Home News రూ.29,899 కే ఫ్లిప్ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి

రూ.29,899 కే ఫ్లిప్ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి

Highlights
  • చవకగా లభిస్తోన్న Tecno Phantom V Flip 5G
  • ఫోన్ యొక్క ఆఫర్ ధర రూ.29,899
  • అమెజాన్ పై అందుబాటులో ఆఫర్

ఫ్లిప్ ఫోన్ వాడాలని ఎంతోమంది మొబైల్ లవర్స్ కి ఆసక్తి ఉంటుంది. కానీ, ధరలు ఎక్కువగా ఉండటంతో అది సాధ్యం కాదు. అయితే, అప్పుడప్పుడు వచ్చే ఆఫర్లను గమనిస్తే, ఫ్లిప్ ఫోన్ ని తక్కువ ధరకి సొంతం చేసుకోవడం కష్టమేం కాదు. ఇప్పుడు ఆ అవకాశం ఒకటి వచ్చింది. Tecno Phantom V Flip 5G ఫ్లిప్‌ ఫోన్ కేవలం రూ.29,899 కే లభిస్తోంది. అంతేకాదు, అదనంగా బ్యాంక్ డిస్కౌంట్స్ మరియు ఎక్స్‌చేంజ్ బెనిఫిట్ కూడా ఉన్నాయి. ఈ గ్రేట్ డీల్ ఎలా పొందాలో తెలుసుకుందామా?

Tecno Phantom V Flip 5G ధర, ఆఫర్లు

Tecno Phantom V Flip 5G ఈ-కామర్స్ సైట్ అమెజాన్ లో రూ.25,000 కూపన్ డిస్కౌంట్ పై లభిస్తోంది. డివైజ్ యొక్క అసలు ధర రూ.54,899 గా లిస్ట్ అయ్యింది. ఈ డిస్కౌంట్ కూపన్ ను అప్లై చేస్తే, కేవలం రూ.28,999 కే ఫాంటమ్ వి ఫ్లిప్ 5జీ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు.

బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే, ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్ ఈఎంఐ మరియు సాధారణ లావాదేవీలపై రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ధర మరింతగా తగ్గుతుంది.

పాత ఫోన్ మార్చుకుని, Tecno Phantom V Flip 5G ని కొనుగోలు చేస్తే గనుక, రూ.18,050 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఈ విలువ అనేది మీ పాత ఫోన్ కండీషన్ పై ఆధారపడి ఉంటుంది.

ఈ ఆఫర్లే కాకుండా, 3 నుంచి 6 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కూడా ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఎక్కడ కొనాలి?

Tecno Phantom V Flip 5G స్మార్ట్‌ఫోన్‌ని ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు. క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోండి.

అమెజాన్ లింక్

Tecno Phantom V Flip 5G ని కొనవచ్చా?

ముందు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంత తక్కువ ధరలో మరే ఇతర ఫ్లిప్ ఫోన్ కూడా లభించడం లేదు. కాబట్టి, కచ్చితంగా ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ తక్కువ బడ్జెట్ లో కొనాలనుకుంటే ఇదే ఏకైక ఆప్షన్. ఈ ఫ్లిప్ ఫోన్ లో 6.9-ఇంచ్ ప్రైమరీ స్క్రీన్, 1.32-ఇంచ్ సెకండరీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్, 256జిబి వరకు స్టోరేజీ, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Tecno Phantom V Flip 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Tecno Phantom V Flip లో 6.9-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లే, సన్నని బెజెల్స్, 1.32-ఇంచ్ సర్క్యులర్ అమోలెడ్ కవర్ డిస్ప్లే ఉన్నాయి.

ప్రాసెసర్: Tecno Phantom V Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ77 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Tecno Phantom V Flip లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉన్నాయి.

కెమెరా: Tecno Phantom V Flip లో 64ఎంపి ఆర్జీబీడబ్ల్యూ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

ఓఎస్: Tecno Phantom V Flip డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

బ్యాటరీ: Tecno Phantom V Flip డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Tecno Phantom V Flip డివైజ్ లో స్టీరియో స్పీకర్స్, హై-రెజ్ ఆడియో, అల్ట్రా-థిన్ వీసీ లిక్విడ్ కూలింగ్, ఎన్ఎఫ్‌సీ, కవర్ స్క్రీన్ క్విక్ రిప్లై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.