
Tecno సంస్థ ప్రధానంగా తన ఫోకస్ ని ఎంట్రీ లెవెల్, బడ్జెట్ కొనుగోలుదారులపై ఎక్కువగా పెడుతుంది. అందుకే వరుసగా చవకైన ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొస్తుంటుంది టెక్నో. తాజాగా ఈ సంస్థ నుంచి Tecno Spark 10 Pro అనే ఫోన్ లాంచ్ అయ్యింది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ తో ఈ ఫోన్ వచ్చింది.
Tecno Spark 10 Pro స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి. రెండు కూడా ఎల్ఈడీ ఫ్లాషెస్ ని కలిగి ఉన్నాయి. ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 8జిబి ర్యామ్ ని కలిగి ఉన్నాయి. Tecno Spark 10 Pro స్మార్ట్ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ తదితర ఫీచర్లను గురించి తెలుసుకుందాం పదండి.
Tecno Spark 10 Pro ధర, లభ్యత
Tecno Spark 10 Pro స్మార్ట్ ఫోన్ 8జిబి + 128జిబి మరియు 8జిబి + 256జిబి వేరియంట్స్ లో లభిస్తుంది. టెక్నో ఇంకా ధరను వెల్లడించాల్సి ఉంది. ఇంకో విషయం ఏంటంటే, Tecno Spark 10 Pro భారత మార్కెట్ లభ్యతపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయమై టెక్నో నుంచి త్వరలోనే ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Tecno Spark 10 Pro స్పెసిఫికేషన్స్
Tecno Spark 10 Pro స్మార్ట్ ఫోన్ లో 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డీసీఐ-పీ3 కలర్ సపోర్ట్, సెంటర్ పంచ్ హోల్ నాచ్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ వాడారు. ఇది 12ఎన్ఎం ప్రాసెస్ పై తయారైంది. మాలి జీ52 జీపీయూ ని గ్రాఫిక్స్ కోసం వాడారు. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 12.6 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
Tecno Spark 10 Pro డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఒక ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32 ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇది డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ తో వచ్చింది.
Tecno Spark 10 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. పవర్ బటన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. 3.5 ఎంఎం ఆడియో జాక్ ఈ ఫోన్ లో ఉంది.
Tecno Spark 10 Pro డివైజ్ స్టారీ బ్లాక్, పర్ల్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. డ్యూయల్-సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











