
వివో సంస్థ జనవరి నెలలో Vivo Y35m డివైజ్ ని లాంచ్ చేసింది. ఇదే వరుసలో Vivo Y35m+ 5G కూడా లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. చైనాకి చెందిన టెలీకామ్ వెబ్ సైట్ లో Vivo Y35m+ 5G డివైజ్ లిస్ట్ అయ్యింది. దీంతో Vivo Y35m+ 5G స్మార్ట్ ఫోన్ యొక్క ధర, ఫోటోలు, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.
సరే, ఓసారి Vivo Y35m+ 5G స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ తో పాటు ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.
Vivo Y35m+ 5G లాంచ్ మరియు సేల్
Vivo Y35m+ 5G స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ వార్త ప్రచురించే సమయానికి, వివో చైనా వెబ్ సైట్ లో కూడా ఈ ఫోన్ లిస్ట్ అవ్వలేదు. కానీ, మరోవైపున ఈ స్మార్ట్ ఫోన్ చైనా టెలీకామ్ వెబ్ సైట్ లో V2279A అనే మోడల్ నంబర్ తో కనిపించింది. అలాగే Vivo Y35m+ 5G ఫోన్ చైనాలో మే 25 నుంచి సేల్ కి వస్తుందని తెలిసింది. అంటే మరో ఒకట్రెండు రోజుల్లో అఫీషియల్ గా ఫోన్ లాంచ్ కానుందని భావించవచ్చు.
Vivo Y35m+ 5G ధర
Vivo Y35m+ 5G స్మార్ట్ ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో రానున్నట్లు టెలీకామ్ సైట్ లిస్టింగ్ లో ఉంది. బేస్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీని ఆఫర్ చేయగా, టాప్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆఫర్ చేస్తుంది. 128జిబి వేరియంట్ ధర CNY 1599 (సుమారు రూ.18,900), 256జిబి వేరియంట్ ధర CNY 1799 (సుమారు రూ.20,900) గా ఉన్నాయి. Vivo Y35m+ 5G ఫోన్ స్టార్ రింగ్ బ్లాక్, రిపుల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Vivo Y35m+ 5G స్పెసిఫికేషన్స్
- Vivo Y35m+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ లేదా డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడనున్నారని సమాచారం.
- Vivo Y35m+ 5G లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలిసింది.
- వెబ్ సైట్ ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ ఓఎల్ఈడీ ప్యానెల్, వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే తో లాంచ్ కానుందని తెలుస్తోంది.
- కెమెరా విభాగం విషయానికి వస్తే, Vivo Y35m+ 5G లో 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా ఉండనుంది.
- సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం Vivo Y35m+ 5G లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది.
- పవర్ బ్యాకప్ కోసం Vivo Y35m+ 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది.
- Vivo Y35m+ 5G స్మార్ట్ ఫోన్ 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో రానున్నట్లు సమాచారం.
- Vivo Y35m+ 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.











