Tecno బ్రాండ్ నేడు భారతీయ మార్కెట్ లో Tecno Phantom V Flip ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ బ్రాండ్ నుంచి అంతకు ముందు Tecno Phantom V Fold అనే ఫోన్ వచ్చింది. తాజాగా ఫ్లిప్ ఫోన్ ని కూడా తీసుకొచ్చింది. Tecno Phantom V Flip డివైజ్ లో 1.32-ఇంచ్ సర్క్యులర్ కవర్ డిస్ప్లే, ఏఐ ఆధారిత ఎల్లా జీపీటీ 3.0 అనే వాయిస్ అసిస్టంట్ ఉన్నాయి. సరే, ఓసారి Tecno Phantom V Flip యొక్క భారతీయ మార్కెట్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Tecno Phantom V Flip ధర
భారత్ లో Tecno Phantom V Flip ధరను రూ.49,999 గా నిర్ణయించారు. త్వరలో ఆఫర్, సేల్ వివరాలు తెలియనున్నాయి.
Tecno Phantom V Flip స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Tecno Phantom V Flip లో 6.9-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లే, సన్నని బెజెల్స్, 1.32-ఇంచ్ సర్క్యులర్ అమోలెడ్ కవర్ డిస్ప్లే ఉన్నాయి.
- ప్రాసెసర్: Tecno Phantom V Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ77 జీపీయూ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Tecno Phantom V Flip లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉన్నాయి.
- కెమెరా: Tecno Phantom V Flip లో 64ఎంపి ఆర్జీబీడబ్ల్యూ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- ఓఎస్: Tecno Phantom V Flip డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Tecno Phantom V Flip డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Tecno Phantom V Flip డివైజ్ లో స్టీరియో స్పీకర్స్, హై-రెజ్ ఆడియో, అల్ట్రా-థిన్ వీసీ లిక్విడ్ కూలింగ్, ఎన్ఎఫ్సీ, కవర్ స్క్రీన్ క్విక్ రిప్లై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
Tecno Phantom V Flip డిజైన్
Tecno Phantom V Flip డివైజ్ 3డీ కర్వ్డ్ బాడీ, ఫ్లెక్సిబుల్ హవర్‌లాక్ డిజైన్ కలిగి ఉంది. దీంతో 30-150 డిగ్రీ ఫ్లెక్సిబుల్ యాంగిల్స్ లో అడ్జస్ట్‌మెంట్ సాధ్యమవుతుంది. బ్యాక్ ప్యానెల్ ప్రీమియమ్ లెదర్, లిచీ ప్యాటర్న్ డిజైన్ తో వచ్చింది. Tecno Phantom V Flip డివైజ్ హై-స్ట్రెంగ్త్ అల్ట్రా-థిన్ గ్లాస్ తో వచ్చింది. భారతదేశంలో తక్కువ ధర కలిగిన ఫ్లిప్ ఫోన్ గా టెక్నో ఫాంటమ్ వీ ఫ్లిప్ నిలవనుంది.
