా ఉంది.

Tecno Pova 6 Pro 5G డివైజ్ మీటియోరైట్ గ్రే మరియు కామెట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా ఫోన్ పై రూ.2,000 డిస్కౌంట్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీంతో బేస్ మోడల్ రూ.17,999 కి, టాప్ మోడల్ రూ.19,999 కి లభించనున్నాయి.

Tecno Pova 6 Pro 5G డివైజ్ ఏప్రిల్ 4వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ అమెజాన్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

Tecno Pova 6 Pro 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno Pova 6 Pro 5G లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ సపోర్ట్, 1.3 మి.మీ సన్నని బెజెల్స్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Tecno Pova 6 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Pova 6 Pro 5G 8జిబి ర్యామ్/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 12జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చింది. దీంతో యూజర్ కి 24జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Tecno Pova 6 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఏఐ థర్డ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ముందువైపు డ్యూయల్-టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Tecno Pova 6 Pro 5G లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Tecno Pova 6 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, డాల్బీ అట్మాస్, హై-రెజ్ ఆడియో, డ్యూయల్ స్పీకర్, డైనమిక్ పోర్ట్ 2.0 ఉన్నాయి.

The post Tecno: 70W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన Pova 6 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Tecno Pova 6 Pro లాంచ్‌ని లైవ్‌లో ఎలా చూడాలో తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/tecno-pova-6-pro-5g-india-launch-know-how-to-watch-live/ Thu, 28 Mar 2024 17:25:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=10880 ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno మార్చి 29న భారత్ లో Tecno Pova 6 Pro డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. అమెజాన్ ఎక్స్‌క్లూజివ్ ప్రొడక్ట్ అయిన ఈ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. 24జిబి ర్యామ్ పవర్, 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైనమిక్ పోర్ట్ ఫీచర్, మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, 108ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. Tecno Pova […]

The post Tecno Pova 6 Pro లాంచ్‌ని లైవ్‌లో ఎలా చూడాలో తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చి 29న Tecno Pova 6 Pro లాంచ్
  • అమెజాన్ ద్వారా పోవా 6 ప్రో సేల్
  • 24జిబి ర్యామ్ పవర్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno మార్చి 29న భారత్ లో Tecno Pova 6 Pro డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. అమెజాన్ ఎక్స్‌క్లూజివ్ ప్రొడక్ట్ అయిన ఈ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. 24జిబి ర్యామ్ పవర్, 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైనమిక్ పోర్ట్ ఫీచర్, మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, 108ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. Tecno Pova 6 Pro లాంచ్ ని ప్రత్యక్షప్రసారం ద్వారా ఎలా చూడవచ్చో తెలుసుకుందాం పదండి.

Tecno Pova 6 Pro 5G లాంచ్‌ని లైవ్‌లో చూడండి

Tecno Pova 6 Pro 5G స్మార్ట్‌ఫోన్ మార్చి 29న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతోంది.

Tecno Pova 6 Pro 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ ని టెక్నో ఇండియా అధికార వెబ్‌సైట్ ద్వారా చూడవచ్చు. అలాగే టెక్నో యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కూడా లాంచ్‌ని లైవ్ లో చూడవచ్చు. ఇంకా Tecno అఫీషియల్ యూట్యూబ్ చానల్ ద్వారా లాంచ్ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. అమెజాన్ వెబ్‌సైట్ ద్వారా కూడా లాంచ్‌ని లైవ్ ద్వారా చూడవచ్చు.

Tecno Pova 6 Pro 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno Pova 6 Pro 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ సపోర్ట్, డైనమిక్ పోర్ట్ ఫీచర్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Tecno Pova 6 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ ఉంటాయి. చిప్సెట్ 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Pova 6 Pro 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 12జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ తో వస్తోంది.
  • కెమెరా: Tecno Pova 6 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఏఐ థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Tecno Pova 6 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Tecno Pova 6 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Tecno Pova 6 Pro లాంచ్‌ని లైవ్‌లో ఎలా చూడాలో తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Tecno: లాంచ్‌కి ముందు లీకైన POVA 6 Pro 5G ధర https://www.91mobiles.com/telugu/tecno-pova-6-pro-5g-price-leaked-before-launch/ Tue, 26 Mar 2024 14:01:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=10826 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో Pova 6 Pro 5G డివైజ్ ని గ్లోబల్‌గా పరిచయం చేసింది. ఈ ఫోన్ మార్చి 29న భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. అమెజాన్ పై ఇప్పటికే Tecno Pova 6 Pro 5G యొక్క ప్రొడక్ట్ పేజీ లిస్ట్ అయ్యింది. కొత్త లీక్ ద్వారా ఈ ఫోన్ ధర కూడా రివీల్ అయ్యింది. రెండు స్టోరేజీ మోడల్స్ లో ఫోన్ […]

The post Tecno: లాంచ్‌కి ముందు లీకైన POVA 6 Pro 5G ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చి 29న Tecno Pova 6 Pro 5G లాంచ్
  • 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో Pova 6 Pro 5G డివైజ్ ని గ్లోబల్‌గా పరిచయం చేసింది. ఈ ఫోన్ మార్చి 29న భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. అమెజాన్ పై ఇప్పటికే Tecno Pova 6 Pro 5G యొక్క ప్రొడక్ట్ పేజీ లిస్ట్ అయ్యింది. కొత్త లీక్ ద్వారా ఈ ఫోన్ ధర కూడా రివీల్ అయ్యింది. రెండు స్టోరేజీ మోడల్స్ లో ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. బేస్ వేరియంట్ ధర రూ.20,000 వద్ద ఉంటుందని తెలుస్తోంది. సరే, ఓసారి Tecno Pova 6 Pro 5G ధర వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Tecno Pova 6 Pro 5G ఇండియా ధర (లీక్)

Tecno Pova 6 Pro 5G స్మార్ట్‌ఫోన్ ధరను ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు అంబోరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై షేర్ చేశారు.

Tecno Pova 6 Pro 5G డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ.

లీక్ ప్రకారం, Tecno Pova 6 Pro 5G డివైజ్ బేస్ మోడల్ ధర రూ.19,999 మరియు టాప్ మోడల్ ధర రూ.21,999 గా ఉంటుందని తెలుస్తోంది.

బేస్ మోడల్ పై డిస్కౌంట్ కూడా లభించనుంది. డిస్కౌంట్ తర్వాత ఈ డివైజ్ రూ.19,230 కి లభించనుండగా, టాప్ మోడల్ ధర డిస్కౌంట్ తర్వాత రూ.21,553 గా ఉంటుంది.

Tecno Pova 6 Pro 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno Pova 6 Pro 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ సపోర్ట్, డైనమిక్ పోర్ట్ ఫీచర్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Tecno Pova 6 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ ఉంటాయి. చిప్సెట్ 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Pova 6 Pro 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 12జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ తో వస్తోంది.
  • కెమెరా: Tecno Pova 6 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఏఐ థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Tecno Pova 6 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Tecno Pova 6 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

Source: 91mobiles Hindi

The post Tecno: లాంచ్‌కి ముందు లీకైన POVA 6 Pro 5G ధర first appeared on 91Mobiles Telugu.

]]>
MWC 2024: 108MP కెమెరాతో వస్తోన్న Tecno Pova 6 Pro; డివైజ్‌ని రివీల్ చేసిన టెక్నో! https://www.91mobiles.com/telugu/tecno-pova-6-pro-showcased-mwc-2024-featuring-108mp-camera/ Mon, 26 Feb 2024 16:02:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=10430 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Tecno మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో Tecno Pova 6 Pro డివైజ్ ని ప్రదర్శించింది. ఆకట్టుకునే డిజైన్‌ని ఈ ఫోన్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, 108ఎంపి మెయిన్ కెమెరా, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్‌ని ఈ ఫోన్ కలిగి ఉంది. సరే, ఓసారి Tecno Pova 6 Pro యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత […]

The post MWC 2024: 108MP కెమెరాతో వస్తోన్న Tecno Pova 6 Pro; డివైజ్‌ని రివీల్ చేసిన టెక్నో! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఎండబ్ల్యూసీ 2024 లో Tecno Pova 6 Pro ప్రదర్శన
  • ఇంకా వెల్లడి కాని లాంచ్ తేదీ, లభ్యత వివరాలు
  • కలర్స్: మిటియోరైట్ గ్రే, కామెట్ గ్రీన్

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Tecno మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో Tecno Pova 6 Pro డివైజ్ ని ప్రదర్శించింది. ఆకట్టుకునే డిజైన్‌ని ఈ ఫోన్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, 108ఎంపి మెయిన్ కెమెరా, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్‌ని ఈ ఫోన్ కలిగి ఉంది. సరే, ఓసారి Tecno Pova 6 Pro యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత వివరాలను తెలుసుకుందాం పదండి.

Tecno Pova 6 Pro ధర, లభ్యత

  • Tecno Pova 6 Pro స్మార్ట్‌ఫోన్ ధర ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. మార్చి మొదటి వారంలో ఈ ఫోన్ ఫిలిప్పైన్స్ లో లాంచ్ కానుంది. తర్వాత ఇతర మార్కెట్స్ లోకి ప్రవేశిస్తుంది.
  • Tecno Pova 6 Pro భారత మార్కెట్ లాంచ్ తేదీ వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో టెక్నో నుంచి ప్రకటన రానుంది.

Tecno Pova 6 Pro స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Tecno Pova 6 Pro డివైజ్ లో డైనమిక్-ఐ డిజైన్ హైలైట్ గా చెప్పవచ్చు. 210 సింగిల్-పాయింట్ కంట్రోల్డ్ మినీఎల్ఈడీ‌లు రింగ్-షేప్ లో పేర్చబడి ఉన్నాయి.

Tecno Pova 6 Pro డివైజ్ మీటియోరైట్ గ్రే మరియు కామెట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

  • డిస్ప్లే: Tecno Pova 6 Pro లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Tecno Pova 6 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Pova 6 Pro డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Tecno Pova 6 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Tecno Pova 6 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి 3ఎక్స్ జూమ్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఏఐ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ప్రైమరీ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Tecno Pova 6 Pro లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సెక్యూరిటీ: Tecno Pova 6 Pro లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.
  • బరువు, మందం: Tecno Pova 6 Pro డివైజ్ 7.8 మి.మీ మందం, 195 గ్రాముల బరువు ఉంటుంది.
  • ఆడియో: Tecno Pova 6 Pro లో 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంది.
  • కనెక్టివిటీ: Tecno Pova 6 Pro లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.

The post MWC 2024: 108MP కెమెరాతో వస్తోన్న Tecno Pova 6 Pro; డివైజ్‌ని రివీల్ చేసిన టెక్నో! first appeared on 91Mobiles Telugu.

]]>
TECNO: ఎఫ్‌సీసీ లిస్టింగ్ ద్వారా రివీలైన POVA 6 Pro 5G స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/tecno-pova-6-pro-5g-specs-revealed-via-fcc-listing/ Wed, 07 Feb 2024 10:22:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=10134 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు TECNO త్వరలో POVA 6 Pro 5G అనే స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో TECNO POVA 6 Pro 5G లాంచ్ కానుందని టెక్నో సంస్థ వెల్లడించింది. ఈలోపు TECNO POVA 6 Pro 5G ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా ప్రధాన స్పెసిఫికేషన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. TECNO […]

The post TECNO: ఎఫ్‌సీసీ లిస్టింగ్ ద్వారా రివీలైన POVA 6 Pro 5G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న TECNO POVA 6 Pro 5G
  • ఎమ్‌డబ్ల్యూసీ 2024 లో లాంచ్ అయ్యే అవకాశం
  • డైమెన్సిటీ 6080 చిప్సెట్ తో రానున్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు TECNO త్వరలో POVA 6 Pro 5G అనే స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో TECNO POVA 6 Pro 5G లాంచ్ కానుందని టెక్నో సంస్థ వెల్లడించింది. ఈలోపు TECNO POVA 6 Pro 5G ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా ప్రధాన స్పెసిఫికేషన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

TECNO POVA 6 Pro 5G ఎఫ్‌సీసీ లిస్టింగ్

  • TECNO POVA 6 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఎఫ్‌సీసీ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది. TECNO-L19 అనే మోడల్ నంబర్ తో డివైజ్ లిస్ట్ అయ్యింది.
  • TECNO POVA 6 Pro 5G లో బ్యాక్ ప్యానెల్ పై భారీ కెమెరా మాడ్యూల్ ఉంది. దీంట్లో డ్యూయల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • పవర్ బటన్ మరియు వాల్యూమ్ బటన్స్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి.

TECNO POVA 6 Pro 5G స్పెసిఫికేషన్స్ (ఎఫ్‌సీసీ)

  • ఎఫ్‌సీసీ లిస్టింగ్ పై TECNO POVA 6 Pro 5G డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో కనిపించింది.
  • TECNO POVA 6 Pro 5G డివైజ్ 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని ఎఫ్‌సీసీ ద్వారా తెలుస్తోంది.

TECNO POVA 6 Pro 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: TECNO POVA 6 Pro 5G లో 2436*1080 మరియు 480 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ సపోర్ట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: TECNO POVA 6 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి.
  • కెమెరా: TECNO POVA 6 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరాతో పాటు మరొక సెన్సర్ ఉంటుంది.

Tecno Pova 5 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno Pova 5 లో 6.78-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2460 పిక్సెల్ రెజుల్యూషన్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Tecno Pova 5 లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ ఫోన్ లో జీ యాక్సెస్ లీనియర్ వైబ్రేషన్ మోటర్ ఉంది.
  • స్టోరేజీ, ర్యామ్: Tecno Pova 5 లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • బ్యాటరీ: Tecno Pova 5 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. 21 నిమిషాల్లో ఫోన్ 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. అలాగే 10 వాట్ రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఈ ఫోన్ లో ఉంది.
  • కెమెరా: Tecno Pova 5 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • సౌండ్: Tecno Pova 5 డివైజ్ లో డ్యూయల్ స్పీకర్స్ , డీటీఎస్ సౌండ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ఓఎస్: Tecno Pova 5 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

The post TECNO: ఎఫ్‌సీసీ లిస్టింగ్ ద్వారా రివీలైన POVA 6 Pro 5G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>