
మొబైల్ ఫోన్ మేకర్ Tecno ఇటీవలె తన తొలి ఫ్లిప్ ఫోన్ ని లాంచ్ చేసింది. Tecno Phantom V Flip పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. నేటి నుంచి భారతీయ మార్కెట్ లో Amazon ద్వారా Tecno Phantom V Flip ప్రీ-ఆర్డర్స్ మొదలవుతున్నాయి. క్లామ్‌షెల్ ఫోన్ కేటగిరీలో Tecno Phantom V Flip డివైజ్ అత్యంత చవకైనదిగా నిలుస్తోంది.
Tecno Phantom V Flip లో సర్క్యులర్ కవర్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్, మాలి జీ77 జీపీయూ, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 64ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి. సరే, ఓసారి Tecno Phantom V Flip ధర, లాంచ్ ఆఫర్స్, పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
భారత్ లో Tecno Phantom V Flip ధర, లాంచ్ ఆఫర్స్, లభ్యత
ఎర్లీ బర్డ్ సేల్ లో భాగంగా Tecno Phantom V Flip ధరను భారత్ లో రూ.49,999 గా నిర్ణయించారు. నేడు, అనగా అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ద్వారా Tecno Phantom V Flip ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫ్లిప్ ఫోన్ మిస్టిక్ డాన్, ఐకానిక్ బ్లాక్ కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది.
Tecno Phantom V Flip స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
- స్క్రీన్: Tecno Phantom V Flip లో 6.9-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ (1080*2640) రెజుల్యూషన్, 413పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 22:9 యాస్పెక్ట్ రేషియో, Schott UTG గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
- కవర్ డిస్ప్లే: Tecno Phantom V Flip లో 1.32-ఇంచ్ అమోలెడ్ కవర్ డిస్ప్లే, 466*466 పిక్సెల్స్ రెజుల్యూషన్, 352పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Tecno Phantom V Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్, మాలి జీ77 జీపీయూ ఉన్నాయి.
- మెమొరీ: Tecno Phantom V Flip లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి వరకు మెమొరీ ఫ్యూజన్ (ర్యామ్), 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
- సాఫ్ట్‌వేర్: Tecno Phantom V Flip డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13.5 ఫ్లిప్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Tecno Phantom V Flip లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ, చార్జింగ్: Tecno Phantom V Flip లో పవర్ బ్యాకప్ కోసం 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ మరియు ఇతర ఫీచర్లు: Tecno Phantom V Flip లో స్టీరియో స్పీకర్, డీటీఎస్ ఆడియో, టైప్-సీ పోర్ట్, హై-రెజ్ ఆడియో, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.1, వై-ఫై, జీపీఎస్ ఉన్నాయి.
- చుట్టుకొలత, బరువు: Tecno Phantom V Flip డివైజ్ 171.72 మి.మీ పొడవు, 74.05 మి.మీ వెడల్పు, 6.95మి.మీ మందం, 194 గ్రాముల బరువు ఉంటుంది.











