Vivo X Fold 2 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 30 Mar 2023 15:10:58 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo X Fold 2 ఫస్ట్ లుక్ ని అఫీషియల్ గా టీజ్ చేసిన కంపెనీ https://www.91mobiles.com/telugu/vivo-x-fold-2-officially-teased-by-vivo-on-social-media/ Thu, 30 Mar 2023 15:10:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=5680 వివో సంస్థ రీసెంట్ గా తన సెకండ్ జనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ Vivo X Fold 2 ని కన్ఫర్మ్ చేసింది. 2023 ఏప్రిల్ చివర్లో చైనాలో Vivo X Fold 2 లాంచ్ కానుంది. అయితే లాంచ్ కి ముందు వివో బ్రాండ్ Vivo X Fold 2 డివైజ్ ఫస్ట్ గ్లిమ్స్ బయటకు వదిలింది. చైనీస్ మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ వీబో పై Vivo X Fold 2 యొక్క పిక్స్ ని […]

The post Vivo X Fold 2 ఫస్ట్ లుక్ ని అఫీషియల్ గా టీజ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2023 ఏప్రిల్ లో చైనాలో లాంచ్ కానున్న Vivo X Fold 2 స్మార్ట్ ఫోన్
  • Vivo X Fold 2 ఫస్ట్ లుక్ ని టీజ్ చేసిన వివో సంస్థ
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, స్లిమ్ బాడీతో రానున్న Vivo X Fold 2

వివో సంస్థ రీసెంట్ గా తన సెకండ్ జనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ Vivo X Fold 2 ని కన్ఫర్మ్ చేసింది. 2023 ఏప్రిల్ చివర్లో చైనాలో Vivo X Fold 2 లాంచ్ కానుంది. అయితే లాంచ్ కి ముందు వివో బ్రాండ్ Vivo X Fold 2 డివైజ్ ఫస్ట్ గ్లిమ్స్ బయటకు వదిలింది. చైనీస్ మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ వీబో పై Vivo X Fold 2 యొక్క పిక్స్ ని వివో పోస్ట్ చేసింది. సరే పదండి, Vivo X Fold 2 డివైజ్ ఎలా ఉందో తెలుసుకుందాం.

Vivo X Fold 2 ఫస్ట్ లుక్ ని అఫీషియల్ గా టీజ్ చేసిన కంపెనీ

పైన పిక్చర్స్ లో కనిపిస్తోన్న విధంగా, Vivo X Fold 2 ఉండనుంది. ఈ డివైజ్ రెడ్ కలర్ లో లాంచ్ కానుంది. గత వివో ఫోల్డబుల్ ఫోన్లు కూడా ఇదే విధంగా లాంచ్ అయ్యాయి. ఫోన్ రియర్ ప్యానెల్ చూడటానికి వివో ఫ్లాగ్షిప్ డివైజెస్ మాదిరి ఉంది. బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. డివైజ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, మెటల్ చాసిస్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. జీస్ బ్రాండింగ్ కనిపిస్తోంది.

Vivo X Fold 2 ఫ్రంట్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో సెంటర్ అలైన్డ్ సింగిల్ పంచ్-హోల్ సెల్ఫీ కెమెరాలు ఉంటాయి. ఈ కెమెరాల రెజుల్యూషన్ ఇంకా తెలియదు. ఓవరాల్ గా ఫోటోస్ ని బట్టి Vivo X Fold 2 డివైజ్ కాంపాక్ట్ డిజైన్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది. గత మోడల్ కంటే స్లిమ్ గా Vivo X Fold 2 ఉంటుందని తెలుస్తోంది.

Vivo X Fold 2 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo X Fold 2 స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఇస్తున్నారు. సాఫ్ట్ వేర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. కెమెరా విభాగం విషయానికి వస్తే, ఈ డివైజ్ లో 50ఎంపి + 12ఎంపి + 12ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది.

Vivo X Fold 2 లో పవర్ బ్యాకప్ కోసం 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ లో చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది. త్వరలోనే ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ కి సంబంధించి అధికార ప్రకటన రానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Vivo X Fold 2 ఫస్ట్ లుక్ ని అఫీషియల్ గా టీజ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo X Fold 2 లాంచ్ టైమ్ లైన్‌ని టీజ్ చేసిన వివో, ఏప్రిల్ లో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/vivo-x-fold-2-launch-timeline-teased-by-vivo/ Wed, 29 Mar 2023 16:32:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=5643 వివో నుంచి రానున్న Vivo X Fold 2 గురించి గత కొన్ని నెలలుగా రూమర్లు వింటున్నాం. వివో సంస్థ ఎట్టకేలకు Vivo X Fold 2 ని టీజ్ చేయడం మొదలు పెట్టింది. చైనీస్ సామాజిక మాధ్యమం వీబో పై వివో Vivo X Fold 2 కి సంబంధించిన పోస్ట్ ని పెట్టింది. అయితే Vivo X Fold 2 యొక్క స్పెసిఫికేషన్స్ పెద్దగా బయటకు రాలేదు. అయితే ఫైనల్ మానికర్, లాంచ్ టైమ్ […]

The post Vivo X Fold 2 లాంచ్ టైమ్ లైన్‌ని టీజ్ చేసిన వివో, ఏప్రిల్ లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తన సెకండ్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్ ని టీజ్ చేసిన వివో
  • ఏప్రిల్ లో చైనాలో Vivo X Fold 2 లాంచ్ అయ్యే అవకాశం
  • Vivo X Fold 2 స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోందని టాక్

వివో నుంచి రానున్న Vivo X Fold 2 గురించి గత కొన్ని నెలలుగా రూమర్లు వింటున్నాం. వివో సంస్థ ఎట్టకేలకు Vivo X Fold 2 ని టీజ్ చేయడం మొదలు పెట్టింది. చైనీస్ సామాజిక మాధ్యమం వీబో పై వివో Vivo X Fold 2 కి సంబంధించిన పోస్ట్ ని పెట్టింది. అయితే Vivo X Fold 2 యొక్క స్పెసిఫికేషన్స్ పెద్దగా బయటకు రాలేదు. అయితే ఫైనల్ మానికర్, లాంచ్ టైమ్ లైన్ వివరాలు తెలిసాయి. వివో ఎక్స్ ఫోల్డ్ 2 కి సంబంధించిన తాజా సమాచారాన్ని 91మొబైల్స్ ప్రచురించింది.

Vivo X Fold 2 లాంచ్ టైమ్ లైన్

 

వివో సంస్థ తన నుంచి రాబోవు Vivo X Fold 2 గురించి లాంచ్ టైమ్ లైన్ ని, మానికర్ ని టీజ్ చేసింది. చైనీస్ సామాజిక మాధ్యమం వీబో పై న వివో ఈ ఫోన్ కి సంబంధించిన పోస్ట్ పెట్టింది. దీంతో ఈ ఫోన్ గురించి వివో అధికారికంగా సోషల్ మీడియాలో స్పందించినట్లైంది. ఏప్రిల్ నెలలో Vivo X Fold 2 లాంచ్ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. లేదంటే ఏమైనా ముఖ్యమైన ప్రకటనలు ఏప్రిల్ లో వచ్చే అవకాశం ఉంది.

Vivo X Fold 2 ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్ తో రానుంది. క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ చిప్సెట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో Vivo X Fold 2 రానుందని సమాచారం. Vivo X Fold 2 డివైజ్ లో ఉండే రెండు స్క్రీన్స్ కూడా అమోలెడ్ ప్యానెల్‌వేనని సమాచారం. అలాగే ఇవి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంటాయని తెలుస్తోంది.

Vivo X Fold 2 అత్యంత శక్తివంతమైన ఫోల్డబుల్ స్క్రీన్ ని కలగి ఉండనుందని సమాచారం. పవర్ఫుల్ స్క్రీన్ ని ఈ ఫోన్ కోసం వివో సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డిజైన్ విషయానికి వస్తే, Vivo X Fold 2 ఫోన్ సన్నని, తేలికైన సౌష్టవం కలిగి ఉండనుంది.

Vivo X Fold 2 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo X Fold 2 స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంటుంది. 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించనున్నారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. ఈ కస్టమ్ స్కిన్ చైనాకి మాత్రమే పరిమితం అవ్వనుంది. గ్లోబల్ మార్కెట్స్ లో ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ ఉంటుంది.

Vivo X Fold 2 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 12ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. Vivo X Fold 2 లో పవర్ బ్యాకప్ కోసం 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో టైప్-సీ పోర్ట్ ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Vivo X Fold 2 లాంచ్ టైమ్ లైన్‌ని టీజ్ చేసిన వివో, ఏప్రిల్ లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Vivo X Fold 2 స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-x-fold-2-specifications-leaked-first-foldable-phone-with-snapdragon-8-gen-2-chip/ Tue, 21 Feb 2023 05:22:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=5019 Vivo సంస్థ గతేడాది చైనాలో తన తొలి మడతబెట్టే ఫోన్ Vivo X Fold ని లాంచ్ చేసింది. Vivo X Fold ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్, 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 8.03-ఇంచ్ ఫోల్డబుల్ అమోలెడ్ డిస్ప్లే ఉన్నాయి. తర్వాత ఈ ఫోన్ యొక్క రిఫ్రెష్డ్ వర్షన్ Vivo X Fold+ ని తీసుకొచ్చింది. ఇది స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 4780ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చింది. […]

The post లీకైన Vivo X Fold 2 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2023 ద్వితీయార్థంలో లాంచ్ కానున్న Vivo X Fold 2 స్మార్ట్ ఫోన్
  • 2కే అమోలెడ్ డిస్ప్లే, సోని ఐఎంఎక్స్866 ప్రైమరీ కెమెరా సెన్సర్, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో రానున్న Vivo X Fold 2
  • తక్కువ బరువుతో వస్తోన్న Vivo X Fold 2 డివైజ్

Vivo సంస్థ గతేడాది చైనాలో తన తొలి మడతబెట్టే ఫోన్ Vivo X Fold ని లాంచ్ చేసింది. Vivo X Fold ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్, 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 8.03-ఇంచ్ ఫోల్డబుల్ అమోలెడ్ డిస్ప్లే ఉన్నాయి. తర్వాత ఈ ఫోన్ యొక్క రిఫ్రెష్డ్ వర్షన్ Vivo X Fold+ ని తీసుకొచ్చింది. ఇది స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 4780ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చింది. ఇప్పుడు వివో, Vivo X Fold 2 ని కొన్ని నెలల్లో లాంచ్ చేయనుందని సమాచారం.

Vivo X Fold 2022 ఏప్రిల్ నెలలో లాంచ్ అయ్యింది. ఇప్పుడు Vivo X Fold 2 కూడా 2023 ఏప్రిల్ లోనే లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. తాజాగా Vivo X Fold 2 యొక్క స్పెసిఫికేషన్స్ లీకైయ్యాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo X Fold 2 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Vivo X Fold 2 భారీ బ్యాటరీతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ప్రస్తుతం ఉన్న వివో ఫోల్డబుల్ ఫోన్ కంటే భారీ బ్యాటరీని కలిగి ఉండనున్నట్లు సమాచారం. Vivo X Fold 4600ఎంఏహెచ్ బ్యాటరీ, Vivo X Fold+ 4780ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చాయి.

ఇప్పుడు టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, Vivo X Fold 2 డివైజ్ రెండు 2340 ఎంఏహెచ్ బ్యాటరీ సెల్స్ ని కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. అంటే 4800ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉంటుందన్నమాట. చార్జింగ్ విభాగంలో కూడా భారీ మార్పు ఉండబోతున్నట్లు సమాచారం. Vivo X Fold 2 డివైజ్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది. గతంలో వచ్చిన Vivo X Fold+ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది. Vivo X Fold 2 లో వైర్లెస్ చార్జింగ్ కూడా ఉండనుంది.

Vivo X Fold 2 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 2కే అమోలెడ్ డిస్ప్లే, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయని సమాచారం. సోని ఐఎంఎక్స్866 ప్రైమరీ కెమెరాతో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ Vivo X Fold 2 లో ఉండనుంది.

గత మోడల్ Vivo X Fold+ తో పోల్చితే, Vivo X Fold 2 డివైజ్ చాలా తక్కువ బరువు ఉంటుందట. Vivo X Fold+ బరువు 311 గ్రాములు ఉంటుంది. OPPO Find N2 డివైజ్ బరువు 235 గ్రాములు. Galaxy Z Fold 4 బరువు 263 గ్రాములు. త్వరలోనే Vivo X Fold 2 యొక్క మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post లీకైన Vivo X Fold 2 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Vivo X Fold 2 లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-x-fold-2-launch-timeline-specs-leaked/ Thu, 29 Dec 2022 11:36:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=4238 హైలైట్స్ 2023 ప్రథమార్థంలో లాంచ్ కానున్న Vivo X Fold 2 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ వచ్చే ఏడాది లాంచ్ కానున్న Vivo X Fold 2 మరియు Vivo X Flip 2 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 2కే ఫోల్డబుల్ డిస్ప్లే, సోని ఐఎంఎక్స్866 సెన్సర్ తో రానున్న Vivo X Fold 2 Vivo X Fold 2 కి సంబంధించిన ఒక లీక్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ఈసారి […]

The post లీకైన Vivo X Fold 2 లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 2023 ప్రథమార్థంలో లాంచ్ కానున్న Vivo X Fold 2 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్
  • వచ్చే ఏడాది లాంచ్ కానున్న Vivo X Fold 2 మరియు Vivo X Flip 2
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 2కే ఫోల్డబుల్ డిస్ప్లే, సోని ఐఎంఎక్స్866 సెన్సర్ తో రానున్న Vivo X Fold 2

Vivo X Fold 2 కి సంబంధించిన ఒక లీక్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ఈసారి వచ్చిన లీక్ ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ నుంచి వచ్చింది. లీక్ ద్వారా తెలిసిందేంటంటే, వివో కంపెనీ తన ఫోల్డబుల్ ఫోన్లను 2023 ప్రథమార్థంలో లాంచ్ చేయనుందట. ఇక టైమ్ లైన్ తో పాటు Vivo X Fold 2 యొక్క స్పెసిఫికేషన్స్ ని కూడా టిప్‌స్టర్ రివీల్ చేశాడు. తొలితరం ఎక్స్ ఫోల్డ్ డివైజ్ కి సక్సెసర్ గా Vivo X Fold 2 మార్కెట్ లోకి రానుంది. లాంచ్ తర్వాత Samsung Galaxy Z Fold 3 తో Vivo X Fold 2 పోటీ పడనుంది.

అయితే ఇప్పటి వరకు వివో సంస్థ భారత్ లో తన ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేయలేదు. ఈసారి మాత్రం Vivo X Fold 2 డివైజ్ ని భారత్ లో కూడా లాంచ్ చేస్తుందని మేం అంచనా వేస్తున్నాం. సరే, ఓసారి Vivo X Fold 2 నుంచి ఏం ఆశించవచ్చో తెలుసుకుందాం పదండి.

లీకైన Vivo X Fold 2 లాంచ్, స్పెసిఫికేషన్స్

ప్రముఖ టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, Vivo X Fold 2 డివైజ్ తో పాటు Vivo X Flip కూడా 2023 లో లాంచ్ కానుందని స్పష్టమైంది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా తెలియలేదు. లాంచ్ తర్వాత Vivo X Fold 2 ప్రధానంగా Samsung Galaxy Z Fold 4 మరియు త్వరలో లాంచ్ కాబోయే Google Pixel Fold తో పోటీ పడనుంది.

ఇంకా తెలిసిందేమిటంటే, Vivo X Fold 2 డివైజ్ 2కే ఫోల్డబుల్ డిస్ప్లే తో రానుందట. కవర్ మరియు ఇన్నర్ స్క్రీన్స్ రెండు కూడా అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కల్గి ఉంటాయని టిప్‌స్టర్ చెప్పాడు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడనున్నట్లు సమాచారం. కెమెరా విభాగం ఎలా ఉందో చూద్దాం. Vivo X Fold 2 లో ఓఐఎస్ తో కూడిన సోని ఐఎంఎక్స్866 మెయిన్ లెన్స్ ఉంటుంది. అయితే దీని కెపాసిటీ ఎంతో ఇంకా తెలియదు.

Vivo X Fold 2 2023 ఏప్రిల్ నెలలో లాంచ్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే Vivo X Fold స్మార్ట్ ఫోన్ కూడా ఇదే నెలలో లాంచ్ అయ్యింది. కాబట్టి, కొంచెం అటు ఇటుగా ఈ సమయంలోనే లాంచ్ కానుంది Vivo X Fold 2.

ప్రస్తుతానికి Vivo X Fold 2 యొక్క పూర్తి వివరాలు రహస్యంగానే ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Vivo X Fold 2 లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>