
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో Pova 6 Pro 5G డివైజ్ ని గ్లోబల్‌గా పరిచయం చేసింది. ఈ ఫోన్ మార్చి 29న భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. అమెజాన్ పై ఇప్పటికే Tecno Pova 6 Pro 5G యొక్క ప్రొడక్ట్ పేజీ లిస్ట్ అయ్యింది. కొత్త లీక్ ద్వారా ఈ ఫోన్ ధర కూడా రివీల్ అయ్యింది. రెండు స్టోరేజీ మోడల్స్ లో ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. బేస్ వేరియంట్ ధర రూ.20,000 వద్ద ఉంటుందని తెలుస్తోంది. సరే, ఓసారి Tecno Pova 6 Pro 5G ధర వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Tecno Pova 6 Pro 5G ఇండియా ధర (లీక్)
Tecno Pova 6 Pro 5G స్మార్ట్‌ఫోన్ ధరను ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు అంబోరే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X పై షేర్ చేశారు.
Tecno Pova 6 Pro 5G డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ.
లీక్ ప్రకారం, Tecno Pova 6 Pro 5G డివైజ్ బేస్ మోడల్ ధర రూ.19,999 మరియు టాప్ మోడల్ ధర రూ.21,999 గా ఉంటుందని తెలుస్తోంది.
బేస్ మోడల్ పై డిస్కౌంట్ కూడా లభించనుంది. డిస్కౌంట్ తర్వాత ఈ డివైజ్ రూ.19,230 కి లభించనుండగా, టాప్ మోడల్ ధర డిస్కౌంట్ తర్వాత రూ.21,553 గా ఉంటుంది.
Tecno Pova 6 Pro 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Tecno Pova 6 Pro 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ సపోర్ట్, డైనమిక్ పోర్ట్ ఫీచర్ ఉంటాయి.
- ప్రాసెసర్: Tecno Pova 6 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ ఉంటాయి. చిప్సెట్ 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
- ర్యామ్, స్టోరేజీ: Tecno Pova 6 Pro 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 12జిబి ఎక్స్టెండెడ్ ర్యామ్ ఫీచర్ తో వస్తోంది.
- కెమెరా: Tecno Pova 6 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఏఐ థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Tecno Pova 6 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Tecno Pova 6 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.
Source: 91mobiles Hindi











