Vivo Y200 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 21 May 2024 10:42:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo Y200 Pro 5G: 3డీ కర్వ్‌డ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన వివో వై200 ప్రో 5జీ https://www.91mobiles.com/telugu/vivo-y200-pro-5g-launched-india-3d-curved-display/ Tue, 21 May 2024 10:42:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=11643 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారత్‌లో కొత్త వై-సిరీస్ డివైజ్‌ని లాంచ్ చేసింది. Vivo Y200 Pro 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. Vivo Y200 Pro 5G డివైజ్ లో 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 16జిబి వరకు ర్యామ్, ఐపీ54 రేటింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ డివైజ్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Vivo Y200 Pro […]

The post Vivo Y200 Pro 5G: 3డీ కర్వ్‌డ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన వివో వై200 ప్రో 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Vivo Y200 Pro 5G లాంచ్
  • 16జిబి ర్యామ్ (వర్చువల్ ర్యామ్‌తో సహా)
  • 64ఎంపి ఓఐఎస్ కెమెరా సెటప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారత్‌లో కొత్త వై-సిరీస్ డివైజ్‌ని లాంచ్ చేసింది. Vivo Y200 Pro 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. Vivo Y200 Pro 5G డివైజ్ లో 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 16జిబి వరకు ర్యామ్, ఐపీ54 రేటింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ డివైజ్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo Y200 Pro 5G ధర, లభ్యత

Vivo Y200 Pro 5G స్మార్ట్‌ఫోన్ సింగిల్ స్టోరేజీ వేరియంట్ లో లభిస్తుంది. ఓసారి ధర వివరాలు తెలుసుకుందాం.

Vivo Y200 Pro 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.24,999 గా నిర్ణయించారు. లాంచ్ ఆఫర్ లో భాగంగా హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ మరియు ఎస్బీఐ బ్యాంక్ కార్డ్స్ పై రూ.1500 డిస్కౌంట్ లభిస్తుంది. నేటి నుంచి మే 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

Vivo Y200 Pro 5G డివైజ్ సిల్క్ గ్రీన్ మరియు సిల్క్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Vivo Y200 Pro 5G సేల్ నేటి నుంచి మొదలవుతుంది.

Vivo Y200 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y200 Pro 5G లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, పంచ్ హోల్ కటౌట్, 3డీ కర్వ్డ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్నెస్, 2400 * 1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y200 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. ఇది 5జీ చిప్సెట్. డివైజ్ ధరను బట్టి చూస్తే, ఈ చిప్సెట్ సరైనదేనని చెప్పవచ్చు. పెర్ఫామెన్స్ పరంగా, గేమింగ్ పరంగా ఈ చిప్సెట్ సరిపోతుంది.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y200 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీని కలిగి ఉంది. వర్చువల్ ర్యామ్ ద్వారా యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo Y200 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Vivo Y200 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo Y200 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, జీపీఎస్, ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Vivo Y200 Pro 5G: 3డీ కర్వ్‌డ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన వివో వై200 ప్రో 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo Y200 Pro 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/vivo-y200-pro-5g-india-launch-date-confirmed/ Thu, 16 May 2024 14:28:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=11571 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్ భారత్ లో లాంచ్ కానుంది. Vivo Y200 Pro 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా వివో సంస్థ ఈ ఫోన్ ఇండియా లాంచ్‌ని కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు లాంచ్ తేదీని కూడా ప్రకటించింది. 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి లాంచ్ తేదీ వివరాలు మరియు […]

The post Vivo Y200 Pro 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మే 21న భారత్ లో Vivo Y200 Pro 5G లాంచ్
  • సిల్క్ గ్లాస్ రియర్ డిజైన్, 3డీ కర్వ్డ్ డిస్ప్లే
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్ భారత్ లో లాంచ్ కానుంది. Vivo Y200 Pro 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా వివో సంస్థ ఈ ఫోన్ ఇండియా లాంచ్‌ని కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు లాంచ్ తేదీని కూడా ప్రకటించింది. 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి లాంచ్ తేదీ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

Vivo Y200 Pro 5G లాంచ్ తేదీ

Vivo Y200 Pro 5G డివైజ్ భారత్ లో మే 21న లాంచ్ అవుతోంది. లాంచ్ ఈవెంట్ వివో యొక్క అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ పై ప్రత్యక్ష ప్రసారం కానుంది. సిల్క్ గ్లాస్ బ్యాక్ డిజైన్ తో ఈ ఫోన్ వస్తోందని టీజర్ ద్వారా తెలుస్తోంది.

Vivo Y200 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. రెక్టాంగ్యులర్ మాడ్యూయల్ లో కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. ఈ అప్‌కమింగ్ వై-సిరీస్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అందిస్తున్నారు.

Vivo Y200 Pro 5G డివైజ్‌కి కుడివైపున పవర్ బటన్ మరియు వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. Vivo Y200 Pro 5G డివైజ్ ధర రూ.25,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Vivo Y200 Pro 5G కెమెరా విభాగం విషయానికి వస్తే, ఓఐఎస్ సపోర్ట్ గల యాంటీ-షేక్ మెయిన్ కెమెరా ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది. ఇతర స్పెసిఫికేషన్స్ ప్రస్తుతానికి బయటకు రాలేదు. త్వరలోనే వెల్లడవ్వనున్నాయి.

The post Vivo Y200 Pro 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo Y200 Pro: లీకైన వై200 ప్రో ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-y200-pro-5g-price-specs-leaked/ Tue, 14 May 2024 09:38:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=11517 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. Vivo Y200 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ధర మరియు స్పెసిఫికేషన్స్‌కి సంబంధించిన సమాచారం 91mobiles కి అందింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి. Vivo Y200 Pro ధర Vivo Y200 Pro స్మార్ట్‌ఫోన్ మిడ్-బడ్జెట్ రేంజ్ లో లాంచ్ అవుతోంది. దీని […]

The post Vivo Y200 Pro: లీకైన వై200 ప్రో ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y200 Pro లాంచ్
  • తాజాగా లీకైన ధర, స్పెసిఫికేషన్స్
  • స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. Vivo Y200 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ధర మరియు స్పెసిఫికేషన్స్‌కి సంబంధించిన సమాచారం 91mobiles కి అందింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y200 Pro ధర

Vivo Y200 Pro స్మార్ట్‌ఫోన్ మిడ్-బడ్జెట్ రేంజ్ లో లాంచ్ అవుతోంది. దీని ధర రూ.25,000 వద్ద ఉంటుంది. నివేదిక గనుక నిజమైతే, మిడ్ సెగ్మెంట్ లో స్లిమ్మెస్ట్ 3డీ కర్వ్డ్ స్క్రీన్ గల ఫోన్ గా Vivo Y200 Pro నిలవనుంది. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.23,999 గా ఉంటుంది.

Vivo Y200 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y200 Pro లో 3డీ కర్వ్డ్ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo Y200 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz.

కెమెరా: Vivo Y200 Pro లో మెయిన్ కెమెరా ఓఐఎస్ ఫీచర్ తో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఒక పొట్రెయిట్ లెన్స్ కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Vivo Y200 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo Y200 5G లో 6.67-ఇంచ్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y200 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 5జీ ప్రాసెసర్.

ఓఎస్: Vivo Y200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

మెమొరీ: Vivo Y200 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చింది. దీని ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo Y200 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక స్మార్ట్ ఆరా లైట్ ఫ్లాష్ ఉంది. Vivo Y200 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Vivo Y200 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ
ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo Y200 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo Y200 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ స్లిమ్ బాడీ కలిగి ఉంది. Vivo Y200 5G డివైజ్ 7.69 మి.మీ మందం మాత్రమే ఉంది.

The post Vivo Y200 Pro: లీకైన వై200 ప్రో ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Y200 Pro 5G https://www.91mobiles.com/telugu/vivo-y200-pro-5g-listed-on-google-play-console/ Tue, 05 Mar 2024 10:42:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=10544 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo Y200 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ హ్యాండ్సెట్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్టైంది. 8జిబి ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలిసింది. సరే, ఓసారి Vivo Y200 Pro 5G డివైజ్ యొక్క గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు […]

The post Vivo: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Y200 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y200 Pro 5G
  • గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్టైన డివైజ్
  • 8జిబి ర్యామ్ తో వస్తోన్న వివో వై200 ప్రో 5జీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo Y200 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ హ్యాండ్సెట్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్టైంది. 8జిబి ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలిసింది. సరే, ఓసారి Vivo Y200 Pro 5G డివైజ్ యొక్క గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y200 Pro 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

  • Vivo Y200 Pro 5G డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై V2303T అనే ప్రోడక్ట్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా Vivo Y200 Pro 5G యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Vivo Y200 Pro 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y200 Pro 5G లో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, 440 డీపీఐ స్క్రీన్ డెన్సిటీ ఉంటాయి.
  • చిప్సెట్: Vivo Y200 Pro 5G లో స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, అడ్రెనో 619 జీపీయూ ఉన్నాయి. ఈ చిప్సెట్ 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
  • ర్యామ్: Vivo Y200 Pro 5G డివైజ్ లో 8జిబి ర్యామ్ ఉంటుందని గూగుల్ ప్లే కన్సోల్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Vivo Y200 Pro 5G ఫోన్ గతంలో లాంచైన Vivo V29e ఫోన్‌కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తోందని 91mobiles కి ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందింది. అంటే వివో వీ29ఈ లోని స్పెసిఫికేషన్స్ Vivo Y200 Pro లో ఉండే అవకాశం ఉంది.

The post Vivo: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Y200 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>