TUV Certification - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 22 Jul 2024 12:06:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Infinix Zero 40 4G: గూగుల్ ప్లే కన్సోల్, టీయూవీ సైట్స్‌పై లిస్టైన జీరో 40 4జీ https://www.91mobiles.com/telugu/infinix-zero-40-4g-listed-google-play-console-tuv-sites/ https://www.91mobiles.com/telugu/infinix-zero-40-4g-listed-google-play-console-tuv-sites/#respond Mon, 22 Jul 2024 11:41:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=12612 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో జీరో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Infinix Zero 40 4G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ తో పాటు, టీయూవీ సర్టిఫికేషన్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీనికంటే ముందే 5జీ మోడల్ కూడా ఈ సర్టిఫికేషన్స్ పై కనిపించింది. దీంతో రెండు ఫోన్లు త్వరలో లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. Infinix […]

The post Infinix Zero 40 4G: గూగుల్ ప్లే కన్సోల్, టీయూవీ సైట్స్‌పై లిస్టైన జీరో 40 4జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Infinix Zero 40 4G లాంచ్
  • మోడల్ నంబర్ X6860
  • హీలియో జీ99 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో జీరో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Infinix Zero 40 4G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ తో పాటు, టీయూవీ సర్టిఫికేషన్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీనికంటే ముందే 5జీ మోడల్ కూడా ఈ సర్టిఫికేషన్స్ పై కనిపించింది. దీంతో రెండు ఫోన్లు త్వరలో లాంచ్ కానున్నాయని తెలుస్తోంది.

Infinix Zero 40 4G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

Infinix Zero 40 4G స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై X6860 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

క్రింద ఇమేజ్ లో Infinix Zero 40 4G పేరుని మీరు గమనించవచ్చు. సర్టిఫికేషన్ ప్రకారం, మీడియాటెక్ హీలియో జీ99 చిప్, మాలి జీ57 జీపీయూ తో ఈ ఫోన్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిప్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

ఇంకా Infinix Zero 40 4G డివైజ్ 1080*2436 పిక్సెల్ రెజుల్యూషన్, 480 పిక్సెల్ డెన్సిటీ తో లిస్ట్ అయ్యింది.

అలాగే గూగుల్ ప్లే కన్సోల్ పై ఈ ఫోన్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో కనిపించింది.

Infinix Zero 40 4G టీయూవీ లిస్టింగ్

Infinix Zero 40 4G డివైజ్ టీయూవీ సర్టిఫికేషన్ సైట్ పై X6860 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. అయితే ఫోన్ పేరును ఈ లిస్టింగ్ పై పేర్కొనలేదు.

Infinix Zero 40 4G డివైజ్ 4,900 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్నట్లు టీయూవీ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Infinix Zero 30 4G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Infinix Zero 30 4G లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix Zero 30 4G లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ వాడారు. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్.

మెమొరీ: Infinix Zero 30 4G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉంది.

కెమెరా: Infinix Zero 30 4G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Infinix Zero 30 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Infinix Zero 40 4G: గూగుల్ ప్లే కన్సోల్, టీయూవీ సైట్స్‌పై లిస్టైన జీరో 40 4జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-zero-40-4g-listed-google-play-console-tuv-sites/feed/ 0
OPPO: బీఐఎస్‌పై లిస్టైన Reno 12 Pro, త్వరలో భారత్‌లో లాంచ్ https://www.91mobiles.com/telugu/oppo-reno-12-pro-listed-on-bis-soon-launch-india/ Wed, 08 May 2024 15:15:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=11417 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో Reno 12 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో OPPO Reno 12 మరియు OPPO Reno 12 Pro ఫోన్లు లాంచ్ అవ్వనున్నాయి. తాజాగా OPPO Reno 12 Pro ఫోన్ భారత్‌కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. అంతేకాదు ఎస్డీపీపీఐ, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ సైట్స్ పై కూడా లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం […]

The post OPPO: బీఐఎస్‌పై లిస్టైన Reno 12 Pro, త్వరలో భారత్‌లో లాంచ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO Reno 12 Pro లాంచ్
  • డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్
  • SDPPI లిస్టింగ్ మోడల్ నంబర్ CPH2629

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో Reno 12 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో OPPO Reno 12 మరియు OPPO Reno 12 Pro ఫోన్లు లాంచ్ అవ్వనున్నాయి. తాజాగా OPPO Reno 12 Pro ఫోన్ భారత్‌కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. అంతేకాదు ఎస్డీపీపీఐ, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ సైట్స్ పై కూడా లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.

OPPO Reno 12 Pro సర్టిఫికేషన్ వివరాలు

OPPO Reno 12 Pro స్మార్ట్‌ఫోన్ ఎస్టీపీపీఐ సర్టిఫికేషన్ పై CPH2629 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

OPPO Reno 12 Pro యొక్క పేరు కూడా ఈ లిస్టింగ్ పై స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ ఫోన్ బీఐఎస్, ఐఎండీఏ, ఈఈసీ మరియు టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్స్ పై కూడా ఇదే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

బీఐఎస్ పై లిస్ట్ అవ్వడంతో OPPO Reno 12 Pro త్వరలోనే భారత్ లో లాంచ్ అవ్వనుందని స్పష్టమైంది.

టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ లిస్టింగ్ పై ఒప్పో రెనో 12 ప్రో 4,880 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో లిస్ట్ అయ్యింది.

OPPO Reno 12 Pro కెమెరా ఎఫ్‌వీ 5 లిస్టింగ్

OPPO Reno 12 Pro స్మార్ట్‌ఫోన్ Camera FV-5 డేటాబేస్ పై కూడా లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్ ప్రకారం, OPPO Reno 12 Pro ఫోన్ 50ఎంపి మెయిన్ కెమెరా, ఈఐఎస్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

OPPO Reno 12 Pro స్మార్ట్‌ఫోన్ లో 50ఎంపి సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది.

OPPO Reno 12 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OPPO Reno 12 Pro లో 6.7-ఇంచ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: OPPO Reno 12 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ స్టార్ స్పీడ్ ఎడిషన్ ప్రాసెసర్ ఉంటుందని సమాచారం.

కెమెరా: OPPO Reno 12 Pro లో 50ఎంపి పొట్రెయిట్ 2x ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉంటుందని సమాచారం.

బ్యాటరీ: OPPO Reno 12 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4880 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post OPPO: బీఐఎస్‌పై లిస్టైన Reno 12 Pro, త్వరలో భారత్‌లో లాంచ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Tecno: టీయూవీ సర్టిఫికేషన్ పొందిన Tecno Camon 30 Premier https://www.91mobiles.com/telugu/tecno-camon-30-premier-receives-tuv-certification/ Mon, 29 Jan 2024 05:46:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=9947 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Tecno త్వరలో Tecno Camon 30 Premier డివైజ్ ని లాంచ్ చేయనుంది. గతేడాది లాంచైన Tecno Camon 20 Premier కి సక్సెసర్ గా Tecno Camon 30 Premier డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. త్వరలోనే Tecno Camon 30 Premier లాంచ్ ప్రకటన కంపెనీ నుంచి రానుంది. ఇప్పటికే ఈఈసీ, బ్లూటూత్ ఎస్ఐజీ, గీక్‌బెంచ్ వంటి సర్టిఫికేషన్ ప్లాట్ఫామ్స్ లో లిస్టైన Tecno Camon 30 Premier తాజాగా […]

The post Tecno: టీయూవీ సర్టిఫికేషన్ పొందిన Tecno Camon 30 Premier first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Tecno Camon 30 Premier
  • టీయూవీ సర్టిఫికేషన్ పొందిన డివైజ్
  • 4,900ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న హ్యాండ్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Tecno త్వరలో Tecno Camon 30 Premier డివైజ్ ని లాంచ్ చేయనుంది. గతేడాది లాంచైన Tecno Camon 20 Premier కి సక్సెసర్ గా Tecno Camon 30 Premier డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. త్వరలోనే Tecno Camon 30 Premier లాంచ్ ప్రకటన కంపెనీ నుంచి రానుంది. ఇప్పటికే ఈఈసీ, బ్లూటూత్ ఎస్ఐజీ, గీక్‌బెంచ్ వంటి సర్టిఫికేషన్ ప్లాట్ఫామ్స్ లో లిస్టైన Tecno Camon 30 Premier తాజాగా టీయూవీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

Tecno Camon 30 Premier టీయూవీ సర్టిఫికేషన్

  • Tecno Camon 30 Premier స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీయూవీ పై లిస్ట్ అయ్యింది.
  • Tecno Camon 30 Premier టీయూవీ సర్టిఫికేషన్ ద్వారా డివైజ్ యొక్క బ్యాటరీ కెపాసిటీ రివీల్ అయ్యింది.
  • Tecno Camon 30 Premier డివైజ్ 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ తో టీయూవీ పై లిస్ట్ అయ్యింది.
  • బ్యాటరీ, చార్జింగ్ పోర్ట్ వివరాలు తప్పా మిగతా స్పెసిఫికేషన్స్ ఏవీ టీయూవీ ద్వారా రివీల్ కాలేదు.

ఇక అంతకు ముందు గీక్‌బెంచ్ పై Tecno Camon 30 Premier డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 529 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1355 పాయింట్లు స్కోర్ చేసింది.

ఇంకా Tecno Camon 30 Premier డివైజ్ గీక్‌బెంచ్ పై ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది. కానీ, టెక్నో ఈ ఫోన్ ని ఆండ్రాయిడ్ 14 తో తీసుకొచ్చే అవకాశం ఉంది.

గూగుల్ పిక్సెల్ కాకుండా ఆండ్రాయిడ్ 14 ఓఎస్ అప్డేట్ పొందిన మొదటి ఫోన్ గా Tecno Camon 20 Premier నిలిచింది. కాబట్టి, Tecno Camon 30 Premier కూడా ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో రానుందని భావించవచ్చు.

ఇక బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ పై Tecno Camon 30 Premier డివైజ్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో లిస్ట్ అయ్యింది.

Tecno Camon 30 Premier లాంచ్ తేదీ

Tecno Camon 30 Premier లాంచ్ తేదీని టెక్నో సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సర్టిఫికేషన్స్ ని బట్టి చూస్తే, డివైజ్ లాంచ్ సమీపిస్తోందని చెప్పవచ్చు. త్వరలోనే Tecno Camon 30 Premier పూర్తి స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్ వెల్లడయ్యే అవకాశం ఉంది.

The post Tecno: టీయూవీ సర్టిఫికేషన్ పొందిన Tecno Camon 30 Premier first appeared on 91Mobiles Telugu.

]]>
Nothing: టీయూవీ సర్టిఫికేషన్ పొందిన Nothing Phone (2a) https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-receives-tuv-certification/ Sun, 28 Jan 2024 15:49:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=9943 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing త్వరలో Nothing Phone (2a) డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇంకా ఈ డివైజ్ యొక్క లాంచ్ తేదీ వెల్లడి కాలేదు. త్వరలోనే కంపెనీ నుంచి అధికార ప్రకటన రానుంది. తాజాగా Nothing Phone (2a) టీయూవీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క ఛార్జింగ్ స్పీడ్ వివరాలు రివీల్ అయ్యాయి. ఇకపోతే, Nothing Phone (2a) ఫోన్ ఇప్పటికే బీఐఎస్ మరియు టీడీఆర్ఏ సర్టిఫికేషన్స్ పొందింది. […]

The post Nothing: టీయూవీ సర్టిఫికేషన్ పొందిన Nothing Phone (2a) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Nothing Phone (2a)
  • టీయూవీ సర్టిఫికేషన్ పై కనిపించిన డివైజ్
  • రివీలైన Nothing Phone (2a) చార్జింగ్ స్పీడ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing త్వరలో Nothing Phone (2a) డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇంకా ఈ డివైజ్ యొక్క లాంచ్ తేదీ వెల్లడి కాలేదు. త్వరలోనే కంపెనీ నుంచి అధికార ప్రకటన రానుంది. తాజాగా Nothing Phone (2a) టీయూవీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క ఛార్జింగ్ స్పీడ్ వివరాలు రివీల్ అయ్యాయి. ఇకపోతే, Nothing Phone (2a) ఫోన్ ఇప్పటికే బీఐఎస్ మరియు టీడీఆర్ఏ సర్టిఫికేషన్స్ పొందింది. సరే, ఓసారి Nothing Phone (2a) యొక్క టీయూవీ సర్టిఫికేషన్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Nothing Phone (2a) టీయూవీ సర్టిఫికేషన్

  • Nothing Phone (2a) టీయూవీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యినట్లు Gizmochina తన కథనం ద్వారా వెల్లడించింది.
  • Nothing Phone (2a) స్మార్ట్‌ఫోన్ టీయూవీ డేటాబేస్ పై A142 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Nothing Phone (2a) డివైజ్ టీయూవీ సర్టిఫికేషన్ లిస్టింగ్ పై 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో కనిపిస్తోంది.
  • Nothing Phone (2a) యొక్క ఛార్జింగ్ స్పీడ్ వివరాలు మినహా, మరే ఇతర వివరాలు తెలియలేదు.
  • Nothing Phone (2a) డివైజ్ ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది.
  • Nothing Phone (2a) లాంచ్ తేదీని త్వరలోనే కంపెనీ అధికారికంగా ప్రకటించనుంది.

Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది.
  • ప్రాసెసర్: Nothing Phone (2a) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంటుందని రూమర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Nothing Phone (2a) స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.
  • కెమెరా: Nothing Phone (2a) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయని అంచనా వేస్తున్నారు. కెమెరా ఐల్యాండ్ చుట్టూ గ్లైఫ్ ఎల్ఈడీ లైట్ స్ట్రిప్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: Nothing Phone (2a) లో 4,290 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానుందని టీయూవీ సర్టిఫికేషన్ ద్వారా తెలుస్తోంది.
  • ఓఎస్: Nothing Phone (2a) స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.
  • కలర్ ఆప్షన్స్: Nothing Phone (2a) డివైజ్ తెలుపు మరియు నలుపు రంగుల్లో లభించనుందని అంచనా వేస్తున్నారు.

Nothing Phone (2a) ధర

  • Nothing Phone (2a) స్మార్ట్‌ఫోన్ బేస్ మోడల్ ధర 400 యూరోల లోపు ఉంటుందని తెలుస్తోంది.

The post Nothing: టీయూవీ సర్టిఫికేషన్ పొందిన Nothing Phone (2a) first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: బ్లూటూత్ ఎస్ఐజీ, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్స్ పొందిన Samsung Galaxy A55 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a55-5g-received-bluetooth-sig-tuv-rheinland-certifications/ Wed, 24 Jan 2024 08:48:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=9895 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy A55 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. గత మోడల్ Samsung Galaxy A54 5G కి ఇది సక్సెసర్ గా వస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా బ్లూటూత్ ఎస్ఐజీ మరియు టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్స్ కూడా పొందింది. సరే, ఓసారి […]

The post Samsung: బ్లూటూత్ ఎస్ఐజీ, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్స్ పొందిన Samsung Galaxy A55 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A55 5G
  • ఎగ్జినోస్ చిప్సెట్ తో రానున్న డివైజ్
  • డిస్ప్లే: సూపర్ అమోలెడ్ పుల్ హెచ్డీ+

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy A55 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. గత మోడల్ Samsung Galaxy A54 5G కి ఇది సక్సెసర్ గా వస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా బ్లూటూత్ ఎస్ఐజీ మరియు టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్స్ కూడా పొందింది. సరే, ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A55 5G బ్లూటూత్ ఎస్ఐజీ, టీయూవీ రెయిన్‌ల్యాండ్ వివరాలు

 

  • Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ మరియు టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది.
  • Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ SM-A5560 SM-A556E అనే మోడల్ నంబర్స్ ని కలిగి ఉంది.
  • బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ ద్వారా బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ రివీల్ అయ్యింది.
  • మరోవైపు రెయిన్‌ల్యాండ్ లిస్టింగ్ ద్వారా 2.77ఏ ఔట్‌పుట్ సపోర్ట్ గల 9వీ డీసీ
    అడాప్టర్ రివీల్ అయ్యింది.
  • అంతకు ముందు 3సీ సర్టిఫికేషన్ ద్వారా 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఖరారైంది.

Samsung Galaxy A55 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy A55 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A55 5G లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్, ఏఎండీ జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A55 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy A55 5G లో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 5 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ గతంలో బెంచ్ మార్కింగ్ ప్లాట్‌ఫామ్ గీక్‌బెంచ్ పై ఎగ్జినోస్ 1480 చిప్సెట్ తో లిస్ట్ అయ్యింది. ఇక రెండర్స్ ద్వారా డిజైన్ కూడా లీక్ అయ్యింది. శాంసంగ్ కంపెనీ ఇంకా Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ యొక్క లాంచ్ తేదీని ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

The post Samsung: బ్లూటూత్ ఎస్ఐజీ, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్స్ పొందిన Samsung Galaxy A55 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Nothing Phone (1) ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే https://www.91mobiles.com/telugu/nothing-phone-1-fast-charging-speed-tuv-certification-33w-45w/ Fri, 08 Jul 2022 16:25:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=859 హైలైట్స్: * నథింగ్ ఫోన్ (1) 33 వాట్ సపోర్ట్ తో వస్తోందని టీయూవీ సర్టిఫికేషన్ రివీల్ చేసింది. * అయితే 45 వాట్ మాగ్జిమమ్ సపోర్ట్ ఉండనున్నట్లు సమాచారం. * నథింగ్ ఫోన్ (1) భారత్ లో జులై 12 న రాత్రి 8.30 గంటలకు లాంచ్ అవుతోంది. Nothing Phone (1) టీయూవీ సర్టిఫికేషన్స్ ని గమనిస్తే నిర్ధిష్టంగా లేని ఛార్జింగ్ స్పీడ్స్ కనిపిస్తున్నాయి. టిప్ స్టర్ ముకుల్ శర్మ షేర్ చేసిన నథింగ్ […]

The post Nothing Phone (1) ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

* నథింగ్ ఫోన్ (1) 33 వాట్ సపోర్ట్ తో వస్తోందని టీయూవీ సర్టిఫికేషన్ రివీల్ చేసింది.

* అయితే 45 వాట్ మాగ్జిమమ్ సపోర్ట్ ఉండనున్నట్లు సమాచారం.

* నథింగ్ ఫోన్ (1) భారత్ లో జులై 12 న రాత్రి 8.30 గంటలకు లాంచ్ అవుతోంది.

Nothing Phone (1) టీయూవీ సర్టిఫికేషన్స్ ని గమనిస్తే నిర్ధిష్టంగా లేని ఛార్జింగ్ స్పీడ్స్ కనిపిస్తున్నాయి. టిప్ స్టర్ ముకుల్ శర్మ షేర్ చేసిన నథింగ్ ఫోన్ (1) TUV SUD లిస్టింగ్ లో 33W ఛార్జింగ్ సపోర్ట్ (11Vdc, 3A) మరియు 45W మాగ్జిమమ్ సపోర్ట్ అని ఉంది. గత నివేదికలు నథింగ్ ఫోన్ (1) 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుందని తెలిపాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నథింగ్ ఫోన్ (1) బాక్స్ లో ఛార్జర్ తో రావడం లేదు.

నథింగ్ ఫోన్ (1) క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778+ 5జీ చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత నథింగ్ ఓఎస్, డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ గ్లైప్ ఎల్ఈడీ లైట్ ఇంటర్ఫేస్ ను వెనుక భాగాన కలిగి ఉంది. తమిళనాడులో ఫోన్ తయారవ్వడం వల్లన భారత్ లో నథింగ్ ఫోన్ (1) సరసనమైన ధరలో లభించనుంది. జులై 12 న రాత్రి 8.30 గంటలకు భారత్ లో నథింగ్ ఫోన్ (1) లాంచ్ కి ముహూర్తం ఖరారైంది. ఫ్లిప్ కార్ట్, రిలయన్స్ డిజిటల్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Nothing Phone (1) లాంచ్, ధర వివరాలు

TUV SUD లిస్టింగ్ ని బట్టి చూస్తే, నథింగ్ ఫోన్ (1) 33 వాట్ లేదా 45 వాట్ లలో ఏ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుందోనన్న దానిపై స్పష్టత లేదు. కానీ, టాక్ ని బట్టి చూస్తే, నథింగ్ ఫోన్ (1) బాక్స్ లో ఛార్జర్ తో రావడం లేదని తెలుస్తోంది. కొన్ని రోజులు ఆగితే గాని అసలు విషయం ఏంటో తెలిసేలా లేదు. నథింగ్ ఫోన్ (1) నలుపు, తెలుపు రంగుల్లో లభ్యం కానుంది. ధర రూ.35,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Nothing Phone (1) స్పెసిఫికేషన్స్

స్నాప్ డ్రాగన్ 778+ 5జీ చిప్సెట్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 33W/45W ఛార్జింగ్ సపోర్ట్, 6.43-అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత నథింగ్ ఓఎస్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 16ఎంపి సెల్పీ కెమెరా, 50ఎంపి మెయిన్ కెమెరా, 16ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా వంటి ఫీచర్లు నథింగ్ ఫోన్ (1) లో ఉండనున్నాయి.

The post Nothing Phone (1) ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే first appeared on 91Mobiles Telugu.

]]>