Tecno Spark 10 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 06 Mar 2023 05:44:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 90Hz డిస్ప్లే, 32MP ఫ్రంట్ కెమెరాతో లాంచైన Tecno Spark 10 Pro https://www.91mobiles.com/telugu/tecno-spark-10-pro-launched-price-specs-availability/ Mon, 06 Mar 2023 05:44:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=5221 Tecno సంస్థ ప్రధానంగా తన ఫోకస్ ని ఎంట్రీ లెవెల్, బడ్జెట్ కొనుగోలుదారులపై ఎక్కువగా పెడుతుంది. అందుకే వరుసగా చవకైన ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొస్తుంటుంది టెక్నో. తాజాగా ఈ సంస్థ నుంచి Tecno Spark 10 Pro అనే ఫోన్ లాంచ్ అయ్యింది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ తో ఈ ఫోన్ వచ్చింది. Tecno Spark 10 Pro స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి […]

The post 90Hz డిస్ప్లే, 32MP ఫ్రంట్ కెమెరాతో లాంచైన Tecno Spark 10 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ Tecno Spark 10 Pro ని లాంచ్ చేసిన TECNO
  • 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 50MP ప్రైమరీ కెమెరాతో వచ్చిన Tecno Spark 10 Pro
  • Tecno Spark 10 Pro డివైజ్ భారత మార్కెట్ లభ్యతపై ఇంకా ప్రకటన చేయాల్సిన Tecno

Tecno సంస్థ ప్రధానంగా తన ఫోకస్ ని ఎంట్రీ లెవెల్, బడ్జెట్ కొనుగోలుదారులపై ఎక్కువగా పెడుతుంది. అందుకే వరుసగా చవకైన ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొస్తుంటుంది టెక్నో. తాజాగా ఈ సంస్థ నుంచి Tecno Spark 10 Pro అనే ఫోన్ లాంచ్ అయ్యింది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ తో ఈ ఫోన్ వచ్చింది.

Tecno Spark 10 Pro స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి. రెండు కూడా ఎల్ఈడీ ఫ్లాషెస్ ని కలిగి ఉన్నాయి. ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 8జిబి ర్యామ్ ని కలిగి ఉన్నాయి. Tecno Spark 10 Pro స్మార్ట్ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ తదితర ఫీచర్లను గురించి తెలుసుకుందాం పదండి.

Tecno Spark 10 Pro ధర, లభ్యత

Tecno Spark 10 Pro స్మార్ట్ ఫోన్ 8జిబి + 128జిబి మరియు 8జిబి + 256జిబి వేరియంట్స్ లో లభిస్తుంది. టెక్నో ఇంకా ధరను వెల్లడించాల్సి ఉంది. ఇంకో విషయం ఏంటంటే, Tecno Spark 10 Pro భారత మార్కెట్ లభ్యతపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయమై టెక్నో నుంచి త్వరలోనే ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Tecno Spark 10 Pro స్పెసిఫికేషన్స్

Tecno Spark 10 Pro స్మార్ట్ ఫోన్ లో 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డీసీఐ-పీ3 కలర్ సపోర్ట్, సెంటర్ పంచ్ హోల్ నాచ్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ వాడారు. ఇది 12ఎన్ఎం ప్రాసెస్ పై తయారైంది. మాలి జీ52 జీపీయూ ని గ్రాఫిక్స్ కోసం వాడారు. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 12.6 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

Tecno Spark 10 Pro డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఒక ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32 ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇది డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ తో వచ్చింది.

Tecno Spark 10 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. పవర్ బటన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. 3.5 ఎంఎం ఆడియో జాక్ ఈ ఫోన్ లో ఉంది.

Tecno Spark 10 Pro డివైజ్ స్టారీ బ్లాక్, పర్ల్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. డ్యూయల్-సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 90Hz డిస్ప్లే, 32MP ఫ్రంట్ కెమెరాతో లాంచైన Tecno Spark 10 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
MWC 2023: Tecno Phantom V Fold, Spark 10 Pro ఫోన్లను అనౌన్స్ చేసిన TECNO https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-fold-spark-10-pro-launched-mwc-2023-price-specs-availability/ Tue, 28 Feb 2023 13:12:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=5145 Tecno Phantom V Fold స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం కొనసాగుతోన్న MWC 2023 ఈవెంట్ లో లాంచైనట్లు సమాచారం. ఫిబ్రవరి 28 న ఈ డివైజ్ లాంచ్ అవుతుందని గతంలో అనుకున్న అంచనాలు ఇప్పుడు నిజమయ్యాయి. ఈ డివైజ్ టెక్నో కంపెనీ నుంచి వచ్చిన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్. అలాగే ఇది ప్రపంచపు తొలి లెఫ్ట్-రైట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ గా చెప్పబడుతోంది. Tecno Phantom V Fold తో పాటు టెక్నో సంస్థ మరొక […]

The post MWC 2023: Tecno Phantom V Fold, Spark 10 Pro ఫోన్లను అనౌన్స్ చేసిన TECNO first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • MWC 2023 ఈవెంట్ లో తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ని లాంచ్ చేసిన టెక్నో సంస్థ
  • MediaTek Dimensity 9000+ చిప్సెట్ తో వచ్చిన Tecno Phantom V Fold డివైజ్
  • ఫోల్డబుల్ ఫోన్ తో పాటు లాంచైన Tecno Spark 10 Pro

Tecno Phantom V Fold స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం కొనసాగుతోన్న MWC 2023 ఈవెంట్ లో లాంచైనట్లు సమాచారం. ఫిబ్రవరి 28 న ఈ డివైజ్ లాంచ్ అవుతుందని గతంలో అనుకున్న అంచనాలు ఇప్పుడు నిజమయ్యాయి. ఈ డివైజ్ టెక్నో కంపెనీ నుంచి వచ్చిన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్. అలాగే ఇది ప్రపంచపు తొలి లెఫ్ట్-రైట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ గా చెప్పబడుతోంది.

Tecno Phantom V Fold తో పాటు టెక్నో సంస్థ మరొక స్మార్ట్ ఫోన్ Spark 10 Pro ని లాంచ్ చేసింది. సరే, ఇప్పుడు Tecno Phantom V Fold తో పాటు, Spark 10 Pro యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

Tecno Phantom V Fold, Spark 10 Pro ధర, లభ్యత

టెక్నో కంపెనీ ఇంకా ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ సేల్ తేదీలు, ధరల వివరాలను ప్రకటించాల్సి ఉంది. అయితే, మార్చి నెలలో Spark 10 Pro ఫోన్ సేల్ ఉంటుందని టెక్నో అఫీషియల్ గా ప్రకటించింది. ఈ రెండు ఫోన్లు భారత మార్కెట్ లో కూడా లాంచ్ అవుతాయని మేం అంచనా వేస్తున్నాం.

Tecno Phantom V Fold స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Tecno Phantom V Fold లో Samsung Galaxy Z Fold 4 తరహా ఫోల్డింగ్ మెకానిజమ్ ఉంటుంది. రివర్స్ స్నాప్ హింజ్ స్ట్రక్చర్ ని ఈ డివైజ్ కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ తో ఈ ఫోన్ రానుందని సమాచారం. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్సెట్. ఉత్తమమైన పెర్ఫామెన్స్ అందించడంతోపాటు, బ్యాటరీ వాడకాన్ని తగ్గించడం ఈ ప్రాసెసర్ ప్రత్యేకత.

Tecno Phantom V Fold ఫోన్ రియర్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ ఫ్రంట్ కెమెరా సెటప్ తో రానున్నట్లు సమాచారం. ఇప్పటివరకు టెక్నో రివీల్ చేసిన వివరాలు ఇవే.

Tecno Spark 10 Pro స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Tecno Spark 10 Pro ఒక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్. ఈ హ్యాండ్సెట్ మీడియాటెక్ హీలియో జీ88 గేమింగ్ ప్రాసెసర్ తో వచ్చింది. ఈ డివైజ్ లో ఐఫోన్ మాదిరి కెమెరా మాడ్యూల్ ఉంది. 50ఎంపి ప్రైమరీ కెమెరాను ఈ ఫోన్ లో అందిస్తున్నారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది. సెల్ఫీ కెమెరా డ్యూయల్ ఫ్లాష్ తో వస్తుండటం విశేషం. ఫోన్ కి సంబంధించిన ఇతర వివరాలు ప్రస్తుతానికి బయటకు రాలేదు.

అలాగే ఈవెంట్ లో Tecno సంస్థ కమెలియన్ కలర్ టెక్నాలజీని ప్రకటించింది. ఫోన్ లో వాడే యాప్ ని బట్టి బ్యాక్ ప్యానెల్ కలర్ మారడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. ఈ తరహా స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ ఇదే ప్రథమమని అందరూ విశ్వసిస్తున్నారు. త్వరలోనే టెక్నో ఈ టెక్నాలజీని తన ఫ్లాగ్షిప్ డివైజెస్ లో వాడే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post MWC 2023: Tecno Phantom V Fold, Spark 10 Pro ఫోన్లను అనౌన్స్ చేసిన TECNO first appeared on 91Mobiles Telugu.

]]>