Vivo: 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో లాంచైన Vivo Y03

Highlights

  • Vivo Y03 గ్లోబల్ లాంచ్
  • హీలియో జీ85 చిప్సెట్
  • 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo ఒక కొత్త వై-సిరీస్ డివైజ్ ని గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేసింది. Vivo Y03 పేరుతో ఈ ఫోన్ ఇండోనేషియన్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ లో యూజర్లకు ఉపయోగపడే ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. తక్కువ ధరలో స్టైలిష్ లుక్, 8జిబి ర్యామ్ పవర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ54 రేటింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో లభిస్తున్నాయి. సరే, ఓసారి Vivo Y03 ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo Y03 ధర

Vivo Y03 స్మార్ట్‌ఫోన్ ఇండోనేషియన్ మార్కెట్ లో రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.

Vivo Y03 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధర IDR 12,99,000 (సుమారు రూ.6,900) గా ఉంది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర IDR 14,99,000 (సుమారు రూ.8,000) గా ఉంది. Vivo Y03 స్మార్ట్‌ఫోన్ జెమ్ గ్రీన్ మరియు స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y03 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y03 లో 6.56-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y03 లో ఎంట్రీ లెవెల్ చిప్సెట్ మీడియాటెక్ హీలియో జీ85 వాడారు. గేమింగ్ తో పాటు ఇతర టాస్కుల్లో దీని పెర్ఫామెన్స్ బాగుంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y03 డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మరియు 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అంతేకాదు, ఇంకా ఈ ఫోన్ 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ సపోర్ట్ తో వచ్చింది. దీంతో యూజర్ కి గరిష్టంగా 8జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Vivo Y03 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, ఓవీజీఏ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Vivo Y03 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo Y03 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo Y03 లో బ్లూటూత్ 5.0, వై-ఫై, డ్యూయల్ సిమ్, 4జీ, జీపీఎస్, ఓటీజీ, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.
Previous articleInfinix: మార్చి 18న లాంచ్ అవుతోన్న Infinix Note 40 సిరీస్
Next articleiQOO Z9 5G లో ఉన్న టాప్-5 ఫీచర్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.