Home News Tecno: గ్లోబల్‌గా లాంచైన Phantom V Flip 2, Phantom V Fold 2 5G

Tecno: గ్లోబల్‌గా లాంచైన Phantom V Flip 2, Phantom V Fold 2 5G

Highlights
  • గ్లోబల్‌గా లాంచైన టెక్నో మడత ఫోన్లు
  • లైనప్‌లో వచ్చిన ఫాంటమ్ వి ఫ్లిప్2, ఫోల్డ్ 2
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno గ్లోబల్‌గా తన ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేసింది. Phantom V Flip 2, Phantom V Fold 2 పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. వీటిలో ఒకటి బుక్-స్టైల్ ఫోల్డ్ కాగా, మరొకటి ఫ్లిప్ మోడల్. ఈ రెండు ఫోన్లు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇవి ఏఐ ఫీచర్లతో రావడం విశేషం. సరే, ఓసారి ఫాంటమ్ వి ఫ్లిప్ 2, ఫాంటమ్ వి ఫోల్డ్ 2 ఫోన్ల యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Phantom V Fold 2, Phantom V Flip 2 ధర, లభ్యత

Tecno Phantom V Fold 2 యొక్క ధరను 1,099 డాలర్లు (సుమారు రూ.93,000) గా పెట్టారు.

Tecno Phantom V Flip 2 డివైజ్ ధరను 699 డాలర్లు (సుమారు రూ.58,000) గా పెట్టారు.

ఈ రెండు ఫోన్లు ప్రస్తుతం ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 23 నుంచి ఆఫ్రికాలో సేల్ మొదలవుతుంది.

Tecno Phantom Fold 2 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Tecno Phantom Fold 2 లో 7.85-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.45-ఇంచ్ కవర్ డిస్ప్లే, ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్ ఉన్నాయి.

చిప్సెట్: Tecno Phantom Fold 2 లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.2 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Tecno Phantom Fold 2 డివైజ్ 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది.

కెమెరా: Tecno Phantom Fold 2 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి పొట్రెయిట్ లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Tecno Phantom Fold 2 లో పవర్ బ్యాకప్ కోసం 5,750 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 70 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

ఇతర ఫీచర్లు: Tecno Phantom Fold 2 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఏఐ ఫీచర్లను అందించారు.

Tecno Phantom V Flip 2 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Tecno Phantom V Flip 2 లో 6.9-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్, 3.64-ఇంచ్ కవర్ డిస్ప్లే ఉన్నాయి.

చిప్సెట్: Tecno Phantom V Flip 2 లో మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.6 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Tecno Phantom V Flip 2 డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది.

కెమెరా: Tecno Phantom V Flip 2 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Tecno Phantom V Flip 2 లో పవర్ బ్యాకప్ కోసం 4,720 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కలర్స్: Tecno Phantom V Flip 2 డివైజ్ మూన్‌డస్ట్ గ్రే మరియు ట్రావెర్టైన్ గ్రీన్ కలర్స్ లో లభిస్తుంది.