Vivo Y18 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 03 May 2024 13:11:13 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo Y18: 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన వివో కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/vivo-y18-launched-in-india-with-5000mah-battery/ Fri, 03 May 2024 13:09:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=11342 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారత్ లో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Vivo Y18 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ 4జీ కనెక్టివిటీ, హెచ్డీ+ స్క్రీన్, మీడియాటెక్ హీలియో చిప్సెట్, ఐపీ54 రేటింగ్, 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వచ్చింది. ఓసారి వివో వై18 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలను తెలుసుకుందాం పదండి. Vivo Y18 […]

The post Vivo Y18: 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన వివో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ Vivo Y18 లాంచ్
  • మీడియాటెక్ హీలియో చిప్సెట్
  • 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారత్ లో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Vivo Y18 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ 4జీ కనెక్టివిటీ, హెచ్డీ+ స్క్రీన్, మీడియాటెక్ హీలియో చిప్సెట్, ఐపీ54 రేటింగ్, 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వచ్చింది. ఓసారి వివో వై18 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo Y18 ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్

Vivo Y18 స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.8,999 గా ఉంది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.9,999 గా పెట్టారు. వివో ఈస్టోర్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. Vivo Y18 డివైజ్ జెమ్ గ్రీన్ మరియు స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. పదివేల లోపు బడ్జెట్ లో ఫోన్ కొనాలని భావించే వారికి వివో వై18 మంచి ఆప్షన్ అవ్వవచ్చు.

Vivo Y18 స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo Y18 లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ హెచ్‌బీఎమ్ బ్రైట్నెస్, 83 పర్సెంట్ ఎన్టీఎస్‌సీ గేముత్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్, వాటర్‌డ్రాప్ నాచ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y18 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, మాలి జీ52 జీపీయూ ఉన్నాయి.

కెమెరా: Vivo Y18 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, వీజీఏ (0.8ఎంపి) సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y18 డివైజ్ లో 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 64జిబి/128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

సాఫ్ట్‌వేర్: Vivo Y18 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo Y18 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

భద్రత: Vivo Y18 లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

కనెక్టివిటీ: Vivo Y18 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, యూఎస్బీ 2.0 ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Vivo Y18 డివైజ్ 163.63 మి.మీ పొడవు, 75.58 మి.మీ వెడల్పు, 8.39 మి.మీ మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది.

The post Vivo Y18: 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన వివో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Vivo Y18, బీఐఎస్ సైట్ పై లిస్టైన డివైజ్! https://www.91mobiles.com/telugu/vivo-y18-listed-on-bis-website-soon-launch-india/ Thu, 11 Apr 2024 08:24:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=11038 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo Y18 పేరుతో వస్తోన్న ఈ ఫోన్ తాజాగా భారత్‌కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ (బీఐఎస్) పై లిస్ట్ అయ్యింది. దీంతో భారత్ లాంచ్ త్వరలోనే ఉంటుందని అర్థమవుతోంది. ఇదివరకు ఇదే ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ మరియు గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్స్ పై కూడా లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి Vivo Y18 యొక్క BIS […]

The post Vivo: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Vivo Y18, బీఐఎస్ సైట్ పై లిస్టైన డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y18 భారత్ లో లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ V2333
  • మీడియాటెక్ హీలియో జీ85 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo Y18 పేరుతో వస్తోన్న ఈ ఫోన్ తాజాగా భారత్‌కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ (బీఐఎస్) పై లిస్ట్ అయ్యింది. దీంతో భారత్ లాంచ్ త్వరలోనే ఉంటుందని అర్థమవుతోంది. ఇదివరకు ఇదే ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ మరియు గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్స్ పై కూడా లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి Vivo Y18 యొక్క BIS సర్టిఫికేషన్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo Y18 బీఐఎస్ లిస్టింగ్

Vivo Y18 స్మార్ట్‌ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై V2333 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

ఇదే మోడల్ నంబర్ తో గతంలో బ్లూటూత్ ఎస్ఐజీ మరియు గూగుల్ ప్లే కన్సోల్ పై కూడా Vivo Y18 లిస్ట్ అయ్యింది.

మరో విషయం ఏంటంటే, ఇదే మోడల్ నంబర్ తో గ్లోబల్ మార్కెట్ లో వివో సంస్థ Vivo Y03 అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది.

Vivo Y18 స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో వివో వై03 కి రీబ్రాండ్ వర్షన్ గా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

Vivo Y18 స్పెసిఫికేషన్స్

Vivo Y18 స్మార్ట్‌ఫోన్ లో 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

వివో వై18 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, ఏఆర్ఎమ్ మాలి జీ52 జీపీయూ ఉంటాయి.

Vivo Y18 6జిబి ర్యామ్ తో వస్తున్నట్లు గతంలో ఓ లిస్టింగ్ ద్వారా తెలిసింది. ఇతర స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

వివో వై18 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 14.0 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవుతుంది.

ఇది కూడా చదవండి: రివీలైన Vivo X100 Ultra లాంచ్ టైమ్‌లైన్

Vivo Y03 స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo Y03 లో 6.56-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1612*720 పిక్సెల్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y03 లో ఎంట్రీ లెవెల్ చిప్సెట్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y03 డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మరియు 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ. 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ ని కూడా ఈ ఫోన్ లో అందించారు. అంటే యూజర్ కి 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. ఇంకా మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Vivo Y03 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, ఓవీజీఏ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo Y03 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Vivo: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Vivo Y18, బీఐఎస్ సైట్ పై లిస్టైన డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్టైన Vivo Y18 https://www.91mobiles.com/telugu/vivo-y18-listed-on-google-play-console/ Thu, 14 Mar 2024 18:18:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=10694 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo Y18 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. కొన్ని రోజుల క్రితం Vivo Y18e బీఐఎస్ పై V2350 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ ఆర్టికల్ లో Vivo Y18 యొక్క గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు, ప్రధాన స్పెసిఫికేషన్స్ […]

The post Vivo: గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్టైన Vivo Y18 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y18 లాంచ్
  • గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన డివైజ్
  • డివైజ్ మోడల్ నంబర్ V2350

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo Y18 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. కొన్ని రోజుల క్రితం Vivo Y18e బీఐఎస్ పై V2350 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ ఆర్టికల్ లో Vivo Y18 యొక్క గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు, ప్రధాన స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo Y18 గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

Vivo Y18 స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై V2333 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా కొన్ని ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

Vivo Y18 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఇకపోతే ఈ ఫోన్ 6జిబి ర్యామ్ తో వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇతర ర్యామ్ వేరియంట్స్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Vivo Y18 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ ద్వారా బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ కన్ఫర్మ్ అయ్యింది. వివో వై03 వంటి డిజైన్ తో Vivo Y18 ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది.

Vivo Y03 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y03 డివైజ్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్సీడీ ప్యానెల్, 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 70% ఎన్టీఎస్‌సీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y03 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, మాలి-జీ52 ఎంపీ2 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y03 డివైజ్ 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 64జిబి/128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • సాఫ్ట్‌వేర్: Vivo Y03 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Vivo Y03 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, క్యూవీజీఏ సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Vivo Y03 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫ్లాష్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ అందించారు.
  • సెక్యూరిటీ: Vivo Y03 లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, సాఫ్ట్‌వేర్ బేస్డ్ ఫేస్ అన్‌లాక్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Vivo Y03 లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.

The post Vivo: గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్టైన Vivo Y18 first appeared on 91Mobiles Telugu.

]]>