Home News TCL C69B 4K QLED Google TV: టీ-స్క్రీన్ ప్రో టెక్నాలజీతో భారత్‌లో లాంచైన టీసీఎల్ కొత్త టీవీ

TCL C69B 4K QLED Google TV: టీ-స్క్రీన్ ప్రో టెక్నాలజీతో భారత్‌లో లాంచైన టీసీఎల్ కొత్త టీవీ

Highlights
  • 32జిబి స్టోరేజీతో వచ్చిన TCL C69B టీవీ
  • 10,000+ యాప్స్‌కి సపోర్ట్ చేయనున్న TCL C69B
  • TCL C69B టీవీ ప్రారంభ ధర రూ.32,990

అందుబాటు ధరలో మంచి ఫీచర్లు ఉన్న టీవీ కొనాలని చూస్తున్న వారికి TCL కంపెనీ శుభవార్త తీసుకొచ్చింది. తాజాగా ఈ కంపెనీ భారతీయ మార్కెట్ లో TCL C69B 4కే టీవీని లాంచ్ చేసింది. ఈ టీవీలో క్యూఎల్ఈడీ డిస్ప్లే, గూగుల్ టీవీ సాఫ్ట్‌వేర్, టీ-స్క్రీన్ ప్రో టెక్నాలజీ, 32జిబి స్టోరేజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి TCL C69B టీవీ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు తెలుసుకుందాం.

TCL C69B 4కే క్యూఎల్ఈడీ టీవీ ధర, లభ్యత

TCL C69B 4కే క్యూఎల్ఈడీ టీవీని టీసీఎల్ అధికార వెబ్‌సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ రెండు సైజుల్లో లభిస్తుంది. వీటి ధరలు తెలుసుకుందాం.

TCL C69B 4కే క్యూఎల్ఈడీ టీవీ 43-ఇంచ్ మోడల్ ధరను రూ.32,990 గా నిర్ణయించారు. మరోవైపు, 55-ఇంచ్ మోడల్ ధరను రూ.45,990 గా పెట్టారు. ఈ టీవీలు 2 ఏళ్ళ వ్యారంటీ కవరేజీతో వచ్చాయి.

TCL C69B 4కే క్యూఎల్ఈడీ గూగుల్ టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

డిస్ప్లే: TCL C69B 43-ఇంచ్ టీవీ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. 55-ఇంచ్ టీవీ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. ఈ టీసీఎల్ సీ69బి మోడల్ క్యూఎల్ఈడీ ప్రో అనే ఫీచర్ గల 4కే క్యూఎల్ఈడీ టీవీ. వివిడ్ మరియు లైఫ్‌లైక్ విజువల్స్ అందించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

మరింత మెరుగైన దృశ్యానుభూతికై ఈ టీవీలో టీ-స్క్రీన్ ప్రో ఫీచర్ అందించారు. ఇంకా ఈ టీవీలో 93% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్, 600 నిట్స్ బ్రైట్నెస్, ఐకేర్ ప్రొటెక్షన్, ఎంఈఎంసీ మోషన్ స్మూథింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సౌండ్: TCL C69B 43-ఇంచ్ టీవీ 30 వాట్ స్పీకర్ తో రాగా, 55-ఇంచ్ టీవీ 35 వాట్ స్పీకర్ తో వచ్చింది. రెండు మోడల్స్ లో డాల్బీ అట్మాస్, డీటీఎస్ వర్చువల్ ఎక్స్; ONKYO 2.1 చానల్ సబ్‌వూఫర్ ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్: TCL C69B టీవీలో గూగుల్ టీవీ ఓఎస్ ఉంది. ఇది 10,000 పైగా గూగుల్ ప్లే స్టోర్ యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. వాచ్ లిస్ట్, గూగుల్ మీట్, గూగుల్ కిడ్స్, హ్యాండ్స్-ఫ్రీ గూగుల్ అసిస్టంట్ సపోర్ట్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

బిల్ట్-ఇన్ టీసీఎల్ హోమ్ ద్వారా ఇతర టీసీఎల్ స్మార్ట్ డివైజెస్‌ను కంట్రోల్ చేయవచ్చు.

120 హెర్ట్జ్ గేమ్ యాక్సెలరేటర్, గేమ్ మాస్టర్ మరియు మిరాకాస్ట్ సపోర్ట్ ఈ టీవీలో ఉన్నాయి.

ప్రాసెసర్: TCL C69B టీవీలో ఏఐపీక్యూ ప్రాసెసర్ వాడారు. ఈ చిప్ ఏఐ ఆల్గారిథమ్స్ కలిగి ఉండటం వల్లన విజువల్స్ ను మరింత మెరుగుపరుస్తుంది.

మెమొరీ: TCL C69B టీవీ 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీతో వచ్చింది. ఇది సెగ్మెంట్ బెస్ట్ అని చెప్పవచ్చు.

కనెక్టివిటీ: TCL C69B టీవీలో వై-ఫై, బ్లూటూత్ 5.0, 3 హెచ్డీఎంఐ పోర్ట్స్ (ఆటో లేటెన్సీ మోడ్), యూఎస్బీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

డిజైన్: TCL C69B 4కే క్యూఎల్ఈడీ టీవీ స్లిమ్ మరియు యూనీబాడీ డిజైన్ కలిగి, సన్నని బెజెల్స్, ఇన్వర్టెడ్ వి స్టాండ్స్‌తో వచ్చింది.

తక్కువ బడ్జెట్‌లో అన్ని ఫీచర్లు గల 4కే క్యూఎల్‌ఈడీ టీవీ కొనాలని భావిస్తున్న వారికి TCL C69B మంచి ఎంపిక అయ్యే అవకాశం ఉంది.