Vivo Y35 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 29 May 2023 09:45:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 6.44-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, డైమెన్సిటీ 6020 చిప్‌తో చైనాలో లాంచైన Vivo Y35+ 5G, Y35m+ 5G https://www.91mobiles.com/telugu/vivo-y35-plus-5g-vivo-y35m-plus-5g-launched-china-price-specs/ Mon, 29 May 2023 08:17:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=6519 ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వివో, కొత్త వై-సిరీస్ స్మార్ట్ ఫోన్లు Vivo Y35+ 5G, Y35m+ 5G ని లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు కలర్ ఆప్షన్స్, ర్యామ్, స్టోరేజీ విషయాల్లో తప్పితే ఒకే విధమైన స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉన్నాయి. Vivo Y35+ 5G, Y35m+ 5G స్మార్ట్ ఫోన్లలో 6.64-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, […]

The post 6.44-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, డైమెన్సిటీ 6020 చిప్‌తో చైనాలో లాంచైన Vivo Y35+ 5G, Y35m+ 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Vivo Y35+ 5G, Y35m+ 5G
  • 50ఎంపి డ్యూయల్ కెమెరా సెటప్‌తో వచ్చిన ఫోన్లు
  • గ్లోబల్ మార్కెట్స్ లో లభ్యతపై ఇంకా రాని ప్రకటన

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వివో, కొత్త వై-సిరీస్ స్మార్ట్ ఫోన్లు Vivo Y35+ 5G, Y35m+ 5G ని లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు కలర్ ఆప్షన్స్, ర్యామ్, స్టోరేజీ విషయాల్లో తప్పితే ఒకే విధమైన స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉన్నాయి. Vivo Y35+ 5G, Y35m+ 5G స్మార్ట్ ఫోన్లలో 6.64-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.

Vivo Y35+ 5G, Y35m+ 5G ధరలు, లభ్యత

Vivo Y35+ 5G డివైజ్ స్టార్ రింగ్ బ్లాక్, సాల్ట్ లేక్ బ్లూ మరియు నెబులా పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Vivo Y35+ 5G బేస్ మోడల్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 1,399 (సుమారు రూ.16,400) గా ఉంది. ఇక 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 1,599 (సుమారు రూ.18,700) గా ఉంది. టాప్ మోడల్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 1,799 (సుమారు రూ.21,000) గా ఉంది. ఈ ఫోన్ ని వివో అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా చైనాలో కొనుగోలు చేయవచ్చు.

Vivo Y35m+ 5G స్టార్ రింగ్ బ్లాక్, రిపుల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ ధరలు వరుసగా CNY 1599 (సుమారు రూ.18,700) మరియు CNY 1799 (సుమారు రూ.21,000) గా ఉన్నాయి. అయితే వివో సంస్థ ఈ డివైజెస్ యొక్క ఇతర మార్కెట్స్ లభ్యత గురించి ప్రకటన చేయలేదు.

Vivo Y35+ 5G, Y35m+ 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.44-ఇంచ్ డిస్ప్లే
  • ఐపీఎస్ ప్యానెల్

Vivo Y35+ 5G, Y35m+ 5G ఫోన్లలో 6.44-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ (2388*1080 పిక్సెల్ రెజుల్యూషన్), 19:9 యాస్పెక్ట్ రేషియో, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్

  • డైమెన్సిటీ 7020 చిప్

Vivo Y35+ 5G, Y35m+ 5G స్మార్ట్ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ

  • 8జిబి
  • 128జిబి/256జిబి

Vivo Y35+ 5G, Y35m+ 5G స్మార్ట్ ఫోన్లలో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్2.2 స్టోరేజీ ఉన్నాయి.

కెమెరా విభాగం

  • 50ఎంపి రియర్ కెమెరా
  • 8ఎంపి ఫ్రంట్ కెమెరా

Vivo Y35+ 5G, Y35m+ 5G ఫోన్లలో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 10ఎక్స్ డిజిటల్ జూమ్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ

  • 5000 ఎంఏహెచ్
  • 15 వాట్

ఈ ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇవి 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చాయి.

The post 6.44-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, డైమెన్సిటీ 6020 చిప్‌తో చైనాలో లాంచైన Vivo Y35+ 5G, Y35m+ 5G first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన Vivo Y35m+ 5G ధర, స్పెసిఫికేషన్స్, సేల్ వివరాలు https://www.91mobiles.com/telugu/vivo-y35m-plus-5g-price-specs-sale-details/ Wed, 17 May 2023 09:05:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=6346 వివో సంస్థ జనవరి నెలలో Vivo Y35m డివైజ్ ని లాంచ్ చేసింది. ఇదే వరుసలో Vivo Y35m+ 5G కూడా లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. చైనాకి చెందిన టెలీకామ్ వెబ్ సైట్ లో Vivo Y35m+ 5G డివైజ్ లిస్ట్ అయ్యింది. దీంతో Vivo Y35m+ 5G స్మార్ట్ ఫోన్ యొక్క ధర, ఫోటోలు, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Vivo Y35m+ 5G స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ తో పాటు ఇతర […]

The post రివీలైన Vivo Y35m+ 5G ధర, స్పెసిఫికేషన్స్, సేల్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో తొలుత అమ్ముడవ్వనున్న Vivo Y35m+
  • రెండు మెమొరీ వేరియంట్స్ లో రానున్న డివైజ్
  • ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలు తక్కువ

వివో సంస్థ జనవరి నెలలో Vivo Y35m డివైజ్ ని లాంచ్ చేసింది. ఇదే వరుసలో Vivo Y35m+ 5G కూడా లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. చైనాకి చెందిన టెలీకామ్ వెబ్ సైట్ లో Vivo Y35m+ 5G డివైజ్ లిస్ట్ అయ్యింది. దీంతో Vivo Y35m+ 5G స్మార్ట్ ఫోన్ యొక్క ధర, ఫోటోలు, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

సరే, ఓసారి Vivo Y35m+ 5G స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ తో పాటు ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y35m+ 5G లాంచ్ మరియు సేల్

Vivo Y35m+ 5G స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ వార్త ప్రచురించే సమయానికి, వివో చైనా వెబ్ సైట్ లో కూడా ఈ ఫోన్ లిస్ట్ అవ్వలేదు. కానీ, మరోవైపున ఈ స్మార్ట్ ఫోన్ చైనా టెలీకామ్ వెబ్ సైట్ లో V2279A అనే మోడల్ నంబర్ తో కనిపించింది. అలాగే Vivo Y35m+ 5G ఫోన్ చైనాలో మే 25 నుంచి సేల్ కి వస్తుందని తెలిసింది. అంటే మరో ఒకట్రెండు రోజుల్లో అఫీషియల్ గా ఫోన్ లాంచ్ కానుందని భావించవచ్చు.

Vivo Y35m+ 5G ధర

Vivo Y35m+ 5G స్మార్ట్ ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో రానున్నట్లు టెలీకామ్ సైట్ లిస్టింగ్ లో ఉంది. బేస్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీని ఆఫర్ చేయగా, టాప్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆఫర్ చేస్తుంది. 128జిబి వేరియంట్ ధర CNY 1599 (సుమారు రూ.18,900), 256జిబి వేరియంట్ ధర CNY 1799 (సుమారు రూ.20,900) గా ఉన్నాయి. Vivo Y35m+ 5G ఫోన్ స్టార్ రింగ్ బ్లాక్, రిపుల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y35m+ 5G స్పెసిఫికేషన్స్

  • Vivo Y35m+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ లేదా డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడనున్నారని సమాచారం.
  • Vivo Y35m+ 5G లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలిసింది.
  • వెబ్ సైట్ ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ ఓఎల్ఈడీ ప్యానెల్, వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే తో లాంచ్ కానుందని తెలుస్తోంది.
  • కెమెరా విభాగం విషయానికి వస్తే, Vivo Y35m+ 5G లో 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా ఉండనుంది.
  • సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం Vivo Y35m+ 5G లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది.
  • పవర్ బ్యాకప్ కోసం Vivo Y35m+ 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది.
  • Vivo Y35m+ 5G స్మార్ట్ ఫోన్ 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో రానున్నట్లు సమాచారం.
  • Vivo Y35m+ 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

The post రివీలైన Vivo Y35m+ 5G ధర, స్పెసిఫికేషన్స్, సేల్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
12GB ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తోన్న Vivo Y35 5G https://www.91mobiles.com/telugu/vivo-y35-5g-12-gb-ram-512-gb-storage-tenaa-listing/ Wed, 30 Nov 2022 08:10:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=3765 హైలైట్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ TENAA పై కనిపించిన Vivo Y35 5G Vivo V2230A అనే మోడల్ నంబర్ ని కలిగి ఉన్న హ్యాండ్సెట్ 6.51-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, మిడ్-రేంజ్ 5జీ చిప్సెట్ తో Vivo Y35 5G లాంచ్ అయ్యే అవకాశం ఇప్పటికే అందుబాటులో ఉన్న Vivo Y35 4G కి సక్సెసర్ గా రానున్న Vivo Y35 5G ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo వై-సిరీస్ లో మరో ఫోన్ ని […]

The post 12GB ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తోన్న Vivo Y35 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • సర్టిఫికేషన్ వెబ్‌సైట్ TENAA పై కనిపించిన Vivo Y35 5G
  • Vivo V2230A అనే మోడల్ నంబర్ ని కలిగి ఉన్న హ్యాండ్సెట్
  • 6.51-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, మిడ్-రేంజ్ 5జీ చిప్సెట్ తో Vivo Y35 5G లాంచ్ అయ్యే అవకాశం
  • ఇప్పటికే అందుబాటులో ఉన్న Vivo Y35 4G కి సక్సెసర్ గా రానున్న Vivo Y35 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo వై-సిరీస్ లో మరో ఫోన్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ సిరీస్ లో Vivo Y35 5G త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవలె భారత్ లో Vivo Y35 4జీ ఫోన్ ని వివో లాంచ్ చేసింది. దీని ధర రూ.18,499 గా ఉంది. ఇది స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చింది.

తాజాగా TENAA సైట్ లో Vivo Y35 5G మోడల్ లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. TENAA వెబ్‌సైట్ లో Vivo V2230A అనే మోడల్ నంబర్ తో హ్యాండ్సెట్ కనిపించింది. అయితే ఈ కొత్త ఫోన్ గురించి వివో ఎటువంటి అధికార ప్రకటన ఇంతవరకు చేయలేదు. TENAA లిస్టింగ్ ద్వారా రివీల్ అయిన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

Vivo Y35 5G స్పెసిఫికేషన్స్

రివీల్ అయిన వివరాలను బట్టి, Vivo Y35 5G స్మార్ట్ ఫోన్ 6.51-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1600 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్ తో రానుంది. ఈ ఫోన్ లో ఆక్టా-కోర్ 5జీ ప్రాసెసర్ వాడనున్నారు. ఈ ప్రాసెసర్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

TENAA లిస్టింగ్ ప్రకారం.. Vivo Y35 5G 4జిబి ర్యామ్, 6జిబి ర్యామ్, 8జిబి ర్యామ్, 12జిబి ర్యామ్ వేరియంట్స్ లో లభించనుంది. ఇక స్టోరేజీ విషయానికి వస్తే, ఈ ఫోన్ 64జిబి, 128జిబి, 256జిబి, 512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభ్యం కానుంది. Vivo Y35 5G స్మార్ట్ ఫోన్ 164.05 మిల్లీ మీటర్ల పొడవు, 75.6 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.15 మిల్లీ మీటర్ల మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది.

TENAA లిస్టింగ్ ప్రకారం.. Vivo Y35 5G కెమెరా విభాగం ఎలా ఉండనుందో తెలుసుకుందాం. Vivo Y35 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో/డెప్త్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 12GB ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తోన్న Vivo Y35 5G first appeared on 91Mobiles Telugu.

]]>