Vivo V29 Lite 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 02 Jun 2023 10:23:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Snapdragon 695 చిప్, 120Hz డిస్ప్లే, 44W చార్జింగ్‌తో లాంచైన Vivo V29 Lite 5G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-v29-lite-5g-launched-czech-republic-price-specs/ Fri, 02 Jun 2023 10:23:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=6599 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో చెక్ రిపబ్లిక్ లో Vivo V29 Lite 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ హ్యాండ్సెట్ హార్డ్‌వేర్ రీసెంట్ గా లాంచ్ అయిన Vivo Y78 5G గ్లోబల్ మోడల్ ని పోలి ఉంది. Vivo V29 Lite 5G డివైజ్ లో సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్, డ్యూయల్ సర్క్యులర్ రింగ్స్, ట్రిపుల్ రియర్ కెమెరా సెన్సర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, కర్వ్డ్ ఎడ్జెస్, స్నాప్ […]

The post Snapdragon 695 చిప్, 120Hz డిస్ప్లే, 44W చార్జింగ్‌తో లాంచైన Vivo V29 Lite 5G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చెక్ రిపబ్లిక్ లో లాంచైన Vivo V29 Lite 5G
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వచ్చిన డివైజ్
  • 8జిబి+128జిబి మోడల్ ధర CZK 8,499 (సుమారు రూ.31,900)

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో చెక్ రిపబ్లిక్ లో Vivo V29 Lite 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ హ్యాండ్సెట్ హార్డ్‌వేర్ రీసెంట్ గా లాంచ్ అయిన Vivo Y78 5G గ్లోబల్ మోడల్ ని పోలి ఉంది. Vivo V29 Lite 5G డివైజ్ లో సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్, డ్యూయల్ సర్క్యులర్ రింగ్స్, ట్రిపుల్ రియర్ కెమెరా సెన్సర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, కర్వ్డ్ ఎడ్జెస్, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

సరే, ఓసారి Vivo V29 Lite 5G స్మార్ట్ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V29 Lite 5G ధర

  • Vivo V29 Lite 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర CZK 8,499 (సుమారు రూ.31,900) గా ఉంది.
  • Vivo V29 Lite 5G హ్యాండ్సెట్ డార్క్ బ్లాక్ మరియు సమ్మర్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Vivo V29 Lite 5G డివైజ్ ఇప్పటికే ప్రీ-సేల్ కి రెడీ గా ఉంది. ఇకపోతే, జూన్ 15 నుంచి ఈ ఫోన్ సేల్ మొదలు కానుంది.

Vivo V29 Lite 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే
  • 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Vivo V29 Lite 5G స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం ఐ ప్రొటెక్షన్, 1300 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ

  • స్నాప్ డ్రాగన్ 695
  • 8జిబి ర్యామ్
  • 128జిబి స్టోరేజీ

Vivo V29 Lite 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీ అందించారు.

ఓఎస్, బ్యాటరీ

  • ఆండ్రాయిడ్ 13
  • 5000 ఎంఏహెచ్

Vivo V29 Lite 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ, సెక్యూరిటీ

  • 5జీ, 4జీ వొల్టీ
  • ఎన్ఎఫ్‌సీ

Vivo V29 Lite 5G డివైజ్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

The post Snapdragon 695 చిప్, 120Hz డిస్ప్లే, 44W చార్జింగ్‌తో లాంచైన Vivo V29 Lite 5G; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Vivo V29 Lite 5G డిజైన్ రెండర్స్; కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ట్రిపుల్-కెమెరా సెటప్ తో రానున్న డివైజ్! https://www.91mobiles.com/telugu/vivo-v29-lite-5g-design-renders-leaked-expected-specs-price/ Mon, 22 May 2023 10:52:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=6421 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో V29 సిరీస్ ని లాంచ్ చేయబోతోంది. ఈ లైనప్ లో కంపెనీ కనీసం రెండు ఫోన్లను లాంచ్ చేసే అవకాశం ఉంది. అవి: Vivo V29 Lite 5G మరియు Vivo V29 Pro 5G. అయితే ఈ రెండు మోడల్స్ కి మధ్యలో Vivo V29 5G కూడా వచ్చేందుకు చాన్స్ ఉంది. ఇంకా వివో సంస్థ డివైజెస్ వివరాలను కన్ఫర్మ్ చేయలేదు. జూన్ లో Vivo […]

The post లీకైన Vivo V29 Lite 5G డిజైన్ రెండర్స్; కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ట్రిపుల్-కెమెరా సెటప్ తో రానున్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జూన్ లో Vivo V29 Lite 5G లాంచ్ అయ్యే అవకాశం
  • ప్రధాన ఆకర్షణగా నిలవనున్న కర్వ్డ్ డిస్ప్లే
  • డిజైన్ రెండర్స్‌ని రివీల్ చేసిన టిప్‌స్టర్ పారస్ గుగ్లాని

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో V29 సిరీస్ ని లాంచ్ చేయబోతోంది. ఈ లైనప్ లో కంపెనీ కనీసం రెండు ఫోన్లను లాంచ్ చేసే అవకాశం ఉంది. అవి: Vivo V29 Lite 5G మరియు Vivo V29 Pro 5G. అయితే ఈ రెండు మోడల్స్ కి మధ్యలో Vivo V29 5G కూడా వచ్చేందుకు చాన్స్ ఉంది. ఇంకా వివో సంస్థ డివైజెస్ వివరాలను కన్ఫర్మ్ చేయలేదు. జూన్ లో Vivo V29 సిరీస్ లాంచ్ కానుందని రూమర్ల ద్వారా తెలుస్తోంది. ఈలోపు ఒక కొత్త లీక్ ద్వారా Vivo V29 Lite 5G డిజైన్ రెండర్స్ లీక్ అయ్యాయి.

టిప్‌స్టర్ పారస్ గుగ్లాని, The Tech Outlook సౌజన్యంతో Vivo V29 Lite 5G డివైజ్ డిజైన్ రెండర్స్ షేర్ చేశారు. Vivo V29 Lite 5G ఫోన్ V2244 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. రిపోర్ట్ ద్వారా కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo V29 Lite 5G డిజైన్ రెండర్స్

 

కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ Vivo V29 Lite 5G త్వరలోనే లాంచ్ అవుతోంది. ఈలోపు ఫోన్ డిజైన్ రెండర్స్ ఆన్‌లైన్ లో లీక్ అయ్యాయి. గుగ్లాని షేర్ చేసిన ఇమేజెస్ ని బట్టి, Vivo V29 Lite 5G డివైజ్ కర్వ్డ్ ఫ్రేమ్, రియర్ ప్యానెల్ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ బటన్స్, పవర్ బటన్ ఉన్నాయి. బాటమ్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్, సిమ్ ట్రే ఉన్నాయి.

Vivo V29 Lite 5G ఫోన్ ముందువైపున, సెంటర్డ్ హోల్-పంచ్ కటౌట్, సన్నని బెజెల్స్ ఉన్నాయి. రియర్ ప్యానెల్ పై రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇంకా ఒక ఎల్ఈడీ ఫ్లాష్, కెమెరా సెన్సర్స్ ఉన్నాయి.

Vivo V29 Lite 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • అమోలెడ్ డిస్ప్లే
  • 6.78-ఇంచ్ స్క్రీన్

Vivo V29 Lite 5G స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ లేదా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ

  • స్నాప్ డ్రాగన్ 695 చిప్
  • 8జిబి ర్యామ్
  • 128జిబి స్టోరేజీ

Vivo V29 Lite 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఉంటుంది. గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ లిస్టింగ్ ద్వారా ఈ విషయం ఖరారైంది. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి.

బ్యాటరీ, చార్జింగ్

  • 5000 ఎంఏహెచ్
  • 44 వాట్ చార్జింగ్

Vivo V29 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్, కనెక్టివిటీ

  • ఆండ్రాయిడ్ 13
  • 5జీ, 4జీ

Vivo V29 Lite 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

కెమెరా విభాగం

  • 64ఎంపి రియర్ కెమెరా
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా

Vivo V29 Lite 5G స్మార్ట్ ఫోన్ లో 64ఎంపి రియర్ కెమెరా ఉంటుంది. దీంతో పాటు 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Vivo V29 Lite 5G ధర

Vivo V29 Lite 5G డివైజ్ 8జిబి ర్యామ్ ఆప్షన్ ధర 299 డాలర్లు (సుమారు రూ.24,800) గా ఉంటుందని అంచనా.

The post లీకైన Vivo V29 Lite 5G డిజైన్ రెండర్స్; కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ట్రిపుల్-కెమెరా సెటప్ తో రానున్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
GCF సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్టైన Vivo V29 Lite 5G https://www.91mobiles.com/telugu/vivo-v29-lite-5g-spotted-gcf-certification-database-expected-specs/ Mon, 24 Apr 2023 16:43:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=6017 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో సంస్థ వీ-సిరీస్ లో Vivo V29 Lite 5G డివైజ్ ని గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ కొన్ని రోజుల క్రితం Google Play Console లిస్టింగ్ పై కనిపించింది. ఇప్పుడు ఈ ఫోన్ GCF సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో అతి త్వరలో Vivo V29 Lite 5G డివైజ్ గ్లోబల్ గా లాంచ్ కానుందని అర్థమవుతోంది. […]

The post GCF సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్టైన Vivo V29 Lite 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ మార్కెట్ లో అతి త్వరలో లాంచ్ కానున్న Vivo V29 Lite 5G
  • జీసీఎఫ్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై లిస్టైన డివైజ్
  • స్నాప్ డ్రాగన్ 695 చిప్, 8జిబి ర్యామ్ తో లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో సంస్థ వీ-సిరీస్ లో Vivo V29 Lite 5G డివైజ్ ని గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ కొన్ని రోజుల క్రితం Google Play Console లిస్టింగ్ పై కనిపించింది. ఇప్పుడు ఈ ఫోన్ GCF సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో అతి త్వరలో Vivo V29 Lite 5G డివైజ్ గ్లోబల్ గా లాంచ్ కానుందని అర్థమవుతోంది. సరే, ఓసారి Vivo V29 Lite 5G వివరాలు తెలుసుకుందాం పదండి.

GCF సర్టిఫికేషన్ పై కనిపించిన Vivo V29 Lite 5G

జీసీఎఫ్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై Vivo V29 Lite 5G లిస్ట్ అయ్యింది. త్వరలోనే గ్లోబల్ గా ఈ ఫోన్ లాంచ్ కానుందని ఈ లిస్టింగ్ ద్వారా తెలిసింది. స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. పేరుని బట్టి ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీతో వస్తోందని అర్థమవుతోంది.

జీసీఎఫ్ సర్టిఫికేషన్ అనేది ఫోన్లు మరియు ఇతర మొబైల్ డివైజెస్ ని సర్టిఫై చేసే గ్లోబల్ అథారిటీ. మొబైల్ ఇండస్ట్రీ కి సంబంధించిన టెలీకామ్, ఆటోమోటివ్స్, ఐవోటీ, రిటైల్ మరియు ఇతర ఎన్నో ఏరియాల్లో సర్టిఫికేషన్స్ ప్రోగ్రామ్స్ ని జీసీఎఫ్ అథారిటీ ఆఫర్ చేస్తుంది.

Vivo V29 Lite 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Vivo V29 Lite 5G స్మార్ట్ ఫోన్ లో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో వాటర్ డ్రాప్ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. డిస్ప్లే కి నాలుగు వైపులా సన్నని బెజెల్స్ ఉంటాయి.

చిప్సెట్: Vivo V29 Lite 5G స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ ఫోన్ లో అడ్రెనో 619 జీపీయూ గ్రాఫిక్స్ వినియోగించనున్నారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo V29 Lite 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో రానుంది. ఇతర వేరియంట్స్ లో కూడా ఈ ఫోన్ వచ్చే అవకాశం ఉంది.

కనెక్టివిటీ: Vivo V29 Lite 5G లో 5జీ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉండే అవకాశం ఉంది.

బ్యాటరీ, ఓఎస్: Vivo V29 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post GCF సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్టైన Vivo V29 Lite 5G first appeared on 91Mobiles Telugu.

]]>
గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా లీకైన Vivo V29 Lite 5G స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-v29-lite-5g-spotted-google-play-console-key-specs/ Wed, 19 Apr 2023 10:06:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=5946 చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో త్వరలో ఒక కొత్త వీ-సిరీస్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. రిపోర్ట్స్ గనుక నిజమే అయితే, Vivo V29 Lite 5G డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై V2244 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయినట్లు సమాచారం. అంటే త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ కానుందన్న మాట. అయితే కంపెనీ నుంచి ఇంకా అధికార ప్రకటన రాలేదు. కానీ, లిస్టింగ్ ద్వారా […]

The post గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా లీకైన Vivo V29 Lite 5G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొత్త వి-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోన్న వివో సంస్థ
  • గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై కనిపించిన Vivo V29 Lite 5G
  • క్వాల్కమ్ చిప్సెట్ తో వస్తోన్న Vivo V29 Lite 5G స్మార్ట్ ఫోన్

చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో త్వరలో ఒక కొత్త వీ-సిరీస్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. రిపోర్ట్స్ గనుక నిజమే అయితే, Vivo V29 Lite 5G డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై V2244 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయినట్లు సమాచారం. అంటే త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ కానుందన్న మాట. అయితే కంపెనీ నుంచి ఇంకా అధికార ప్రకటన రాలేదు. కానీ, లిస్టింగ్ ద్వారా ఫోన్ కి సంబంధించిన ఫ్రంట్ లుక్ మరియు ప్రాసెసర్ సమాచారం తెలిసింది.

గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై కనిపించిన Vivo V29 Lite 5G

  • వాటర్ డ్రాప్ నాచ్ సన్నని బెజెల్స్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్

Vivo V29 Lite 5G డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, సన్నని బెజెల్స్ తో రానుందని సమాచారం. అలాగే ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిప్సెట్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది. గ్రాఫిక్స్ కోసం ఈ డివైజ్ లో అడ్రెనో 619జీపీయూ వాడినట్లు సమాచారం.

గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా Vivo V29 Lite 5G డివైజ్ యొక్క 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ రివీల్ అయ్యింది. ఇతర స్టోరేజీ, ర్యామ్ వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది. MySmartPrice రిపోర్ట్ ప్రకారం, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనుందని తెలిసింది.

లిస్టింగ్ ప్రకారం, Vivo V29 Lite 5G డివైజ్ V2244 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. వివో వై78 స్మార్ట్ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ మరియు 3సీ వెబ్ సైట్ పై ఇదే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ తరుణంలో, Vivo V29 Lite 5G మరియు Vivo Y78 5G డివైజెస్ విభిన్న మార్కెట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Vivo V29 Lite 5G డివైజ్ Vivo Y78 5G కి రీబ్రాండ్ వర్షన్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం Vivo V29 Lite 5G కి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన రాలేదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా లీకైన Vivo V29 Lite 5G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>