భారత్ లో Tecno Camon 20 సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో మొత్తం మూడు ఫోన్లు వచ్చాయి. అవి: Tecno Camon 20, Tecno Camon 20 Pro 5G, Tecno Camon 20 Premier. Tecno Camon 20 సిరీస్ స్పెసిఫికేషన్స్, ధర, సేల్ తదితర వివరాలను ఇక్కడ అందజేస్తున్నాం. ముందుగా Tecno Camon 20, Tecno Camon 20 Pro 5G ధర వివరాలు చూద్దాం.
Tecno Camon 20 ఇండియా ధర, సేల్ వివరాలు
Tecno Camon 20 స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర భారత్ లో రూ.14,999 గా ఉంది. మే 29 నుంచి ఈ ఫోన్ సేల్స్ మొదలుకానున్నాయి.
Tecno Camon 20 Pro 5G ఇండియా ధర
Tecno Camon 20 Pro 5G స్మార్ట్ ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఇందులో బేస్ మోడల్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. దీని ధరను రూ.19,999 గా నిర్ణయించారు. 8జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. జూన్ రెండో వారంలో Tecno Camon 20 Pro 5G సేల్ మొదలవుతుంది.
Tecno Camon 20, Camon 20 Pro 5G స్పెసిఫికేషన్స్
- 6.67-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- 8జిబి వర్చువల్ ర్యామ్
- 32ఎంపి సెల్ఫీ కెమెరా
- 64ఎంపి రియర్ కెమెరా
- 33 వాట్ చార్జింగ్
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- హీలియో జీ85 చిప్
- డైమెన్సిటీ 8050 చిప్
డిస్ప్లే
- 6.67-ఇంచ్ స్క్రీన్
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
Tecno Camon 20 Pro 5G, Tecno Camon 20 డివైజెస్ లో 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
ప్రాసెసర్
- హీలియో జీ85 చిప్
- డైమెన్సిటీ 8050 చిప్
Tecno Camon 20 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ ఇచ్చారు. Tecno Camon 20 Pro 5G లో డైమెన్సిటీ 8050 చిప్సెట్ అందించారు.
కెమెరా
- 32ఎంపి సెల్ఫీ కెమెరా
- 64ఎంపి రియర్ కెమెరా
Tecno Camon 20 Pro 5G, Tecno Camon 20 డివైజెస్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. రెండు ఫోన్లలో 64ఎంపి ప్రైమరీ కెమెరా అందించారు.
బ్యాటరీ
- 5000 ఎంఏహెచ్
- 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్
Tecno Camon 20 Pro 5G, Tecno Camon 20 ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
