
Vivo సంస్థ గతేడాది చైనాలో తన తొలి మడతబెట్టే ఫోన్ Vivo X Fold ని లాంచ్ చేసింది. Vivo X Fold ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్, 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 8.03-ఇంచ్ ఫోల్డబుల్ అమోలెడ్ డిస్ప్లే ఉన్నాయి. తర్వాత ఈ ఫోన్ యొక్క రిఫ్రెష్డ్ వర్షన్ Vivo X Fold+ ని తీసుకొచ్చింది. ఇది స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 4780ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చింది. ఇప్పుడు వివో, Vivo X Fold 2 ని కొన్ని నెలల్లో లాంచ్ చేయనుందని సమాచారం.
Vivo X Fold 2022 ఏప్రిల్ నెలలో లాంచ్ అయ్యింది. ఇప్పుడు Vivo X Fold 2 కూడా 2023 ఏప్రిల్ లోనే లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. తాజాగా Vivo X Fold 2 యొక్క స్పెసిఫికేషన్స్ లీకైయ్యాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.
Vivo X Fold 2 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
Vivo X Fold 2 భారీ బ్యాటరీతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ప్రస్తుతం ఉన్న వివో ఫోల్డబుల్ ఫోన్ కంటే భారీ బ్యాటరీని కలిగి ఉండనున్నట్లు సమాచారం. Vivo X Fold 4600ఎంఏహెచ్ బ్యాటరీ, Vivo X Fold+ 4780ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చాయి.
ఇప్పుడు టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, Vivo X Fold 2 డివైజ్ రెండు 2340 ఎంఏహెచ్ బ్యాటరీ సెల్స్ ని కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. అంటే 4800ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉంటుందన్నమాట. చార్జింగ్ విభాగంలో కూడా భారీ మార్పు ఉండబోతున్నట్లు సమాచారం. Vivo X Fold 2 డివైజ్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది. గతంలో వచ్చిన Vivo X Fold+ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది. Vivo X Fold 2 లో వైర్లెస్ చార్జింగ్ కూడా ఉండనుంది.
Vivo X Fold 2 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 2కే అమోలెడ్ డిస్ప్లే, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయని సమాచారం. సోని ఐఎంఎక్స్866 ప్రైమరీ కెమెరాతో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ Vivo X Fold 2 లో ఉండనుంది.
గత మోడల్ Vivo X Fold+ తో పోల్చితే, Vivo X Fold 2 డివైజ్ చాలా తక్కువ బరువు ఉంటుందట. Vivo X Fold+ బరువు 311 గ్రాములు ఉంటుంది. OPPO Find N2 డివైజ్ బరువు 235 గ్రాములు. Galaxy Z Fold 4 బరువు 263 గ్రాములు. త్వరలోనే Vivo X Fold 2 యొక్క మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.











