Vivo T1x - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 20 Jul 2022 09:31:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్ లో లాంచ్ అయిన Vivo T1x https://www.91mobiles.com/telugu/vivo-t1x-launched-in-india-price-specs-availability/ Wed, 20 Jul 2022 09:31:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=1099 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన వివో టీ1ఎక్స్ 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 4జీ నెట్వర్క్ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలు భారత్ లో వివో టీ1ఎక్స్ ధర రూ.11,999 వివో టీ1ఎక్స్ భారత్ లో లాంచ్ అయ్యింది. వివో నుంచి వస్తున్న అతిపెద్ద బ్యాటరీ కలిగిన టీ-సిరీస్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ హ్యాండ్సెట్ వాటర్ డ్రాప్ నాచ్ ని […]

The post భారత్ లో లాంచ్ అయిన Vivo T1x first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన వివో టీ1ఎక్స్
  • 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 4జీ నెట్వర్క్ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలు
  • భారత్ లో వివో టీ1ఎక్స్ ధర రూ.11,999

వివో టీ1ఎక్స్ భారత్ లో లాంచ్ అయ్యింది. వివో నుంచి వస్తున్న అతిపెద్ద బ్యాటరీ కలిగిన టీ-సిరీస్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ హ్యాండ్సెట్ వాటర్ డ్రాప్ నాచ్ ని కలిగి ఉంది. ఈ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫ్లాట్ ఎడ్జెస్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, రెక్ట్యాంగులర్ మాడ్యూల్ లో డ్యూయల్ రియర్ కెమెరాను ఈ ఫోన్ కలిగి ఉంది. 4 లేయర్ (గ్రాఫైట్ కూలింగ్ ప్లేట్, హై హీట్ కండక్టివిటీ కాపర్ కాయిల్, థర్మల్లీ కండక్టివ్ జెల్, కూలింగ్ టర్బో) కూలింగ్ సిస్టమ్ ఈ ఫోన్లో ఉండటం వల్లన గేమ్స్ ఆడేటప్పుడు మల్టీ టర్బో 5.0 నెట్వర్క్ కనెక్షన్ ను ఎన్హాన్స్ చేయడంతోపాటు, ప్రాసెసర్ వేగాన్ని పెంచి, పవర్ ను సేవ్ చేస్తుంది.

6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 4జీ నెట్వర్క్ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50ఎంపి ప్రైమరీ సెన్సర్ వంటి కీలకమైన ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

భారత్ లో Vivo T1x ధర, సేల్ డేట్, లభ్యత

భారత్ లో వివో టీ1ఎక్స్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 4జిబి+64జిబి వేరియంట్ ధర రూ.11,999, 4జిబి+128జిబి వేరియంట్ ధర రూ.12,999, 6జిబి+128జిబి మోడల్ ధర రూ.14,999. ఇక హ్యాండ్సెట్ గ్రేవిటీ బ్లాక్, స్పేస్ బ్లూ రంగుల ఆప్షన్స్ లో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ మరియు వివో ఈ-స్టోర్ ద్వారా ఈ ఫోన్ జులై 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కు వస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాక్ క్రెడిట్, డెబిట్ మరియు ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది.

వివో టీ1ఎక్స్ ఫోన్లో 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ 2.5డీ ఎల్సీడీ డిస్ప్లే, 2408*1080 రెజుల్యూషన్, సెల్ఫీ షూటర్ కోసం వాటర్ డ్రాప్ నాచ్, 90.6 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 96 పర్సెంట్ ఎన్టీఎస్సీ, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, అడ్రెనో 610 జీపీయూ వంటి ఫీచర్లు ఉన్నాయి. 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్ 128జిబి స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. అలాగే 2 జిబి వరకు ఎక్స్ టెండబుల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

వివో టీ1ఎక్స్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 4 లేయర్ కూలింగ్ సిస్టమ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, వివో ఎనర్జీ గార్డియన్ ఫీచర్ (ఇది బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, ఫోన్ హీట్ అవ్వకుండా చూస్తుంది) ఈ ఫోన్లో ఉన్నాయి.

ఇప్పుడు కెమెరా విభాగం యొక్క విశేషాలను ఇక్కడ చూద్దాం. వివో టీ1ఎక్స్ లో రెండు వెనుక కెమెరాలున్నాయి. వీటిలో ఒకటి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కాగా, మరొకటి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

వివో టీ1ఎక్స్ లో ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. ఈ విషయాన్ని కొనుగోలుదారులు గమనించాలి. అయితే ధర, ఇతర ఫీచర్లను బట్టి, ఈ ఫోన్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అని చెప్పవచ్చు. మిగతా అన్ని విషయాల్లో ఈ ఫోన్ చక్కటి ఫీచ్లను కలిగి ఉంది. కాబట్టి, తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు పొందాలనుకునే వారు ఈ ఫోన్ ని కన్సిడర్ చేయవచ్చు.

The post భారత్ లో లాంచ్ అయిన Vivo T1x first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన Vivo T1x ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-t1x-specs-and-features-tipped-before-its-launch/ Tue, 19 Jul 2022 08:57:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=1064 హైలైట్స్: లాంచ్ కి ముందు నెట్టింట్లో ప్రత్యక్షమైన వివో టీ1ఎక్స్ ధర, స్పెసిఫికేషన్స్ భారత్ లో వివో టీ1ఎక్స్ ధర రూ.11,999 (4జిబి+64జిబి) ఉండే అవకాశం స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12 ఈ ఫోన్ ప్రత్యేకతలు. జులై 20 న భారత్ లో వీవో టీ1ఎక్స్ ను లాంచ్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఇక కంపెనీ ఈ ఫోన్ కి సంబంధించిన పలు ఫీచర్లను టీజ్ […]

The post లాంచ్ కి ముందు లీకైన Vivo T1x ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లాంచ్ కి ముందు నెట్టింట్లో ప్రత్యక్షమైన వివో టీ1ఎక్స్ ధర, స్పెసిఫికేషన్స్
  • భారత్ లో వివో టీ1ఎక్స్ ధర రూ.11,999 (4జిబి+64జిబి) ఉండే అవకాశం
  • స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12 ఈ ఫోన్ ప్రత్యేకతలు.

జులై 20 న భారత్ లో వీవో టీ1ఎక్స్ ను లాంచ్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఇక కంపెనీ ఈ ఫోన్ కి సంబంధించిన పలు ఫీచర్లను టీజ్ చేస్తూ వస్తోంది. స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ మరియు సెగ్మెంట్-ఫస్ట్ 4-లేయర్ కూలింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ కలిగి ఉందని కంపెనీ చెబుతోంది. ఇక టీ-సిరీస్ లో టీ1ఎక్స్ కొత్త ఫోన్ గా జతచేరనుంది. ఇతర టీ-సిరీస్ ఫోన్స్ మాదిరిగానే టీ1ఎక్స్ డిజైన్ కూడా ఉన్నట్లు అర్థమవుతోంది. ఇప్పుడు లాంచ్ కు ముందు, పూర్తి స్పెసిఫికేషన్స్, ధర నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. 91మొబైల్స్ హిందీ, లీక్ స్టర్ యోగేశ్ బ్రార్ టీ1ఎక్స్ డిటైల్స్ ను వెలుగులోకి తీసుకు వచ్చారు.

వివో టీ1ఎక్స్ 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఎక్స్ టెండబుల్ ర్యామ్, రెండు కలర్ ఆప్షన్స్ తో వస్తోంది. ఇకపోతే ఈ ఫోన్ బడ్జెట్ శ్రేణి కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని తయారుచేయబడినది. వివో తన వెబ్ సైట్ లో పెట్టిన టీజర్ ను బట్టి, ఈ ఫోన్ రెండు రంగుల్లో లభ్యం కానుందని తెలుస్తోంది.

Vivo T1x ధర (అంచనా)

వివో టీ1ఎక్స్ 4జిబి+64జిబి వేరియంట్ ధర రూ.11,499 గా ఉండనుందని సమాచారం. స్పెసిఫికేషన్స్ ని బట్టి చూస్తే, ఈ ధర సరైనదేనని అనిపిస్తోంది. టిప్ స్టర్ ప్యాషనేట్ గీక్జ్ ట్వీట్ ని బట్టి, ఈ ఫోన్ గ్రావిటీ బ్లాక్, స్పేస్ బ్లూ రంగుల్లో లభ్యం కానుందని తెలుస్తోంది.

మలేషియాలో వివో టీ1ఎక్స్ 4జిబి+64జిబి వేరియంట్ ధర MYR 649 (దాదాపు రూ.11,700) గా ఉంది. ఇక 8జిబి+128జిబి ధర MYR 799 (రూ.14,400) గా ఉంది. ఇక జులై 20 న 8జిబి+128జిబి వేరియంట్ కూడా భారత్ లో లాంచ్ అవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Vivo T1x స్పెసిఫికేషన్స్

వివో టీ1ఎక్స్ లో 6.58-అంగుళాల ఫుల్ హెచ్డీ+ 2.5డీ ఎల్సీడీ డిస్ప్లే, 2408*1080 రెజుల్యూషన్, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, 4జిబి ర్యామ్, 64జిబి లేదా 128జిబి స్టోరేజీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక ఈ ఫోన్ బరువు 200 గ్రాములు.

ఈ ఫోన్లో ఉన్న స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ అన్ టు టు బెంచ్ మార్క్ అప్లికేషన్ పై 2,76000 స్కోర్ చేసినట్లు సమాచారం. ఇక ఈ ఫోన్లో 4 లేయర్ కూలింగ్ సిస్టమ్ అందించారు. దీని ద్వారా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫోన్ హీట్ కాకుండా ఉంటుందని కంపెనీ చెబుతోంది. మరి ఫోన్ లాంచ్ అయ్యాక ఈ టెక్నాలజీ ఎలా పని చేస్తుందో తెలిసే అవకాశముంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే, ఈ ఫోన్లో 50ఎంపి ప్రైమరీ కెమెరా విత్ నైట్ మోడ్, 8ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి థర్డ్ సెన్సర్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, వివో ఎనర్జీ గార్డియన్ టెక్నాలజీ వంటి ఇతర ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

ఫోన్ యొక్క ఫీచర్లను బట్టి ఇది బడ్జెట్ కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని లాంచ్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇందులో ఎల్సీడీ డిస్ప్లే ఉందన్న విషయం గమనించాలి. అయితే ధర, ఇతర ఫీచర్లను బట్టి చూస్తే, వివో టీ1ఎక్స్ వాల్యూ ఫర్ మనీ ఆఫరింగ్ అని స్పష్టంగా తెలుస్తోంది.

The post లాంచ్ కి ముందు లీకైన Vivo T1x ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో Vivo T1x లాంచ్ కి ముహూర్తం ఖరారు, డిజైన్ ఇదిగో..!! https://www.91mobiles.com/telugu/vivo-confirmed-launch-of-vivo-t1x-phone-in-india-a-third-device-from-t-series/ Fri, 15 Jul 2022 11:14:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=1007 హైలైట్స్: జులై 20, మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానున్న వివో టీ1ఎక్స్ నీలం, నలుపు రంగు ఆప్షన్స్ తో వస్తున్న వివో టీ1ఎక్స్ వివో అధికార వెబ్ సైట్, ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్స్ భారత్ లో తన తదుపరి టీ-సిరీస్ ఫోన్ టీ1ఎక్స్ ని లాంచ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో సిద్ధమవుతోంది. టీ1ఎక్స్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయబోతున్నట్లు వివో కంపెనీ ఇటీవలె టీజ్ చేసింది. తాజాగా, […]

The post భారత్ లో Vivo T1x లాంచ్ కి ముహూర్తం ఖరారు, డిజైన్ ఇదిగో..!! first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • జులై 20, మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానున్న వివో టీ1ఎక్స్
  • నీలం, నలుపు రంగు ఆప్షన్స్ తో వస్తున్న వివో టీ1ఎక్స్
  • వివో అధికార వెబ్ సైట్, ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్స్

భారత్ లో తన తదుపరి టీ-సిరీస్ ఫోన్ టీ1ఎక్స్ ని లాంచ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో సిద్ధమవుతోంది. టీ1ఎక్స్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయబోతున్నట్లు వివో కంపెనీ ఇటీవలె టీజ్ చేసింది. తాజాగా, సదరు కంపెనీ వివో టీ1ఎక్స్, కలర్ ఆప్షన్స్, లభ్యత, డిజైన్ వంటి విషయాలను అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. వివో వెబ్ సైట్ లో వివో టీ1ఎక్స్ యొక్క మైక్రో సైట్ ని ప్రస్తుతం మనం గమనించవచ్చు. వివో టీ-సిరీస్ లో వస్తోన్న మూడో ఫోన్ వివో టీ1ఎక్స్. ఇది వరకు టీ-సిరీస్ లో వివో టీ1 (4జీ, 5జీ), వివో టీ1 ప్రో అనే రెండు ఫోన్స్ వచ్చాయి. మరి వివో టీ1ఎక్స్ ప్రత్యేకతలేంటో ఇక్కడ చూద్దాం పదండి.

Vivo T1x ఇండియా లాంచ్, లభ్యత

వివో టీ1ఎక్స్ భారత్ లో జులై 20 న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతోంది. వివో అధికార వెబ్ సైట్ తో పాటు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. వివో టీ1ఎక్స్ నలుపు మరియు నీలం రంగు ఆప్షన్స్ లో వస్తోంది.

Vivo T1x డిజైన్

వివో టీ1ఎక్స్ డిజైన్ ఫ్లాట్ గా, బాక్సీ గా కనిపిస్తోంది. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్, రెక్ట్యాంగులర్ ఐలాండ్ లో పైన ఎడమ వైపు కార్నర్ లో ఉంది. ఇక వివో బ్రాండింగ్ క్రింద ఎడమ వైపు కార్నర్ లో కనిపిస్తోంది. ఫోన్ కి పై భాగాన సిమ్ ట్రే, మైక్రోఫోన్ కటౌట్ ఉన్నాయి.

Vivo T1x స్పెసిఫికేషన్స్

లీక్ ద్వారా వివో టీ1ఎక్స్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఇలా ఉండనున్నాయని తెలుస్తోంది. అవేంటో ఇక్కడ చూద్దాం పదండి. 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ వంటి ఫీచర్లు వివో టీ1ఎక్స్ లో ఉండనున్నాయి.

మరి కెమెరా విభాగంలో ఎటువంటి లెన్స్ లు ఉన్నాయో చూద్దాం రండి. వివో టీ1ఎక్స్ స్మార్ట్ ఫోన్ వెనుక వైపున 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8ఎంపి షూటర్ ఉంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే, వివో టీ1ఎక్స్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post భారత్ లో Vivo T1x లాంచ్ కి ముహూర్తం ఖరారు, డిజైన్ ఇదిగో..!! first appeared on 91Mobiles Telugu.

]]>
ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్ముడవ్వనున్న Vivo T1x https://www.91mobiles.com/telugu/vivo-t1x-budget-offering-from-vivo-confirmed-launch-in-india/ Tue, 12 Jul 2022 15:07:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=930 హైలైట్స్: * భారత్ లో వివో టీ1ఎక్స్ లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. * ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్మకాలు జరుపుకోనుంది. * ఇంకా కంపెనీ నుంచి టీ1ఎక్స్ ఇండియా లాంచ్ కి సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది. కానీ వార్తలను బట్టి ఈ నెలాఖరున ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. వివో ఇండియా తన కొత్త టీ-సిరీస్ ఫోన్ వివో టీ1ఎక్స్ ని భారత్ లో లాంచ్ చేయబోతున్నట్లు కన్ఫర్మ్ చేసింది. కంపెనీ అధికార వెబ్ […]

The post ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్ముడవ్వనున్న Vivo T1x first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

* భారత్ లో వివో టీ1ఎక్స్ లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది.

* ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్మకాలు జరుపుకోనుంది.

* ఇంకా కంపెనీ నుంచి టీ1ఎక్స్ ఇండియా లాంచ్ కి సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది. కానీ వార్తలను బట్టి ఈ నెలాఖరున ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

వివో ఇండియా తన కొత్త టీ-సిరీస్ ఫోన్ వివో టీ1ఎక్స్ ని భారత్ లో లాంచ్ చేయబోతున్నట్లు కన్ఫర్మ్ చేసింది. కంపెనీ అధికార వెబ్ సైట్ లో ఈ ఫోన్ కి సంబంధించిన డెడికేటెడ్ మైక్రో సైట్ ద్వారా ఇది స్పష్టమవుతోంది. వెబ్ సైట్ లో ఉన్న ల్యాండింగ్ పేజ్ లింక్ ద్వారా ఈ ఫోన్ Vivo T1x అని అర్థమవుతోంది. టీజర్ ఇమేజ్ ద్వారా కెమెరా మాడ్యూల్ డిజైన్, బ్లూ కలర్ ఆప్షన్ వంటివి తెలియవస్తున్నాయి. ఫోన్ కి సంబంధించి ట్విట్టర్ లో వచ్చిన షార్ట్ వీడియో లో ఫ్లిప్ కార్ట్ అని మెన్షన్ చేయడం ద్వారా, టీ1ఎక్స్ ఫోన్ ఆన్ లైన్ ద్వారా సేల్ కి వస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది వరకు వివో నుంచి వచ్చిన టీ-సిరీస్ ఫోన్లు ఫ్లిప్ కార్ట్ ద్వారానే అమ్మకాలు జరుపుకున్న సంగతి తెలిసిందే.

ఇక టీజర్ ఇమేజ్ ద్వారా టీ1ఎక్స్ ఫోన్లో డ్యూయల్ రియల్ కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్, రెక్ట్యాంగులర్ మ్యాడ్యూల్, బాక్సీ డిజైన్, రౌండెడ్ ఎడ్జెస్ వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి, ఇతర వివో టీ-సిరీస్ ఫోన్లతో దీనికి పోలికలున్నట్లు అర్థమవుతోంది.

అధికారికంగా కన్ఫర్మ్ అయిన Vivo T1x

వివో కంపెనీ వివో టీ1ఎక్స్ ఫోన్ లాంచ్ ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ అవ్వనుంది. అయితే కచ్చితమైన తేదీ ఇంకా తెలియలేదు. అయితే ఈ నెలాఖరులో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇకపోతే, ఈ ఫోన్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్మకాలు జరుపుకోనుంది. అలాగే వివో అఫీషియల్ స్టోర్స్ ద్వారా కూడా ఫోన్ లభ్యమయ్యే అవకాశాలున్నాయి. ఇదివరకే ఉన్న వివో టీ1 44డబ్ల్యూ, వివో టీ1 5జీ ఫోన్లతో టీ1ఎక్స్ జత చేరనుంది. ఇప్పటికే టీ1 44డబ్ల్యూ, టీ1 5జీ ఫోన్లు ఫ్లిప్ కార్ట్ లో అమ్ముడవుతున్నాయి. అయితే టీ1ఎక్స్ ఫోన్ 4జీ కనెక్టివిటీ తో వస్తున్న తక్కువ ధర కలిగిన ఫోన్ అని రూమర్లు వస్తున్నాయి.

Vivo T1x స్పెసిఫికేషన్స్ (అంచనా)

రూమర్ల ద్వారా తెలియవస్తున్న స్పెసిఫికేషన్స్ ని బట్టి, Vivo T1x ఫోన్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 2408*1080 రెజుల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 5,000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లను కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు కెమెరా విభాగానికి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. Vivo T1x ఫోన్లో వెనుక భాగాన 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ సెన్సర్, 2MP థర్డ్ సెన్సర్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగాన 8MP కెమెరా ఉంది. కనెక్టివిటీ ఫీచర్లను ఓసారి చూద్దాం. ఈ ఫోన్లో 4G, Wi-Fi, బ్లూటూత్ 5.0, మల్టీ-టర్బో 5.0, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

ప్రస్తుతానికి ఈ ఫోన్ కి సంబంధించిన వివరాలివే. ఎలాగూ వివో కంపెనీ, టీ1ఎక్స్ ఫోన్ లాంచ్ ని కన్ఫర్మ్ చేసినందున, త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

The post ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్ముడవ్వనున్న Vivo T1x first appeared on 91Mobiles Telugu.

]]>