హైలైట్స్:
- త్వరలో భారత మార్కెట్ లో లాంచ్ కానున్న Tecno Camon 19 Pro Mondrian Edition
- అమెజాన్ లో ఉన్న మైక్రోసైట్ ద్వారా రివీల్ అయిన డిజైన్, స్పెసిఫికేషన్స్
- బ్యాక్ ప్యానెల్ పై వైట్ బ్లాక్స్ కలిగి, రంగులను మార్చే టెక్నో కేమాన్ 19 ప్రో మాండ్రియన్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్
గత నెలలో టెక్నో కంపెనీ కేమాన్ 19 ప్రో 5G ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క మాండ్రియన్ ఎడిషన్ వచ్చేస్తోంది. కలర్-చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ ని కలిగి ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత. ప్రస్తుతం అమెజాన్ లో ఉన్న కేమాన్ 19 ప్రో మాండ్రియన్ ఎడిషన్ యొక్క మైక్రోసైట్ ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేస్తోంది. టెక్నో కేమాన్ 19 ప్రో 5G మాదిరి స్పెసిఫికేషన్స్ ని ఈ ఫోన్ కలిగి ఉండనుంది. కాకపోతే, ఇందులో కొన్ని కాస్మెటిక్ చేంజెస్ ఉంటాయి. ఇది భారత దేశం యొక్క మొట్టమొదటి మల్టీ-కలర్ చేంజింగ్ స్మార్ట్ ఫోన్ గా చెప్పబడుతుంది.
ఈ మోడల్ టెక్నో ఫోన్ లో బ్యాక్ ప్యానెల్ పై వైట్ బ్లాక్స్ ఉంటాయి. ఈ బ్లాక్స్ పై సూర్యకాంతి పడినప్పుడు వివిధ రంగుల్లోకి మారుతాయి. ప్రతి బ్లాక్ కూడా వైట్ నుంచి పింక్ రంగులోకి లేదా నీలం రంగులోకి మారుతాయి. ఈ బ్లాక్స్ ఒకేసారి విభిన్న రంగుల్లోకి మారడం విశేషం. మరి ఈ స్మార్ట్ ఫోన్ నుంచి ఇంకా ఏమి ఆశించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం పదండి.
Tecno Camon 19 Pro Mondrian Edition
అమెజాన్ లిస్టింగ్ ని బట్టి Tecno Camon 19 Pro Mondrian Edition 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ గరిష్టంగా 13జిబి వరకు ర్యామ్ ని కలిగి ఉంది. ఇంకా 128జిబి స్టోరేజీ తో ఈ ఫోన్ వస్తోంది. ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కొరకు ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని అందించారు.
Tecno Camon 19 Pro Mondrian Edition లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఓఐఎస్ తో కూడిన 64ఎంపి మెయిన్ సెన్సర్, 50ఎంపి పోట్రెయిట్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీ కెమెరా, ప్రాసెసర్ వివరాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి. 32ఎంపి ఫ్రంట్ కెమెరా, డైమెన్సిటీ 810 చిప్సెట్ ఈ ఫోన్లో ఉండే అవకాశముంది. త్వరలోనే వీటిపై స్పష్టత రానుంది.
ఇక అమెజాన్ లిస్టింగ్ ద్వారా ఫోన్ లాంచ్ తేదీ ఎప్పుడో తెలియలేదు. రాబోవు అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ కంటే ముందే ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే Tecno Camon 19 Pro Mondrian Edition ఈ సేల్ లో భాగమయ్యే చాన్స్ ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.