హైలైట్స్:
- రివీల్ అయిన TCL 40R డిజైన్, స్పెసిఫికేషన్స్
- వాటర్ డ్రాప్ నాచ్, సెల్ఫీ కెమెరా, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ట్రిపుల్ కెమెరా సెన్సర్స్ తో వస్తోన్న హ్యాండ్సెట్
- పర్పుల్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న TCL 40R స్మార్ట్ ఫోన్
TCL 40R ఒక బడ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్. 91మొబైల్స్ ఈ ఫోన్ యొక్క రెండర్స్, స్పెసిఫికేషన్స్ ని రాబట్టింది. 5జీ కనెక్టివిటీతో వస్తున్న ఈ హ్యాండ్సెట్ డిఫరెంట్ డిజైన్ ని కలిగి ఉంది. సెల్ఫీ షూటర్ కోసం వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. రెక్ట్యాంగులర్ మాడ్యూల్ లో మూడు కెమెరాలు ఉన్నాయి. గ్రిప్ కోసం బ్యాక్ ప్యానెల్ పై యూనిక్ ప్యాటెర్న్ ఫినిష్ ని అందించారు.
TCL 40R లో హెచ్డీ+ 90 హెర్ట్జ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్, 5జీ కనెక్టివిటీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా సెన్సర్, 128జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.
TCL 40R డిజైన్
TCL 40R డిజైన్ అన్ని బడ్జెట్ ఫోన్ల మాదిరే ఉంది. సెల్ఫీ కెమెరా కోసం ఇందులో వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. స్క్రీన్ కింద మందపాటి బెజెల్ ఉంది. ఫోన్ కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై స్క్వేర్ మాడ్యూల్ లో ట్రిపుల్ కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఫోన్ బ్యాక్ ప్యానెల్ టెక్షర్డ్ డిజైన్ కలిగి ఉంది. పర్పుల్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
TCL 40R స్పెసిఫికేషన్స్
TCL 40R లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. సెల్ఫీ కెమెరా కోసం ఇందులో వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. TCL 40R లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ ని అమర్చారు. ఈ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి/128జిబి స్టోరేజీ తో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే అవకాశం ఉంది. TCL 40R స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
TCL 40R స్మార్ట్ ఫోన్ 164.46 మిల్లీ మీటర్ల పొడవు, 75.4 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.99 మిల్లీ మీటర్ల మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.1, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్లో యాక్సెలరోమీటర్, జైరో, ప్రాక్సిమిటీ, కంపాస్ వంటి సెన్సర్లు ఉండనున్నాయి.
ఇప్పుడు TCL 40R యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. TCL 40R లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ లెన్స్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం TCL 40R లో 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.
2023, మార్చి 31 న TCL 40R లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.