Vivo S16 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 09:17:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత మార్కెట్‌లో ఫిబ్రవరిలో లాంచ్ కానున్న Vivo V27 సిరీస్ https://www.91mobiles.com/telugu/vivo-v27-series-india-launch-february-vivo-s16-rebrand-version/ Tue, 31 Jan 2023 05:16:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=4699 Vivo సంస్థ 2022 డిసెంబర్ లో చైనాలో Vivo S16 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం మూడు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అవి: Vivo S16e, Vivo S16, Vivo S16 Pro. తాజాగా అందిన సమాచారం ఏంటంటే, Vivo S16 సిరీస్ భారత్ లో Vivo V27 సిరీస్ గా లాంచ్ అవుతోంది. Vivo V27 సిరీస్ భారత్ లో ఫిబ్రవరి రెండో వారంలో లేదా చివరి వారంలో లాంచ్ […]

The post భారత మార్కెట్‌లో ఫిబ్రవరిలో లాంచ్ కానున్న Vivo V27 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరిలో భారత్ లో లాంచ్ అవుతోన్న Vivo V27 సిరీస్
  • Vivo S16 సిరీస్ ఆధారంగా వస్తోన్న Vivo V27 సిరీస్ ఫోన్లు
  • Vivo S16 సిరీస్ లో ఉన్న 3 డివైజ్‌లు ఇవే: Vivo S16e, Vivo S16, Vivo S16 Pro

Vivo సంస్థ 2022 డిసెంబర్ లో చైనాలో Vivo S16 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం మూడు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అవి: Vivo S16e, Vivo S16, Vivo S16 Pro. తాజాగా అందిన సమాచారం ఏంటంటే, Vivo S16 సిరీస్ భారత్ లో Vivo V27 సిరీస్ గా లాంచ్ అవుతోంది. Vivo V27 సిరీస్ భారత్ లో ఫిబ్రవరి రెండో వారంలో లేదా చివరి వారంలో లాంచ్ కానుందని తెలుస్తోంది.

గతంలో వచ్చిన కథనాలను బట్టి, Vivo V27 సిరీస్ భారతీయ మార్కెట్ లో 2023 మొదట్లోనే లాంచ్ అవ్వనుందని తెలిసింది. ఇక తాజాగా లాంచ్ టైమ్ లైన్ ని ట్వీట్ చేసిన టిప్‌స్టర్, Vivo S16 సిరీస్ డివైజెస్ పలు మార్పులు చేర్పులతో Vivo V27 సిరీస్ గా వస్తోందని తెలిపాడు. సరే, ఓసారి Vivo V27 సిరీస్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

గతేడాది, వివో సంస్థ Vivo S15 సిరీస్ ని భారతీయ మార్కెట్ లో Vivo V25 పేరుతో లాంచ్ చేసింది. దీంతో రానున్న Vivo V27 సిరీస్ విషయంలో కూడా ఇదే జరగనుంది. అయితే, Vivo V27 సిరీస్ లో భాగంగా ఎన్ని డివైజెస్ ని కంపెనీ లాంచ్ చేస్తుందన్న విషయం ఇంకా తెలియలేదు. సరే, మరొకసారి Vivo S16 స్పెసిఫికేషన్స్ పై కన్నేద్దాం పదండి.

Vivo S16 సిరీస్ స్పెసిఫికేషన్స్

Vivo S16, Vivo S16 Pro ఫోన్స్ 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, హెచ్డీఆర్10+ తో వచ్చాయి. మరోవైపు Vivo S16e స్మార్ట్ ఫోన్ 6.62-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది.

Vivo S16 స్నాప్ డ్రాగన్ 870 చిప్సెట్, Vivo S16 Pro మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, Vivo S16e ఎగ్జినోస్ 1080 ప్రాసెసర్స్ తో వచ్చాయి. Vivo S16 Pro డివైజ్ లో వివో 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ అందించింది. మరోవైపు Vivo S16, Vivo S16e ఫోన్లు 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ తో వచ్చాయి. ఈ మూడు ఫోన్లు కూడా యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వచ్చాయి.

Vivo S16 సిరీస్ స్మార్ట్ ఫోన్లు 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉన్నాయి. Vivo S16 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 సెన్సర్ ఉంది. ఇక Vivo S16 లో 64ఎంపి ప్రైమరీ కెమెరా ఉంది. Vivo S16e లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంది. Vivo S16, Vivo S16 Pro ఫోన్లు 50ఎంపి ఫ్రంట్ కెమెరాతో వచ్చాయి. ఇక Vivo S16e 16ఎంపి ఫ్రంట్ కెమెరాతో వచ్చింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత మార్కెట్‌లో ఫిబ్రవరిలో లాంచ్ కానున్న Vivo V27 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
50ఎంపి సెల్ఫీ కెమెరా, 64ఎంపి మెయిన్ కెమెరాతో లాంచైన Vivo S16 5G https://www.91mobiles.com/telugu/vivo-s16-5g-launched-china-price-specs/ Fri, 23 Dec 2022 13:48:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=4149 హైలైట్స్ స్నాప్ డ్రాగన్ 870 చిప్సెట్ తో చైనాలో లాంచైన Vivo S16 5G స్మార్ట్ ఫోన్ 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 64ఎంపి రియర్ కెమెరాతో లాంచైన ఫోన్ ముందు వెనక ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ తో వచ్చిన Vivo S16 5G ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన ఎస్-సిరీస్ ఫోన్లను చైనాలో లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో Vivo S16, Vivo S16 Pro, Vivo S16e ఫోన్లు మార్కెట్ లోకి […]

The post 50ఎంపి సెల్ఫీ కెమెరా, 64ఎంపి మెయిన్ కెమెరాతో లాంచైన Vivo S16 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • స్నాప్ డ్రాగన్ 870 చిప్సెట్ తో చైనాలో లాంచైన Vivo S16 5G స్మార్ట్ ఫోన్
  • 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 64ఎంపి రియర్ కెమెరాతో లాంచైన ఫోన్
  • ముందు వెనక ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ తో వచ్చిన Vivo S16 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన ఎస్-సిరీస్ ఫోన్లను చైనాలో లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో Vivo S16, Vivo S16 Pro, Vivo S16e ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ప్రస్తుతం చైనా మార్కెట్ కే పరిమితమైన ఈ ఫోన్లు త్వరలోనే భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో కూడా లాంచ్ కాబోతున్నాయి. ప్రస్తుతం మనం Vivo S16 5G యొక్క స్పెసిఫికేషన్స్, ధర ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo S16 5G స్పెసిఫికేషన్స్

Vivo S16 5G స్మార్ట్ ఫోన్ 20:9 యాస్పెక్ట్ రేషియోతో లాంచైంది. ఇది 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్ కల్గి ఉంది. పంచ్-హోల్ స్టైల్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Vivo S16 5G స్మార్ట్ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. హెచ్డీఆర్10+ సపోర్ట్ తో ఈ ఫోన్ వచ్చింది.

Vivo S16 5G ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో లాంచైంది. ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై ఫోన్ పని చేస్తుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడారు. ఇది 3.2 గిగాహెర్ట్జ్ కలిగిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఈ చిప్ 7 నానోమీటర్ ఫాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో అడ్రెనో 650 జీపీయూ వాడారు. ఈ ఫోన్ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీతో లాంచైంది.

ఈ ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Vivo S16 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50 ఎంపి భారీ ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ కెమెరాతో పాటు డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంటుంది.

Vivo S16 5G డ్యూయల్ సిమ్, 5జీ, ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ తో వచ్చింది. బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ వంటి ఇతర బేసిక్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. 3.5ఎంఎం ఆడియో జాక్ కూడా ఈ ఫోన్ లో ఉంది. పవర్ బ్యాకప్ కోసం Vivo S16 5G లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Vivo S16 5G ధర, వేరియంట్స్

Vivo S16 5G స్మార్ట్ ఫోన్ చైనాలో 4 వేరియంట్లలో లాంచైంది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ. ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్, గ్రేడియంట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క ధరలు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ చూద్దాం.

  • Vivo S16 5G 8జిబి+128జిబి వేరియంట్ ధర: 2499 యువాన్లు (సుమారు రూ.29,500).
  • Vivo S16 5G 8జిబి+256జిబి వేరియంట్ ధర: 2699 యువాన్లు (సుమారు రూ.32,000).
  • Vivo S16 5G 12జిబి+256జిబి వేరియంట్ ధర: 2999 యువాన్లు (సుమారు రూ.35,500.
  • Vivo S16 5G 12జిబి+512జిబి వేరియంట్ ధర: 3299 యువాన్లు (సుమారు రూ.39,000).

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 50ఎంపి సెల్ఫీ కెమెరా, 64ఎంపి మెయిన్ కెమెరాతో లాంచైన Vivo S16 5G first appeared on 91Mobiles Telugu.

]]>
రివీల్ అయిన Vivo S16, S16 Pro, S16e డిజైన్ రెండర్స్ https://www.91mobiles.com/telugu/vivo-s16-series-design-renders-launch-event/ Mon, 19 Dec 2022 12:20:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=4060 హైలైట్స్ త్వరలో చైనాలో లాంచ్ కానున్న Vivo S16, S16 Pro, S16e ఫోన్లు ఎస్15 సిరీస్ కి సక్సెసర్ గా రానున్న Vivo S16 సిరీస్ తాజాగా రివీల్ అయిన Vivo S16, S16 Pro, S16e ఫోన్ల యొక్క డిజైన్ రెండర్స్ చైనాలో త్వరలో Vivo S16 సిరీస్ లాంచ్ అవ్వనున్నట్లు వివో కన్ఫర్మ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 3 స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. అవి: Vivo S16, S16 […]

The post రివీల్ అయిన Vivo S16, S16 Pro, S16e డిజైన్ రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో చైనాలో లాంచ్ కానున్న Vivo S16, S16 Pro, S16e ఫోన్లు
  • ఎస్15 సిరీస్ కి సక్సెసర్ గా రానున్న Vivo S16 సిరీస్
  • తాజాగా రివీల్ అయిన Vivo S16, S16 Pro, S16e ఫోన్ల యొక్క డిజైన్ రెండర్స్

చైనాలో త్వరలో Vivo S16 సిరీస్ లాంచ్ అవ్వనున్నట్లు వివో కన్ఫర్మ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 3 స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. అవి: Vivo S16, S16 Pro, S16e. అయితే కంపెనీ ఈ మూడు డివైజెస్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ని ఇంకా వెల్లడించలేదు. ఈలోపే Vivo S16, S16 Pro, S16e యొక్క డిజైన్ రెండర్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి.

ప్రముఖ టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ తాజాగా ఈ స్మార్ట్ ఫోన్స్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలను వెల్లడించాడు. అలాగే డిజైన్ రెండర్స్ ని ఎక్స్‌క్లూజివ్ గా MySmartPrice తో షేర్ చేశాడు. Vivo S16, S16 Pro, S16e డివైజెస్ యొక్క డిజైన్ రెండర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo S16 సిరీస్ డిజైన్ రెండర్స్

ఎస్15 సిరీస్ కి సక్సెసర్ గా Vivo S16 సిరీస్ చైనాలో లాంచ్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్స్ వేరే పేరుతో ఇతర మార్కెట్స్ లో లాంచ్ కానున్నాయి. అయితే వివో ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. టిప్‌స్టర్ అగర్వాల్ చెబుతున్న దాని ప్రకారం, Vivo S16e ఫ్లాట్ డిస్ప్లే తో వస్తోందట. ఇతర రెండు మోడల్స్ మాత్రం కర్వ్డ్ స్క్రీన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

Vivo S16e

Vivo S16e స్క్రీన్ ఫ్లాట్ గా, సన్నని బెజెల్స్ తో ఉంటుంది. ఇకపోతే చిన్ కూడా మూడు మోడల్స్ లో సన్నగానే ఉంది. 3 ఫోన్లలో హోల్-పంచ్ కటౌట్ ఉంది.

Vivo S16e డివైజ్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ తో వస్తోంది. బ్యాక్ ప్యానెల్ ఫ్లాట్ గా ఉంది. అన్ని ఫోన్లలో పవర్, వాల్యూమ్ బటన్స్ కుడివైపున ఉన్నాయి. మూడు ఫోన్లలో రెక్టాంగ్యులర్ రియర్ కెమెరా మాడ్యూల్ ఉంది. మూడు ఫోన్లలో ట్రిపుల్ కెమెరా సెటప్, సర్క్యులర్ ఎల్ఈడీ లైట్ ఉన్నాయి.

Vivo S16e లావెండర్/పర్పుల్, సైయన్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. Vivo S16, Vivo S16 Pro గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో వస్తున్నాయి. Vivo S16 స్టాండర్డ్ వర్షన్ గోల్డ్ కలర్ ఆప్షన్ లో కూడా లభించనుంది.

అగర్వాల్ Vivo S16 Pro యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ చేశాడు. అవెలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

 

Vivo S16 Pro స్పెసిఫికేషన్స్

Vivo S16 Pro 6.78-ఇంచ్ అమోలెడ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తోంది. ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉండనుంది. 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఈ ఫోన్లో ఉంటాయి. పవర్ బ్యాకప్ కోసం 4600ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

Vivo S16 Pro యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది. భద్రత కోసం ఈ డివైజ్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. ఈ డివైజ్ 164 మిల్లీ మీటర్ల పొడవు, 74.8 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.4 మిల్లీ మీటర్ల మందం, 183 గ్రాముల బరువు ఉంటుంది.

Vivo S16 సిరీస్ చైనాలో డిసెంబర్ 22 న జరిగే లాంచ్ ఈవెంట్ లో రివీల్ కానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రివీల్ అయిన Vivo S16, S16 Pro, S16e డిజైన్ రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు రివీల్ అయిన Vivo S16, Vivo S16e పూర్తి స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-s16-vivo-s16e-full-specs-revealed/ Thu, 15 Dec 2022 04:21:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=3993 హైలైట్స్ రివీల్ అయిన Vivo S16, Vivo S16e స్పెసిఫికేషన్స్ ఈ నెలలో లాంచ్ కానున్న Vivo S16, Vivo S16e డివైజెస్ స్నాప్ డ్రాగన్ 870 చిప్ తో వస్తోన్న Vivo S16, ఎగ్జినోస్ 1080 చిప్ తో వస్తోన్న Vivo S16e ఈ ఏడాది మే నెలలో చైనాలో Vivo S15, Vivo S15 Pro లాంచ్ అయ్యాయి. ఇప్పుడు 7 నెలల తర్వాత, వివో వీటికి సక్సెసర్స్ ని తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. […]

The post లాంచ్ కి ముందు రివీల్ అయిన Vivo S16, Vivo S16e పూర్తి స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • రివీల్ అయిన Vivo S16, Vivo S16e స్పెసిఫికేషన్స్
  • ఈ నెలలో లాంచ్ కానున్న Vivo S16, Vivo S16e డివైజెస్
  • స్నాప్ డ్రాగన్ 870 చిప్ తో వస్తోన్న Vivo S16, ఎగ్జినోస్ 1080 చిప్ తో వస్తోన్న Vivo S16e

ఈ ఏడాది మే నెలలో చైనాలో Vivo S15, Vivo S15 Pro లాంచ్ అయ్యాయి. ఇప్పుడు 7 నెలల తర్వాత, వివో వీటికి సక్సెసర్స్ ని తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. కొన్ని రోజుల నుంచి Vivo S16, Vivo S16 Pro ఫోన్లు వార్తల్లో నిలుస్తూ వస్తున్నాయి. ఈవారంలోనే ఈ రెండు ఫోన్లు కూడా గీక్ బెంచ్ పై దర్శనమిచ్చాయి. అయితే ఇప్పుడు వీటికి తోడు Vivo S16e మోడల్ కూడా ఉండనున్నట్లు తెలిసింది.

అయితే ఈ Vivo S16 సిరీస్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. ఇండస్ట్రీ వార్తల ప్రకారం, ఈ నెలలోనే చైనాలో ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. ఇక వివో ఎస్15 ని వివో భారత్ లో లాంచ్ చేయలేదు. కావున, ఎస్16 సిరీస్ కూడా భారతదేశంలో లాంచ్ అవుతుందని మేం భావించడం లేదు. రానున్న రోజుల్లో ఏం జరగనుందో చూద్దాం. ఇప్పుడైతే, Vivo S16, Vivo S16e స్మార్ట్ ఫోన్స్ యొక్క స్పెసిఫికేషన్స్ పై ఓ కన్నేద్దాం పదండి.

రివీల్ అయిన Vivo S16, Vivo S16e స్పెసిఫికేషన్స్

టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ చెబుతున్న దాన్ని బట్టి, Vivo S16 స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 870 చిప్, 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీతో రానుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Vivo S16 లో 64ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి. ఈ డివైజ్ 182 గ్రాముల బరువు, 7.4 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. ఇంకా ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ కూడా ఉంటాయి.

Vivo S16e స్పెసిఫికేషన్స్

Vivo S16e లో 6.62-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్ ఉంటాయి. వివో ఈసారి ఈ ఫోన్ లో శాంసంగ్ యొక్క ఎగ్జినోస్ 1080 చిప్సెట్ వాడుతోంది. ఈ డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీతో రానుంది.

Vivo S16e లో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో షూటర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది.

పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ 7.8 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ కూడా ఈ ఫోన్ లో ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందు రివీల్ అయిన Vivo S16, Vivo S16e పూర్తి స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
12GB ర్యామ్, Snapdragon 870 చిప్సెట్ తో లాంచ్ కానున్న Vivo S16 https://www.91mobiles.com/telugu/vivo-s16-geekbench-launch-timeline-key-specs/ Wed, 14 Dec 2022 11:35:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=3983 హైలైట్స్ Geekbench పై కనిపించిన Vivo S16 స్మార్ట్ ఫోన్ V2244A అనే మోడల్ నంబర్ ని కలిగి ఉన్న Vivo S16 12జిబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 చిప్సెట్, అడ్రోనో 650 జీపీయూ తో రానున్న Vivo S16 గీక్ బెంచ్ పై సింగిల్ కోర్ టెస్ట్ లో 1016 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో 3,138 పాయింట్లు సాధించిన Vivo S16 Vivo S16 స్మార్ట్ ఫోన్ త్వరలోనే లాంచ్ […]

The post 12GB ర్యామ్, Snapdragon 870 చిప్సెట్ తో లాంచ్ కానున్న Vivo S16 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Geekbench పై కనిపించిన Vivo S16 స్మార్ట్ ఫోన్
  • V2244A అనే మోడల్ నంబర్ ని కలిగి ఉన్న Vivo S16
  • 12జిబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 చిప్సెట్, అడ్రోనో 650 జీపీయూ తో రానున్న Vivo S16
  • గీక్ బెంచ్ పై సింగిల్ కోర్ టెస్ట్ లో 1016 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో 3,138 పాయింట్లు సాధించిన Vivo S16

Vivo S16 స్మార్ట్ ఫోన్ త్వరలోనే లాంచ్ కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం వివో సంస్థ ఈ డివైజ్ పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ డివైజ్ గీక్ బెంచ్ పై కనిపించడంతో ఈ విషయం స్పష్టమైంది. నేడు, 91మొబైల్స్ Vivo S16 ని గీక్ బెంచ్ పై గుర్తించింది. దీంతో ఫోన్ యొక్క త్వరలోనే లాంచ్ కానున్నట్లు అర్థమైంది. అలాగే లిస్టింగ్ ద్వారా ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చాయి.

అయితే Vivo S16 మోడల్ ఎలా ఉండనుందో ఇంకా తెలియాల్సి ఉంది. బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్ బెంచ్ పై Vivo S16 డివైజ్ V2244A అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో రానుంది.

Vivo S16 గీక్ బెంచ్ లిస్టింగ్

Vivo S16 స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 870 చిప్సెట్ తో వస్తున్నట్లు గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసింది. ఈ చిప్ 3.19 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంటుంది. అలాగే ఇందులో గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 650 జీపీయూ ని వాడినట్లు తెలుస్తోంది. ఇకపోతే Vivo S16 స్మార్ట్ ఫోన్ 12జిబి ర్యామ్ తో రానుంది.

గీక్ బెంచ్ పై Vivo S16 స్మార్ట్ ఫోన్ సింగిల్ కోర్ టెస్ట్ లో 1016 పాయింట్లు, మల్టీ కోర్ట్ టెస్ట్ లో 3138 పాయింట్లు సాధించింది. ఇవి తప్పితే Vivo S16 యొక్క ఇతర ఫీచర్లు ఏమీ తెలియలేదు. అయితే, ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, హై-రిఫ్రెష్ రేట్, భారీ బ్యాటరీ, డ్యూయల్/ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటాయని మనం అంచనా వేయవచ్చు.

రూమర్లను బట్టి, Vivo S16 ఈ నెలలో చైనాలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఇక అటు తర్వాత, భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో రిలీజ్ అవుతుంది. అయితే, ఇప్పటి వరకు ఈ డివైజ్ యొక్క ధర, డిజైన్, ఇతర వివరాలు రహస్యంగానే ఉన్నాయి. ఏదేమైనా, రానున్న రోజుల్లో Vivo S16 యొక్క వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ Vivo S16 సిరీస్ లో స్టాండర్డ్ వేరియంట్ S16 తో పాటు S16 Pro కూడా ఉంటుంది. భారత్ లో ఈ డివైజెస్ లాంచ్ కి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 12GB ర్యామ్, Snapdragon 870 చిప్సెట్ తో లాంచ్ కానున్న Vivo S16 first appeared on 91Mobiles Telugu.

]]>