Vivo: Dimensity 9300+ చిప్సెట్‌తో చైనాలో లాంచైన Vivo X100s, Vivo X100s Pro

Highlights

  • చైనాలో Vivo X100s సిరీస్ లాంచ్
  • లైనప్‌లో వచ్చిన Vivo X100s, X100s Pro
  • 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన సొంత మార్కెట్ చైనాలో X100s సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo X100s మరియు Vivo X100s Pro డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఫోన్లు శక్తివంతమైన స్పెసిఫికేషన్స్ తో వచ్చాయి. ఈ ఫోన్లలో 32ఎంపి సెల్ఫీ కెమెరా, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ల ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo X100s, X100s Pro ధరలు

Vivo X100s 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 3999 యువాన్లు (సుమారు రూ.47,000) గా నిర్ణయించారు. 16జిబి + 256జిబి మోడల్ ధర 4399 యువాన్లు (సుమారు రూ.51,800) గా ఉంది. 16జిబి + 512జిబి వేరియంట్ ధర 4699 యువాన్లు (సుమారు రూ.55,000) గా ఉంది. 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధరను 5199 యువాన్లు (సుమారు రూ.61,000) గా నిర్ణయించారు.

Vivo X100s స్మార్ట్‌ఫోన్ చైనాలో టైటానియమ్, వైట్, బ్లాక్/గ్రే మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo X100s Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 4999 యువాన్లు (సుమారు రూ.58,900) గా ఉంది. 16జిబి + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 5599 యువాన్లు (సుమారు రూ.65,900) గా ఉంది. 16జిబి + 1టిబి మోడల్ ధరను 6199 యువాన్లు (సుమారు రూ.72,900) గా నిర్ణయించారు.

Vivo X100s Pro స్మార్ట్‌ఫోన్ చైనాలో టైటానియమ్, వైట్ మరియు బ్లాక్/గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo X100s, Vivo X100s Pro స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo X100s, Vivo X100s Pro డివైజెస్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్ హోల్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. Vivo X100s Pro మోడల్ లో కర్వ్డ్ డిస్ప్లే, X100s లో ఫ్లాట్ ప్యానెల్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo X100s మరియు Vivo X100s Pro డివైజెస్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ తో వచ్చాయి. ఈ ప్రాసెసర్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.4GHz.

కెమెరా: Vivo X100s Pro డివైజ్ 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి పెరిస్కోప్ 4.3x లెన్స్ ఉన్నాయి. మరోవైపు, Vivo X100s లో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 64ఎంపి 3ఎక్స్ పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి.

బ్యాటరీ: Vivo X100s Pro లో 5400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. Vivo X100s లో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.

చార్జింగ్: Vivo X100s డివైజ్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. మరోవైపు Vivo X100s Pro 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.