హైలైట్స్
- ప్రపంచపు చవకైన Dimensity 9000 ఫోన్ గా నిలవనున్న Tecno Phantom X2 5G
- భారత్ లో Tecno Phantom X2 5G ధర రూ.26,999 గా ఉంటుందని సమాచారం
- 2023 జనవరిలో భారత్ లో లాంచ్ కానున్న Tecno Phantom X2 5G
వాల్యూ ఫర్ మనీ ఫోన్లను అందించే టెక్నో సంస్థ ఇటీవలె గ్లోబల్ గా Tecno Phantom X2 సిరీస్ ని లాంచ్ చేసింది. దీంతో ఈ సంస్థ యొక్క సత్తా ఏంటో అందరికీ తెలిసినట్లైంది. ఈ సిరీస్ లో Phantom X2 మరియు Phantom X2 Pro అనే రెండు మోడల్స్ ఉంటాయి. అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. అయితే భారత్ లో Tecno Phantom X2 5G డివైజ్ 2023 జనవరిలో లాంచ్ కానుంది. తాజాగా బయటకు వచ్చిన ఓ లీక్ ద్వారా Tecno Phantom X2 5G యొక్ ధర ఎంతో తెలిసింది.
భారత్ లో Tecno Phantom X2 5G ధర
ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గిగ్లాని తాజాగా Tecno Phantom X2 5G యొక్క ఇండియా ధరను వెల్లడించాడు. లీక్ ప్రకారం, Tecno Phantom X2 5G ధర భారతీయ మార్కెట్ లో రూ.26,999 గా ఉంటుందని సమాచారం. ఇది 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర. గ్లోబల్ వేరియంట్ ధరను బట్టి చూస్తే, ఇది కూడా లాంచ్ ప్రైస్ అని అనుకోవచ్చు. అంటే అన్ని ఆఫర్లతో కలుపుకుని ఈ ధరలో ఫోన్ లభించే అవకాశం ఉందన్నమాట. దీనర్థమేంటంటే, అసలు సేల్ ధర వేరే ఉంటుంది.
Tecno Phantom X2 5G స్పెసిఫికేషన్స్
Tecno Phantom X2 లో 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ అందించారు. 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ ఈ ఫోన్ లో ఉంది. ర్యామ్ ని మెమొరీ ఫ్యూజన్ ద్వారా 5జిబి వరకు పెంచుకోవచ్చు. అంటే మొత్తం 13జిబి ర్యామ్ అందుబాటులో ఉంటుంది.
Tecno Phantom X2 డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ వాడారు. ఇది 3.05 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎం మాలి-జీ710 ఎంసీ10 జీపీయూ వాడారు.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 12.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ లో 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 20 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. Tecno Phantom X2 11 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది.
Tecno Phantom X2 లో 6.78-ఇంచ్ కర్వ్డ్ డిస్ప్లే కలిగి ఉంది. ఇందులో ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లే ని అమర్చారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పీ3 వైడ్ కలర్ గేముత్, 8+2 బిట్ డిస్ప్లే, 93.5% స్క్రీన్ టు బాడీ రేషియో, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, యూనిబాడీ డబుల్-కర్వడ్ డిజైన్, 3.5డి మూన్ క్రేటర్ ఇన్‌స్పైర్డ్ డిజైన్, సీఎన్‌సీ మెటల్ మిడిల్ ఫ్రేమ్, మిలిటరీ గ్రేడ్ యాంటీ-గ్లేర్ గ్లాస్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
Tecno Phantom X2 లో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. మెయిన్ లెన్స్ F/1.65 అపర్చర్ కలిగి ఉంటుంది. క్వాడ్ ఫ్లాష్ లైట్ ని బ్యాక్ ప్యానెల్ పై అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఓటీజీ, జీపీఎస్ ఈ ఫోన్ లో ఉన్నాయి. మూన్ లైట్ సిల్వర్, స్టార్ డస్ట్ గ్రే కలర్ ఆప్షన్స్ లో Tecno Phantom X2 స్మార్ట్ ఫోన్ లభిస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.