Vivo X100s Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 14 May 2024 16:56:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo: Dimensity 9300+ చిప్సెట్‌తో చైనాలో లాంచైన Vivo X100s, Vivo X100s Pro https://www.91mobiles.com/telugu/vivo-x100s-vivo-x100s-pro-launched-in-china-with-dimensity-9300-plus-chipset/ Tue, 14 May 2024 16:56:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=11522 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన సొంత మార్కెట్ చైనాలో X100s సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo X100s మరియు Vivo X100s Pro డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఫోన్లు శక్తివంతమైన స్పెసిఫికేషన్స్ తో వచ్చాయి. ఈ ఫోన్లలో 32ఎంపి సెల్ఫీ కెమెరా, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ల ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. […]

The post Vivo: Dimensity 9300+ చిప్సెట్‌తో చైనాలో లాంచైన Vivo X100s, Vivo X100s Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో Vivo X100s సిరీస్ లాంచ్
  • లైనప్‌లో వచ్చిన Vivo X100s, X100s Pro
  • 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన సొంత మార్కెట్ చైనాలో X100s సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo X100s మరియు Vivo X100s Pro డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఫోన్లు శక్తివంతమైన స్పెసిఫికేషన్స్ తో వచ్చాయి. ఈ ఫోన్లలో 32ఎంపి సెల్ఫీ కెమెరా, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ల ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo X100s, X100s Pro ధరలు

Vivo X100s 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 3999 యువాన్లు (సుమారు రూ.47,000) గా నిర్ణయించారు. 16జిబి + 256జిబి మోడల్ ధర 4399 యువాన్లు (సుమారు రూ.51,800) గా ఉంది. 16జిబి + 512జిబి వేరియంట్ ధర 4699 యువాన్లు (సుమారు రూ.55,000) గా ఉంది. 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధరను 5199 యువాన్లు (సుమారు రూ.61,000) గా నిర్ణయించారు.

Vivo X100s స్మార్ట్‌ఫోన్ చైనాలో టైటానియమ్, వైట్, బ్లాక్/గ్రే మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo X100s Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 4999 యువాన్లు (సుమారు రూ.58,900) గా ఉంది. 16జిబి + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 5599 యువాన్లు (సుమారు రూ.65,900) గా ఉంది. 16జిబి + 1టిబి మోడల్ ధరను 6199 యువాన్లు (సుమారు రూ.72,900) గా నిర్ణయించారు.

Vivo X100s Pro స్మార్ట్‌ఫోన్ చైనాలో టైటానియమ్, వైట్ మరియు బ్లాక్/గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo X100s, Vivo X100s Pro స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo X100s, Vivo X100s Pro డివైజెస్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్ హోల్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. Vivo X100s Pro మోడల్ లో కర్వ్డ్ డిస్ప్లే, X100s లో ఫ్లాట్ ప్యానెల్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo X100s మరియు Vivo X100s Pro డివైజెస్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ తో వచ్చాయి. ఈ ప్రాసెసర్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.4GHz.

కెమెరా: Vivo X100s Pro డివైజ్ 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి పెరిస్కోప్ 4.3x లెన్స్ ఉన్నాయి. మరోవైపు, Vivo X100s లో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 64ఎంపి 3ఎక్స్ పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి.

బ్యాటరీ: Vivo X100s Pro లో 5400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. Vivo X100s లో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.

చార్జింగ్: Vivo X100s డివైజ్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. మరోవైపు Vivo X100s Pro 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

The post Vivo: Dimensity 9300+ చిప్సెట్‌తో చైనాలో లాంచైన Vivo X100s, Vivo X100s Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: లీకైన Vivo X100s, X100s Pro, X100 Ultra ధరలు https://www.91mobiles.com/telugu/vivo-x100s-series-x100-ultra-prices-leaked/ Mon, 06 May 2024 17:05:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=11380 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో X100s సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ కొత్త సిరీస్ తొలుత చైనాలో లాంచ్ అవుతోంది. అక్కడ మే 13న ఈ సిరీస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ లైనప్ లో Vivo X100s, X100s Pro అనే రెండు ఫోన్లు రానున్నాయి. వీటితో పాటు Vivo X100 Ultra కూడా లాంచ్ కాబోతోంది. తాజాగా, ఈ మూడు ఫోన్ల యొక్క ధరలు, ర్యామ్, స్టోరేజీ వేరియంట్స్ నెట్టింట్లో లీక్ […]

The post Vivo: లీకైన Vivo X100s, X100s Pro, X100 Ultra ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మే 13న Vivo X100s సిరీస్ లాంచ్
  • మీడియాటెక్ 9300 ప్లస్ చిప్సెట్
  • సిరీస్ ప్రారంభ ధర 3999 యువాన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో X100s సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ కొత్త సిరీస్ తొలుత చైనాలో లాంచ్ అవుతోంది. అక్కడ మే 13న ఈ సిరీస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ లైనప్ లో Vivo X100s, X100s Pro అనే రెండు ఫోన్లు రానున్నాయి. వీటితో పాటు Vivo X100 Ultra కూడా లాంచ్ కాబోతోంది. తాజాగా, ఈ మూడు ఫోన్ల యొక్క ధరలు, ర్యామ్, స్టోరేజీ వేరియంట్స్ నెట్టింట్లో లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Vivo X100s ధర (లీక్)

Vivo X100s 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 3999 యువాన్లు (సుమారు రూ.46,000) గా ఉంది.

Vivo X100s 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 4399 యువాన్లు (సుమారు రూ.50,900) గా ఉంది.

Vivo X100s 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 4699 యువాన్లు (రూ.54,000) గా ఉంది.

Vivo X100s 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధర 5199 యువాన్లు (సుమారు రూ.60,000) గా ఉంది.

ఒకవేళ ఈ లీక్ నిజమైతే, Vivo X100s చైనాలో 4 వేరియంట్స్ లో లాంచ్ అవుతుంది.

Vivo X100s Pro ధర (లీక్)

Vivo X100s Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 4999 యువాన్లు (సుమారు రూ.57,900)

Vivo X100s Pro 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 5599 యువాన్లు (సుమారు రూ.64,900)

Vivo X100s Pro 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ మోడల్ ధర 6199 యువాన్లు (సుమారు రూ.71,900)

Vivo X100 Ultra ధర (లీక్)

Vivo X100 Ultra 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 6699 యువాన్లు (సుమారు రూ.77,500).

Vivo X100 Ultra 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 7499 యువాన్లు (సుమారు రూ.86,900).

Vivo X100 Ultra 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధర 8499 యువాన్లు (సుమారు రూ.98,000).

భారత్ లో Vivo X100 Ultra మరియు Vivo X100s సిరీస్ ధరలు చైనా మార్కెట్ కంటే తక్కువగా ఉంటాయని అంచనా వేయవచ్చు.

Vivo X100s సిరీస్ చిప్సెట్ వివరాలు

Vivo X100s సిరీస్ చిప్సెట్స్ వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. అయితే లీక్స్ ద్వారా డీటెయిల్స్ బయటకు వచ్చాయి. Vivo X100s మరియు Vivo X100s Pro ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. మే 7న ఈ చిప్సెట్ లాంచ్ అవుతోంది. ఈ చిప్సెట్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.4GHz. ఇమ్మోర్టాలిస్-జీ720 ఎంసీ12 జీపీయూ గ్రాఫిక్స్‌ని ఈ ఫోన్లలో వాడనున్నారు.

The post Vivo: లీకైన Vivo X100s, X100s Pro, X100 Ultra ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>