హైలైట్స్
- భారత్ లో లాంచైన Tecno Phantom X2 స్మార్ట్ ఫోన్
- మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, 64ఎంపి ప్రైమరీ కెమెరా, అమోలెడ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో వచ్చిన హ్యాండ్సెట్
- భారత్ లో Tecno Phantom X2 ధర రూ.39,999

భారత్ లో Tecno Phantom X2 స్మార్ట్ ఫోన్ లాంచైంది. 2022 డిసెంబర్ లో గ్లోబల్ గా ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది టెక్నో బ్రాండ్ నుంచి వచ్చిన ప్రీమియమ్ ఫోన్. ఈ హ్యాండ్సెట్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
Tecno Phantom X2 ఫోన్ వినూత్నమైన రియర్ ప్యానెల్ డిజైన్ ని కలిగి ఉంది. కాస్త మధ్యలో ఉన్న స్క్వేర్ మాడ్యూల్ లో మూడు కెమెరా సెన్సర్ లు ఉన్నాయి. 64ఎంపి ఓఐఎస్ కెమెరా, 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్, డైమెన్సిటీ 9000 చిప్సెట్, స్టీరియో స్పీకర్స్, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్.
భారత్ లో Tecno Phantom X2 ధర, సేల్
Tecno Phantom X2 ధరను భారత్ లో రూ.39,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ మూన్ లైట్ సిల్వర్, స్టార్ డస్ట్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ మరియు రిటైల్ స్టోర్స్ ద్వారా ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉంది. జనవరి 9 నుంచి ఈ ఫోన్ యొక్క సేల్ ప్రారంభమవుతుంది.
Tecno Phantom X2 పై కంపెనీ 6-నెలల నో-కాస్ట్ ఈఎంఐ మరియు 12-నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అందిస్తోంది. అలాగే అమెజాన్ లో మొదటి 100 ప్రీ-బుకింగ్ ఆర్డర్స్ పై మరియు రిటైల్ స్టోర్స్ ద్వారా మొదటి 200 ఆర్డర్స్ పై Phantom X3 ఫోన్ ఉచితమని కంపెనీ ప్రకటించింది. భారత్ లో ఆ ఫోన్ లాంచ్ అయ్యాక సంబంధిత వ్యక్తులకు అందజేయబడుతుంది.
Tecno Phantom X2 స్పెసిఫికేషన్స్
Tecno Phantom X2 లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఇది F/2.45 అపర్చర్, 80.6 వ్యూయింగ్ యాంగిల్, అడ్జస్టబుల్ ఫ్లాష్ లైట్, 1/2.8″ ఇమేజ్ సెన్సర్ ని కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా ఫీచర్స్ చూస్తే, ఏఐ పొట్రెయిట్, సూపర్ నైట్ మోడ్, కలర్ ఎన్హాన్స్మెంట్, ఫిల్టర్స్, కస్టమ్ మేకప్, వైడ్ సెల్ఫీ, హెచ్డీఆర్, బర్‌స్ట్ షాట్, పర్సనలైజ్డ్ వాటర్‌మార్క్, ఏఐ సీన్ డిటెక్షన్, వీడియో అల్ట్రా స్టడీ మోడ్, వీడియో ఫిల్టర్స్, వీడియో బొకే, వీడియో బ్యూటీ, టైమ్ ల్యాప్స్, ఏఆర్ షాట్, ఫిల్మ్ మోడ్, క్వాడ్ ఫ్లాష్ లైట్ ఉన్నాయి.
Tecno Phantom X2 లో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. మెయిన్ లెన్స్ F/1.65 అపర్చర్ కలిగి ఉంటుంది. క్వాడ్ ఫ్లాష్ లైట్ ని బ్యాక్ ప్యానెల్ పై అందించారు.
సూపర్ నైట్ మోడ్, సూపర్ నైట్ ఫిల్టర్స్, ట్రైపాడ్ మోడ్, డాక్యుమెంట్స్, హెచ్డీఆర్, స్కైషాప్, ఏఐ సీన్ డిటెక్షన్, ఫిల్టర్స్, వైడ్ యాంగిల్, 10X జూమ్, పర్సనలైజ్డ్ వాటర్ మార్క్స్, పనొరమా, గూగుల్ లెన్స్, బర్‌స్ట్ షాట్, 4కే వీడియో, వీడియో అల్ట్రా స్టడీ మోడ్, వీడియో ఫిల్టర్స్, డ్యూయల్ వీడియో, వీడియో బొకే, వీడియో బ్యూటీ, 4కే టైమ్-ల్యాప్స్, 960ఎఫ్‌పీఎస్ స్లో మోషన్, ఏఆర్ షాట్, నైట్ వీడియో, కస్టమ్ మేకప్, ఫిల్మ్ మోడల్ వంటి ఫీచర్లు రియర్ కెమెరాలో ఉన్నాయి.
Tecno Phantom X2 లో 6.78-ఇంచ్ కర్వ్డ్ డిస్ప్లే కలిగి ఉంది. ఇందులో ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లే ని అమర్చారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పీ3 వైడ్ కలర్ గేముత్, 8+2 బిట్ డిస్ప్లే, 93.5% స్క్రీన్ టు బాడీ రేషియో, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, యూనిబాడీ డబుల్-కర్వడ్ డిజైన్, 3.5డి మూన్ క్రేటర్ ఇన్‌స్పైర్డ్ డిజైన్, సీఎన్‌సీ మెటల్ మిడిల్ ఫ్రేమ్, మిలిటరీ గ్రేడ్ యాంటీ-గ్లేర్ గ్లాస్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
Tecno Phantom X2 లో 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ అందించారు. 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ ఈ ఫోన్ లో ఉంది. ర్యామ్ ని మెమొరీ ఫ్యూజన్ ద్వారా 5జిబి వరకు పెంచుకోవచ్చు. అంటే మొత్తం 13జిబి ర్యామ్ అందుబాటులో ఉంటుంది. ఈ డివైజ్ లో 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 20 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











