
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వీ-40 సిరీస్ ను భారత్‌లో లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో భాగంగా Vivo V40 మరియు Vivo V40 Pro డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. అయితే వీటిలో బేస్ మోడల్ Vivo V40 ఇప్పటికే యూరపియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. తాజాగా 91mobiles కి ఈ ఫోన్లకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం లభించింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.
Vivo V40 సిరీస్ యొక్క ముఖ్య సమాచారం
Vivo V40 సిరీస్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కాబోతున్న 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ గల సన్నని ఫోన్ అని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Vivo V40 సిరీస్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది. దీని వల్లన ఈ డివైజెస్‌కు నీరు మరియు దుమ్ము నుంచి రక్షణ లభిస్తుంది.
Vivo V40 సిరీస్ లోని ప్రో వేరియంట్ కూడా 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ68 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. కానీ, వీ40 కంటే కొన్ని విషయాల్లో అప్‌గ్రేడ్స్ ఉంటాయని చెప్పవచ్చు.
భారత్ లో Vivo V40 సిరీస్ గంగా బ్లూ, లోటస్ పర్పుల్ మరియు టైటానియమ్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది. లైనప్ కి గంగా బ్లూ కొత్తగా చేరుతోందని అర్థమవుతోంది.
Vivo V40 సిరీస్ ఐపీ68 తో పాటు, మన్నిక కొరకు కుషనింగ్ స్ట్రక్చర్ ని కలిగి ఉంటుందని సమాచారం. అలాగే 3డీ కర్వ్డ్ డిస్ప్లే, సరికొత్త ఇన్ఫినిటీ ఐ కెమెరా మాడ్యూయల్ తో ఈ సిరీస్ వస్తోంది.
Vivo V40 సిరీస్ ఇండియా లాంచ్
Vivo V40 సిరీస్ భారత్ లో ఆగస్టు నెలలో లాంచ్ కానుంది. లైనప్ లో భాగంగా Vivo V40 మరియు Vivo V40 Pro ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఇటీవలె Vivo V40 Pro భారత్ కి చెందిన బీఐఎస్ సైట్ పై లిస్ట్ అయ్యింది.
Vivo V40 స్పెసిఫికేషన్స్ (యూరప్)
Vivo V40 5G లో 6.78-ఇంచ్ స్క్రీన్, 1.5కే అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800 * 1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
వివో వీ40 5జీ స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 720 జీపీయూ ఉన్నాయి. ఈ ఫోన్ లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.
ఈ వివో స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, ఆరా లైట్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
Vivo V40 5G లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Vivo V40 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. Vivo V40 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.











