Home News Tecno Camon 30 సిరీస్ ఇండియా లాంచ్ ఖరారు

Tecno Camon 30 సిరీస్ ఇండియా లాంచ్ ఖరారు

Highlights
  • త్వరలో Tecno Camon 30 లాంచ్
  • విడుదలైన టీజర్ వీడియో
  • ప్రత్యేక ఆకర్షణగా సోని కెమెరా లెన్స్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno త్వరలో Camon 30 సిరీస్‌ని భారత్ లో లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ సిరీస్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. తాజాగా ఇండియా లాంచ్‌ని ఖరారు చేస్తూ ఓ టీజర్ వీడియోని టెక్నో సంస్థ సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీంతో ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. ఓసారి టీజర్ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Tecno Camon 30 సిరీస్ ఇండియా లాంచ్ ఖరారు

Tecno Camon 30 సిరీస్ ఇండియా లాంచ్‌ని టెక్నో సంస్థ ఖరారు చేసింది. ఈ ఫోన్ సోని కెమెరా సెన్సర్స్ తో వస్తోంది.

Tecno Camon 30 సిరీస్ లో ఎన్ని ఫోన్లు లాంచ్ అవుతాయో కంపెనీ తెలపలేదు. అయితే గ్లోబల్ గా Tecno Camon 30, Tecno Camon 30 5G, Tecno Camon 30 Pro 5G, Tecno Camon 30 Premier 5G గ్లోబల్‌గా లాంచ్ అయ్యాయి.

భారత్ లో తొలుత Tecno Camon 30, Tecno Camon 30 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. వీటి ధర రూ.20 వేల నుంచి రూ.30 వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది.

Tecno Camon 30 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే: Tecno Camon 30 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 2436*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Tecno Camon 30 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: Tecno Camon 30 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్ మరియు 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Tecno Camon 30 5G లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఐ-ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Tecno Camon 30 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Tecno Camon 30 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Tecno Camon 30 5G లో యూఎస్బీ టైప్-సీ ఆడియో, స్టీరియో డ్యూయల్ స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3 ఫీచర్లు ఉన్నాయి.