
భారత్ లో రోజురోజుకీ ఫోల్డబుల్ ఫోన్ల లాంచింగ్స్ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు శాంసంగ్, ఒప్పో, టెక్నో సంస్థలు మడతబెట్టే ఫోన్లు లాంచ్ చేసాయి. ఇదివరకే ఒక ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేసిన టెక్నో, తాజాగా మరొక ఫోల్డబుల్ ఫోన్ ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. Tecno Phantom V Flip 5G పేరుతో రానున్న ఈ డివైజ్ బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ కి సంబంధించిన ఎన్నో స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి.
SIG లిస్టింగ్ పై కనిపించిన Tecno Phantom V Flip 5G
బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై Tecno Phantom V Flip 5G డివైజ్ AD11 అనే మోడల్ నంబర్ తో కనిపించింది. బ్లూటూత్ ఎస్ఐజీ ఒక అమెరికన్ కంపెనీ, ఇది బ్లూటూత్ టెక్నాలజీ లైసెన్సింగ్ మరియు ట్రేడ్‌మార్క్ డేటాను సరి చూస్తుంది. ఇక ఈ సర్టిఫికేషన్ ద్వారా Tecno Phantom V Flip 5G డివైజ్ స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
Tecno Phantom V Flip 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: లీకైన స్పెసిఫికేషన్స్ ని బట్టటి, Tecno Phantom V Flip 5G ఫోన్ లో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుందని తెలుస్తోంది.
- ప్రాసెసర్: Tecno Phantom V Flip 5G ఫోల్డబుల్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ వాడినట్లు సమాచారం.
- స్టోరేజీ, ర్యామ్: Tecno Phantom V Flip 5G డివైజ్ లో 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉంటాయి. దీంతో యూజర్ కి 16జిబి ర్యామ్ సపోర్ట్ లభించనుంది. ఇకపోతే ఈ ఫోన్ 256జిబి వరకు స్టోరేజీని కలిగి ఉంటుంది.
- బ్యాటరీ, ఓఎస్: Tecno Phantom V Flip 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Tecno Phantom V Flip 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Tecno Phantom V Flip 5G లో 64ఎంపి రియర్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- కనెక్టివిటీ: Tecno Phantom V Flip 5G లో బ్లూటూత్, వై-ఫై, డ్యూయల్ 5జీ సిమ్, జీపీఎస్ వంటి ఫీచర్లు ఉంటాయి.











