Home News నేడే అమెజాన్‌లో Tecno Phantom V Flip ఎర్లీ బర్డ్ సేల్; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

నేడే అమెజాన్‌లో Tecno Phantom V Flip ఎర్లీ బర్డ్ సేల్; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

Highlights
  • ఇటీవలె భారత్ లో లాంచైన Tecno Phantom V Flip
  • అమెజాన్ ద్వారా Tecno Phantom V Flip సేల్
  • 1.32-ఇంచ్ సర్క్యులర్ కవర్ డిస్ప్లేతో వచ్చిన ఫోన్

మొబైల్ ఫోన్ మేకర్ Tecno ఇటీవలె తన తొలి ఫ్లిప్ ఫోన్ ని లాంచ్ చేసింది. Tecno Phantom V Flip పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. నేటి నుంచి భారతీయ మార్కెట్ లో Amazon ద్వారా Tecno Phantom V Flip ప్రీ-ఆర్డర్స్ మొదలవుతున్నాయి. క్లామ్‌షెల్ ఫోన్ కేటగిరీలో Tecno Phantom V Flip డివైజ్ అత్యంత చవకైనదిగా నిలుస్తోంది.

Tecno Phantom V Flip లో సర్క్యులర్ కవర్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్, మాలి జీ77 జీపీయూ, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 64ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి. సరే, ఓసారి Tecno Phantom V Flip ధర, లాంచ్ ఆఫర్స్, పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

భారత్ లో Tecno Phantom V Flip ధర, లాంచ్ ఆఫర్స్, లభ్యత

ఎర్లీ బర్డ్ సేల్ లో భాగంగా Tecno Phantom V Flip ధరను భారత్ లో రూ.49,999 గా నిర్ణయించారు. నేడు, అనగా అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ద్వారా Tecno Phantom V Flip ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫ్లిప్ ఫోన్ మిస్టిక్ డాన్, ఐకానిక్ బ్లాక్ కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది.

Tecno Phantom V Flip స్పెసిఫికేషన్స్, ఫీచర్స్