
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో Vivo Y17s డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. బడ్జెట్ సెగ్మెంట్ కొనుగోలుదారులను ఉద్దేశించి ఈ ఫోన్ తీసుకొస్తున్నారు. తాజాగా Vivo Y17s డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ ఫోన్ ధర రూ.10,000 వద్ద ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. సరే, ఓసారి ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Vivo Y17s లాంచ్ టైమ్‌లైన్, ధర (లీక్)
వివో సంస్థ నుంచి Vivo Y17s లాంచ్ కి సంబంధించిన ప్రకటన ఇంకా రాలేదు. కానీ, ఫోన్ అఫీషియల్ లాంచ్ తేదీ ప్రకటన త్వరలోనే ఉంటుందని భావిస్తున్నారు. Tech Outlook వెబ్‌సైట్ తాజాగా Vivo Y17s డివైజ్ యొక్క స్పెక్‌షీట్ ని రివీల్ చేసింది. ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఈ ఫోన్ ధర రూ.10,000 వద్ద ఉంటుందట. అంటే ఇండియన్ యూజర్లకు మరొక బడ్జెట్ ఆప్షన్ దొరికినట్లే.
Vivo Y17s స్పెసిఫికేషన్స్ (లీక్)
- స్క్రీన్: Vivo Y17s స్మార్ట్‌ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 840 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
- ప్రాసెసర్: Vivo Y17s లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ ఉండే అవకాశం ఉంది.
- స్టోరేజీ: Vivo Y17s డివైజ్ లో 4జిబి ర్యామ్, 128జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఉంటాయి. అంతేకాదు, ఇందులో 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఆప్షన్ ఉంటుంది. అంటే యూజర్ కి 8జిబి వరకు ర్యామ్ లభించనుంది.
- కెమెరా: Vivo Y17s డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి పొట్రెయిట్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Vivo Y17s లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Vivo Y17s డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Vivo Y17s లో డ్యూయల్ సిమ్ 4జీ, బ్లూటూత్, వై-ఫై, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.











