
Tecno Phantom V Fold స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం కొనసాగుతోన్న MWC 2023 ఈవెంట్ లో లాంచైనట్లు సమాచారం. ఫిబ్రవరి 28 న ఈ డివైజ్ లాంచ్ అవుతుందని గతంలో అనుకున్న అంచనాలు ఇప్పుడు నిజమయ్యాయి. ఈ డివైజ్ టెక్నో కంపెనీ నుంచి వచ్చిన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్. అలాగే ఇది ప్రపంచపు తొలి లెఫ్ట్-రైట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ గా చెప్పబడుతోంది.
Tecno Phantom V Fold తో పాటు టెక్నో సంస్థ మరొక స్మార్ట్ ఫోన్ Spark 10 Pro ని లాంచ్ చేసింది. సరే, ఇప్పుడు Tecno Phantom V Fold తో పాటు, Spark 10 Pro యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.
Tecno Phantom V Fold, Spark 10 Pro ధర, లభ్యత
టెక్నో కంపెనీ ఇంకా ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ సేల్ తేదీలు, ధరల వివరాలను ప్రకటించాల్సి ఉంది. అయితే, మార్చి నెలలో Spark 10 Pro ఫోన్ సేల్ ఉంటుందని టెక్నో అఫీషియల్ గా ప్రకటించింది. ఈ రెండు ఫోన్లు భారత మార్కెట్ లో కూడా లాంచ్ అవుతాయని మేం అంచనా వేస్తున్నాం.
Tecno Phantom V Fold స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
Tecno Phantom V Fold లో Samsung Galaxy Z Fold 4 తరహా ఫోల్డింగ్ మెకానిజమ్ ఉంటుంది. రివర్స్ స్నాప్ హింజ్ స్ట్రక్చర్ ని ఈ డివైజ్ కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ తో ఈ ఫోన్ రానుందని సమాచారం. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్సెట్. ఉత్తమమైన పెర్ఫామెన్స్ అందించడంతోపాటు, బ్యాటరీ వాడకాన్ని తగ్గించడం ఈ ప్రాసెసర్ ప్రత్యేకత.
Tecno Phantom V Fold ఫోన్ రియర్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ ఫ్రంట్ కెమెరా సెటప్ తో రానున్నట్లు సమాచారం. ఇప్పటివరకు టెక్నో రివీల్ చేసిన వివరాలు ఇవే.
Tecno Spark 10 Pro స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
Tecno Spark 10 Pro ఒక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్. ఈ హ్యాండ్సెట్ మీడియాటెక్ హీలియో జీ88 గేమింగ్ ప్రాసెసర్ తో వచ్చింది. ఈ డివైజ్ లో ఐఫోన్ మాదిరి కెమెరా మాడ్యూల్ ఉంది. 50ఎంపి ప్రైమరీ కెమెరాను ఈ ఫోన్ లో అందిస్తున్నారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది. సెల్ఫీ కెమెరా డ్యూయల్ ఫ్లాష్ తో వస్తుండటం విశేషం. ఫోన్ కి సంబంధించిన ఇతర వివరాలు ప్రస్తుతానికి బయటకు రాలేదు.
అలాగే ఈవెంట్ లో Tecno సంస్థ కమెలియన్ కలర్ టెక్నాలజీని ప్రకటించింది. ఫోన్ లో వాడే యాప్ ని బట్టి బ్యాక్ ప్యానెల్ కలర్ మారడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. ఈ తరహా స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ ఇదే ప్రథమమని అందరూ విశ్వసిస్తున్నారు. త్వరలోనే టెక్నో ఈ టెక్నాలజీని తన ఫ్లాగ్షిప్ డివైజెస్ లో వాడే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












