హైలైట్స్
- సర్టిఫికేషన్ వెబ్సైట్ TENAA పై కనిపించిన Vivo Y35 5G
- Vivo V2230A అనే మోడల్ నంబర్ ని కలిగి ఉన్న హ్యాండ్సెట్
- 6.51-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, మిడ్-రేంజ్ 5జీ చిప్సెట్ తో Vivo Y35 5G లాంచ్ అయ్యే అవకాశం
- ఇప్పటికే అందుబాటులో ఉన్న Vivo Y35 4G కి సక్సెసర్ గా రానున్న Vivo Y35 5G
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo వై-సిరీస్ లో మరో ఫోన్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ సిరీస్ లో Vivo Y35 5G త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవలె భారత్ లో Vivo Y35 4జీ ఫోన్ ని వివో లాంచ్ చేసింది. దీని ధర రూ.18,499 గా ఉంది. ఇది స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చింది.
తాజాగా TENAA సైట్ లో Vivo Y35 5G మోడల్ లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. TENAA వెబ్సైట్ లో Vivo V2230A అనే మోడల్ నంబర్ తో హ్యాండ్సెట్ కనిపించింది. అయితే ఈ కొత్త ఫోన్ గురించి వివో ఎటువంటి అధికార ప్రకటన ఇంతవరకు చేయలేదు. TENAA లిస్టింగ్ ద్వారా రివీల్ అయిన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
Vivo Y35 5G స్పెసిఫికేషన్స్
రివీల్ అయిన వివరాలను బట్టి, Vivo Y35 5G స్మార్ట్ ఫోన్ 6.51-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1600 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్ తో రానుంది. ఈ ఫోన్ లో ఆక్టా-కోర్ 5జీ ప్రాసెసర్ వాడనున్నారు. ఈ ప్రాసెసర్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
TENAA లిస్టింగ్ ప్రకారం.. Vivo Y35 5G 4జిబి ర్యామ్, 6జిబి ర్యామ్, 8జిబి ర్యామ్, 12జిబి ర్యామ్ వేరియంట్స్ లో లభించనుంది. ఇక స్టోరేజీ విషయానికి వస్తే, ఈ ఫోన్ 64జిబి, 128జిబి, 256జిబి, 512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభ్యం కానుంది. Vivo Y35 5G స్మార్ట్ ఫోన్ 164.05 మిల్లీ మీటర్ల పొడవు, 75.6 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.15 మిల్లీ మీటర్ల మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది.
TENAA లిస్టింగ్ ప్రకారం.. Vivo Y35 5G కెమెరా విభాగం ఎలా ఉండనుందో తెలుసుకుందాం. Vivo Y35 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో/డెప్త్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












