Vivo Y200 Pro 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు

Highlights

  • మే 21న భారత్ లో Vivo Y200 Pro 5G లాంచ్
  • సిల్క్ గ్లాస్ రియర్ డిజైన్, 3డీ కర్వ్డ్ డిస్ప్లే
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్ భారత్ లో లాంచ్ కానుంది. Vivo Y200 Pro 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా వివో సంస్థ ఈ ఫోన్ ఇండియా లాంచ్‌ని కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు లాంచ్ తేదీని కూడా ప్రకటించింది. 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి లాంచ్ తేదీ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

Vivo Y200 Pro 5G లాంచ్ తేదీ

Vivo Y200 Pro 5G డివైజ్ భారత్ లో మే 21న లాంచ్ అవుతోంది. లాంచ్ ఈవెంట్ వివో యొక్క అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ పై ప్రత్యక్ష ప్రసారం కానుంది. సిల్క్ గ్లాస్ బ్యాక్ డిజైన్ తో ఈ ఫోన్ వస్తోందని టీజర్ ద్వారా తెలుస్తోంది.

Vivo Y200 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. రెక్టాంగ్యులర్ మాడ్యూయల్ లో కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. ఈ అప్‌కమింగ్ వై-సిరీస్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అందిస్తున్నారు.

Vivo Y200 Pro 5G డివైజ్‌కి కుడివైపున పవర్ బటన్ మరియు వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. Vivo Y200 Pro 5G డివైజ్ ధర రూ.25,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Vivo Y200 Pro 5G కెమెరా విభాగం విషయానికి వస్తే, ఓఐఎస్ సపోర్ట్ గల యాంటీ-షేక్ మెయిన్ కెమెరా ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది. ఇతర స్పెసిఫికేషన్స్ ప్రస్తుతానికి బయటకు రాలేదు. త్వరలోనే వెల్లడవ్వనున్నాయి.