Vivo V40 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 07 Aug 2024 10:22:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo V40 Pro: డైమెన్సిటీ 9200+ చిప్‌తో భారత్‌లో లాంచైన వివో వీ40 ప్రో https://www.91mobiles.com/telugu/vivo-v40-pro-5g-launched-india-dimensity-9200-plus-chipset/ https://www.91mobiles.com/telugu/vivo-v40-pro-5g-launched-india-dimensity-9200-plus-chipset/#respond Wed, 07 Aug 2024 10:22:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=12865 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో V40 సిరీస్ లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo V40 మరియు Vivo V40 Pro అనే మోడల్స్ విడుదలయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Vivo V40 Pro గురించి తెలుసుకుందాం. Vivo V40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక Vivo V40 Pro విషయానికి వస్తే, ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, […]

The post Vivo V40 Pro: డైమెన్సిటీ 9200+ చిప్‌తో భారత్‌లో లాంచైన వివో వీ40 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Vivo V40 Pro లాంచ్
  • డైమెన్సిటీ 9200+ చిప్సెట్
  • ప్రారంభ ధర రూ.49,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో V40 సిరీస్ లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo V40 మరియు Vivo V40 Pro అనే మోడల్స్ విడుదలయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Vivo V40 Pro గురించి తెలుసుకుందాం. Vivo V40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక Vivo V40 Pro విషయానికి వస్తే, ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, జీస్ ఆప్టిక్స్ ఉన్నాయి. ఓసారి ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo V40 Pro ధర, లభ్యత

Vivo V40 Pro స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం.

Vivo V40 Pro 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.49,999 గా పెట్టారు. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.55,999 గా ఉంది. Vivo V40 Pro డివైజ్ గంగాస్ బ్లూ, టైటానియమ్ గ్రే కలర్స్ లో లభిస్తుంది.

Vivo V40 Pro స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 13వ తేదీ నుంచి సేల్ కి వస్తోంది. వివో వీ40 ఆగస్టు 19న సేల్ కు రానుంది. ప్రీ-బుకింగ్స్ నేటి నుంచి మొదలయ్యాయి. లాంచ్ ఆఫర్ లో భాగంగా, 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్, 12 నెలల జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ ఆప్షన్ వంటి ప్రయోజనాలు రిటైల్ స్టోర్స్ లో లభిస్తాయి.

ఫ్లిప్‌కార్ట్, వివో ఈ-స్టోర్ ద్వారా కూడా Vivo V40 Pro ని కొనుగోలు చేయవచ్చు. వీరికి హెచ్డీఎఫ్‌సీ లేదా ఎస్బీఐ కార్డ్ పై 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

Vivo V40 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo V40 Pro 5G లో 6.78-ఇంచ్ 1.5కే డిస్ప్లే, కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 452పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, స్కాట్ సెన్సేషన్ ఆల్ఫా కవర్ గ్లాస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo V40 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్, ఏఆర్ఎమ్ ఇమ్మోర్టాలిస్-జీ715 ఎంపీ11 గ్రాఫిక్స్ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Vivo V40 Pro 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

సాఫ్ట్‌వేర్: Vivo V40 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Vivo V40 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్921 ప్రైమరీ ఏఎఫ్ ఓఐఎస్ కెమెరా, 50ఎంపి సోని ఐఎంఎక్స్816 ఏఎఫ్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 50ఎక్స్ డిజిటల్ జూమ్ టెలీఫోటో కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. జీస్ ఆప్టిక్స్ ను ఈ కెమెరా సిస్టమ్ లో అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఎఫ్ జీస్ సెన్సర్ ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Vivo V40 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo V40 Pro 5G లో డ్యూయల్ సిమ్, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo V40 Pro 5G లో ఐపీ68 ప్రొటెక్షన్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Vivo V40 Pro 5G డివైజ్ 164.3 మి.మీ పొడవు, 75.1 మి.మీ వెడల్పు, 7.58 మి.మీ మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది.

The post Vivo V40 Pro: డైమెన్సిటీ 9200+ చిప్‌తో భారత్‌లో లాంచైన వివో వీ40 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40-pro-5g-launched-india-dimensity-9200-plus-chipset/feed/ 0
Vivo V40, Vivo V40 Pro ఇండియా లాంచ్ ఖరారు https://www.91mobiles.com/telugu/vivo-v40-vivo-v40-pro-india-launch-confirmed/ https://www.91mobiles.com/telugu/vivo-v40-vivo-v40-pro-india-launch-confirmed/#respond Thu, 25 Jul 2024 04:20:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=12673 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో వీ-40 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V40 మరియు Vivo V40 Pro అనే రెండు మోడల్స్ లాంచ్ కానున్నాయి. తాజాగా Vivo V40 సిరీస్ ఇండియా లాంచ్‌ను సోషల్ మీడియా ద్వారా వివో ఖరారు చేసింది. లాంచ్ వివరాలతో పాటు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Vivo V40, Vivo V40 Pro ఇండియా లాంచ్ ఖరారు వివో ఇండియా […]

The post Vivo V40, Vivo V40 Pro ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo V40 సిరీస్ లాంచ్
  • సోషల్ మీడియాలో వివో ప్రకటన
  • 50ఎంపి జీస్ టెలీఫోటో పొట్రెయిట్ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో వీ-40 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V40 మరియు Vivo V40 Pro అనే రెండు మోడల్స్ లాంచ్ కానున్నాయి. తాజాగా Vivo V40 సిరీస్ ఇండియా లాంచ్‌ను సోషల్ మీడియా ద్వారా వివో ఖరారు చేసింది. లాంచ్ వివరాలతో పాటు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo V40, Vivo V40 Pro ఇండియా లాంచ్ ఖరారు

వివో ఇండియా వెబ్‌సైట్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X ప్రకారం, వివో వీ40, వీ40 ప్రో స్మార్ట్‌ఫోన్లు త్వరలోనే భారత్ లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.

అయితే తన లేటెస్ట్ టీజర్ లో కచ్చితమైన లాంచ్ తేదీని వివో వెల్లడించలేదు. కానీ, ఆగస్టు రెండో వారంలో వీ40 సిరీస్ లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Vivo V40 Pro స్మార్ట్‌ఫోన్ గంగెస్ బ్లూ మరియు టైటానియమ్ గ్రే కలర్స్ లో లభిస్తుంది. Vivo V40 ఫోన్ గంగెస్ బ్లూ, లోటస్ పర్పుల్ మరియు టైటానియమ్ గ్రే కలర్స్ లో లాంచ్ అవుతుంది.

Vivo V40, Vivo V40 Pro స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

వివో ఇండియా వెబ్‌సైట్ ప్రకారం, Vivo V40 మరియు Vivo V40 Pro డివైజెస్ జీస్ బ్రాండెడ్ కెమెరా మాడ్యూల్ తో వస్తోంది. 50ఎంపి జీస్ టెలీఫోటో పొట్రెయిట్ కెమెరా ఈ ఫోన్ లో ఉంటుంది.

సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం, ఈ ఫోన్ లో 50ఎంపి జీస్ ఫ్రంట్ కెమెరా ఉంటుందని కన్ఫర్మ్ అయ్యింది.

Vivo V40 సిరీస్ లో వస్తోన్న స్మార్ట్‌ఫోన్లు 5,500 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉండటంతో పాటు సన్నగా ఉంటాయని కంపెనీ చెబుతోంది.

వివో వీ40 స్మార్ట్‌ఫోన్లలో 80 వాట్ ఫ్లాష్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని అందిస్తున్నారు. దీని ద్వారా డివైజ్ త్వరగా చార్జ్ అవుతుంది.

వివో వెబ్‌సైట్ ప్రకారం, Vivo V40 సిరీస్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.

Vivo V40 స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే: Vivo V40 లో 6.78-ఇంచ్ 1.5కే స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo V40 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 720 జీపీయూ వినియోగించారు.

మెమొరీ: Vivo V40 డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Vivo V40 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఇవి జీస్ సపోర్ట్ తో వచ్చాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Vivo V40 లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

కనెక్టివిటీ: Vivo V40 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 5, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo V40 లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే పింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo V40, Vivo V40 Pro ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40-vivo-v40-pro-india-launch-confirmed/feed/ 0
Vivo V40 Series: 5,500mAh బ్యాటరీతో భారత్‌లో లాంచ్ కానున్న వివో వీ40 సిరీస్ https://www.91mobiles.com/telugu/vivo-v40-series-to-launch-india-5500-mah-battery/ https://www.91mobiles.com/telugu/vivo-v40-series-to-launch-india-5500-mah-battery/#respond Tue, 23 Jul 2024 06:09:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=12628 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వీ-40 సిరీస్ ను భారత్‌లో లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో భాగంగా Vivo V40 మరియు Vivo V40 Pro డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. అయితే వీటిలో బేస్ మోడల్ Vivo V40 ఇప్పటికే యూరపియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. తాజాగా 91mobiles కి ఈ ఫోన్లకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం లభించింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. Vivo V40 సిరీస్ యొక్క […]

The post Vivo V40 Series: 5,500mAh బ్యాటరీతో భారత్‌లో లాంచ్ కానున్న వివో వీ40 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo V40 సిరీస్ లాంచ్
  • లైనప్‌లో వస్తోన్న వీ40, వీ 40 ప్రో
  • ఇప్పటికే యూరప్‌లో లాంచైన వీ40

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వీ-40 సిరీస్ ను భారత్‌లో లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో భాగంగా Vivo V40 మరియు Vivo V40 Pro డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. అయితే వీటిలో బేస్ మోడల్ Vivo V40 ఇప్పటికే యూరపియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. తాజాగా 91mobiles కి ఈ ఫోన్లకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం లభించింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Vivo V40 సిరీస్ యొక్క ముఖ్య సమాచారం

Vivo V40 సిరీస్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కాబోతున్న 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ గల సన్నని ఫోన్ అని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Vivo V40 సిరీస్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది. దీని వల్లన ఈ డివైజెస్‌కు నీరు మరియు దుమ్ము నుంచి రక్షణ లభిస్తుంది.

Vivo V40 సిరీస్ లోని ప్రో వేరియంట్ కూడా 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ68 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. కానీ, వీ40 కంటే కొన్ని విషయాల్లో అప్‌గ్రేడ్స్ ఉంటాయని చెప్పవచ్చు.

భారత్ లో Vivo V40 సిరీస్ గంగా బ్లూ, లోటస్ పర్పుల్ మరియు టైటానియమ్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది. లైనప్ కి గంగా బ్లూ కొత్తగా చేరుతోందని అర్థమవుతోంది.

Vivo V40 సిరీస్ ఐపీ68 తో పాటు, మన్నిక కొరకు కుషనింగ్ స్ట్రక్చర్ ని కలిగి ఉంటుందని సమాచారం. అలాగే 3డీ కర్వ్డ్ డిస్ప్లే, సరికొత్త ఇన్ఫినిటీ ఐ కెమెరా మాడ్యూయల్ తో ఈ సిరీస్ వస్తోంది.

Vivo V40 సిరీస్ ఇండియా లాంచ్

Vivo V40 సిరీస్ భారత్ లో ఆగస్టు నెలలో లాంచ్ కానుంది. లైనప్ లో భాగంగా Vivo V40 మరియు Vivo V40 Pro ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఇటీవలె Vivo V40 Pro భారత్ కి చెందిన బీఐఎస్ సైట్ పై లిస్ట్ అయ్యింది.

Vivo V40 స్పెసిఫికేషన్స్ (యూరప్)

Vivo V40 5G లో 6.78-ఇంచ్ స్క్రీన్, 1.5కే అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800 * 1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

వివో వీ40 5జీ స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 720 జీపీయూ ఉన్నాయి. ఈ ఫోన్ లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.

ఈ వివో స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, ఆరా లైట్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

Vivo V40 5G లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Vivo V40 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. Vivo V40 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

The post Vivo V40 Series: 5,500mAh బ్యాటరీతో భారత్‌లో లాంచ్ కానున్న వివో వీ40 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40-series-to-launch-india-5500-mah-battery/feed/ 0