Vivo Y17s - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 01 May 2024 15:32:43 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo: వై-సిరీస్ ఫోన్ల ధరను తగ్గించిన వివో https://www.91mobiles.com/telugu/vivo-reduced-y-series-phones-prices/ Wed, 01 May 2024 15:32:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=11301 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన వై-సిరీస్ ఫోన్ల ధరను తగ్గించింది. Vivo Y27, Vivo Y17s 64GB, Vivo Y17s 128GB ఫోన్ల ధర తగ్గింది. ఈ ఫోన్లు ఇప్పటికే తక్కువ ధరకి అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు మరింత ధర తగ్గడం యూజర్లకు శుభవార్తేనని చెప్పాలి. మరి ఈ మోడల్ ధర ఏమేరకు తగ్గిందో ఓసారి తెలుసుకుందాం పదండి. Vivo Y27 ధర Vivo Y27 స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ […]

The post Vivo: వై-సిరీస్ ఫోన్ల ధరను తగ్గించిన వివో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వివో ఫోన్ల ధర తగ్గింపు
  • Vivo Y27, Y17s ధర తగ్గింపు
  • ప్రారంభ ధర రూ.9499

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన వై-సిరీస్ ఫోన్ల ధరను తగ్గించింది. Vivo Y27, Vivo Y17s 64GB, Vivo Y17s 128GB ఫోన్ల ధర తగ్గింది. ఈ ఫోన్లు ఇప్పటికే తక్కువ ధరకి అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు మరింత ధర తగ్గడం యూజర్లకు శుభవార్తేనని చెప్పాలి. మరి ఈ మోడల్ ధర ఏమేరకు తగ్గిందో ఓసారి తెలుసుకుందాం పదండి.

Vivo Y27 ధర

Vivo Y27 స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ ధర రూ.1,000 తగ్గింది. ఈ ఫోన్ ఇదివరకు రూ.11,999 ధరకి అమ్ముడైంది. ధర తగ్గింపు తర్వాత ఇప్పుడు దీన్ని రూ.10,999 కి కొనుగోలు చేయవచ్చు. వివో వై27 బర్గండీ బ్లాక్ మరియు గార్డెన్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తోంది.

Vivo Y17s ధర

Vivo Y17s స్మార్ట్‌ఫోర్ రెండు మొమరీ వేరియంట్స్ లో లభిస్తుంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,499 గా ఉంది. రూ.1,000 ధర తగ్గింపు తర్వాత ఈ ఫోన్ రూ.9,499 కి లభించనుంది.

Vivo Y17s 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ అసలు ధర రూ.11,499 గా ఉంది. ఇప్పుడు రూ.1,000 తగ్గింపు తర్వాత ఈ ఫోన్ రూ.10,499 కి లభించనుంది.

Vivo Y27 స్పెసిఫికేషన్స్

Vivo Y27 లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, 8ఎంపి సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 6జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

Vivo Y17s స్పెసిఫికేషన్స్

Vivo Y17s లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, మాలి-జీ52 ఎంసీ2 జీపీయూ, 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

The post Vivo: వై-సిరీస్ ఫోన్ల ధరను తగ్గించిన వివో first appeared on 91Mobiles Telugu.

]]>
50MP కెమెరా, 5,000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Vivo Y17s https://www.91mobiles.com/telugu/vivo-y17s-launched-india-price-specs-availability/ Tue, 03 Oct 2023 05:52:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=8244 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Vivo భారతీయ మార్కెట్ లో Vivo Y17s డివైజ్ ని లాంచ్ చేసింది. మిడ్-రేంజ్ కేటగిరీలో ఈ ఫోన్ తీసుకురాబడింది. ఈ ఫోన్ ని ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ ద్వారా విక్రయించనున్నారు. 50ఎంపి మెయిన్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.65-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, వాటర్ డ్రాప్ నాచ్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ గ్రేటర్ నోయిడా లోని ప్లాంట్ లో తయారు చేశారు. సరే, ఓసారి Vivo Y17s […]

The post 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Vivo Y17s first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా అమ్ముడవ్వనున్న Vivo Y17s
  • కలర్ ఆప్షన్స్: గ్లిట్టర్ పర్పుల్, ఫారెస్ట్ గ్రీన్
  • హీలియో జీ85 చిప్ తో వచ్చిన Vivo Y17s

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Vivo భారతీయ మార్కెట్ లో Vivo Y17s డివైజ్ ని లాంచ్ చేసింది. మిడ్-రేంజ్ కేటగిరీలో ఈ ఫోన్ తీసుకురాబడింది. ఈ ఫోన్ ని ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ ద్వారా విక్రయించనున్నారు. 50ఎంపి మెయిన్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.65-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, వాటర్ డ్రాప్ నాచ్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ గ్రేటర్ నోయిడా లోని ప్లాంట్ లో తయారు చేశారు. సరే, ఓసారి Vivo Y17s డివైజ్ ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo Y17s ధర, లభ్యత

  • Vivo Y17s రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది.
  • 4జిబి ర్యామ్ +, 64జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.11,499 గా నిర్ణయించారు.
  • 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,499 గా ఉంది.
  • గ్లిట్టర్ పర్పుల్, ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.
  • అక్టోబర్ 2 నుంచి Vivo Y17s సేల్ ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ ద్వారా మొదలైంది.

Vivo Y17s స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y17s లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y17s లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ52 ఎంసీ2 జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: Vivo Y17s డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Vivo Y17s లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Vivo Y17s లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo Y17s డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు: Vivo Y17s లో 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ 54 రేటింగ్ ఉన్నాయి.

The post 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Vivo Y17s first appeared on 91Mobiles Telugu.

]]>
తక్కువ ధరతో లాంచ్ కానున్న Vivo Y17s, లీకైన స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/vivo-y17s-low-budget-phone-specs-leaked/ Sun, 17 Sep 2023 17:29:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=8056 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో Vivo Y17s డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. బడ్జెట్ సెగ్మెంట్ కొనుగోలుదారులను ఉద్దేశించి ఈ ఫోన్ తీసుకొస్తున్నారు. తాజాగా Vivo Y17s డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ ఫోన్ ధర రూ.10,000 వద్ద ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. సరే, ఓసారి ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. Vivo Y17s లాంచ్ టైమ్‌లైన్, ధర (లీక్) వివో సంస్థ నుంచి […]

The post తక్కువ ధరతో లాంచ్ కానున్న Vivo Y17s, లీకైన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y17s
  • తాజాగా లీకైన Vivo Y17s స్పెసిఫికేషన్స్
  • 5000mAh బ్యాటరీతో రానున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో Vivo Y17s డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. బడ్జెట్ సెగ్మెంట్ కొనుగోలుదారులను ఉద్దేశించి ఈ ఫోన్ తీసుకొస్తున్నారు. తాజాగా Vivo Y17s డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ ఫోన్ ధర రూ.10,000 వద్ద ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. సరే, ఓసారి ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo Y17s లాంచ్ టైమ్‌లైన్, ధర (లీక్)

వివో సంస్థ నుంచి Vivo Y17s లాంచ్ కి సంబంధించిన ప్రకటన ఇంకా రాలేదు. కానీ, ఫోన్ అఫీషియల్ లాంచ్ తేదీ ప్రకటన త్వరలోనే ఉంటుందని భావిస్తున్నారు. Tech Outlook వెబ్‌సైట్ తాజాగా Vivo Y17s డివైజ్ యొక్క స్పెక్‌షీట్ ని రివీల్ చేసింది. ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఈ ఫోన్ ధర రూ.10,000 వద్ద ఉంటుందట. అంటే ఇండియన్ యూజర్లకు మరొక బడ్జెట్ ఆప్షన్ దొరికినట్లే.

Vivo Y17s స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Vivo Y17s స్మార్ట్‌ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 840 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo Y17s లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ ఉండే అవకాశం ఉంది.
  • స్టోరేజీ: Vivo Y17s డివైజ్ లో 4జిబి ర్యామ్, 128జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఉంటాయి. అంతేకాదు, ఇందులో 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఆప్షన్ ఉంటుంది. అంటే యూజర్ కి 8జిబి వరకు ర్యామ్ లభించనుంది.
  • కెమెరా: Vivo Y17s డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి పొట్రెయిట్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Vivo Y17s లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo Y17s డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo Y17s లో డ్యూయల్ సిమ్ 4జీ, బ్లూటూత్, వై-ఫై, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post తక్కువ ధరతో లాంచ్ కానున్న Vivo Y17s, లీకైన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న Vivo Y17s; స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-y17s-spotted-geekbench-specs-revealed/ Tue, 05 Sep 2023 12:32:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=7866 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo త్వరలోనే ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo Y17s అనే పేరుతో వచ్చే ఈ ఫోన్ తాజాగా బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై కనిపించింది. దీంతో Vivo Y17s డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Vivo Y17s స్మార్ట్ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. Vivo Y17 కి అప్‌గ్రేడ్ వర్షన్ గా […]

The post త్వరలో లాంచ్ కానున్న Vivo Y17s; స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చవకైన ఫోన్ Vivo Y17s ని లాంచ్ చేయనున్న వివో
  • గీక్‌బెంచ్ పై కనిపించిన Vivo Y17s
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo త్వరలోనే ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo Y17s అనే పేరుతో వచ్చే ఈ ఫోన్ తాజాగా బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై కనిపించింది. దీంతో Vivo Y17s డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Vivo Y17s స్మార్ట్ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo Y17 కి అప్‌గ్రేడ్ వర్షన్ గా వస్తోన్న Vivo Y17s

Vivo Y17s డివైజ్ గతంలో వచ్చిన Vivo Y17 కి అప్‌గ్రేడ్ వర్షన్ గా మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. Vivo Y17 ధర రూ.10,000 లోపు ఉంది. అయితే, Vivo Y17s డివైజ్ లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే కంపెనీ నుంచి అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Vivo Y17s స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Vivo Y17s డివైజ్ లో 6.55-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 720*1600 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo Y17s లో మీడియాటెక్ హీలియో జీ37 ఆక్టా-కోర్ చిప్ ఉంటుంది. ఇది 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
  • ర్యామ్ మెమొరీ: Vivo Y17s డివైజ్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. 128జిబి వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుందని సమాచారం.
  • కెమెరా: Vivo Y17s లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ లెన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: Vivo Y17s లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ వివరాలు ఇంకా తెలియలేదు.

The post త్వరలో లాంచ్ కానున్న Vivo Y17s; స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>