హైలైట్స్:
- నేడు భారత్ లో లాంచ్ అయిన Tecno POP 6 Pro స్మార్ట్ ఫోన్
- కేవలం రూ.6099 కే లభించనున్న Tecno POP 6 Pro, అమెజాన్ ద్వారా లభ్యం కానున్న హ్యాండ్సెట్
- 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ తో వస్తున్న Tecno POP 6 Pro స్మార్ట్ ఫోన్
కొన్ని రోజుల క్రితం 91మొబైల్స్ Tecno POP 6 Pro లాంచ్ కి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ వార్తను ప్రచురించింది. సరిగ్గా ఇప్పుడు అదే నిజమైంది.లో-బడ్జెట్ సెగ్మెంట్ లో ఫోన్లను లాంచ్ చేసే టెక్నో నుంచి తాజాగా Tecno POP 6 Pro భారత్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ లో రూ.6099 కి Tecno POP 6 Pro ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
Tecno POP 6 Pro ధర
Tecno POP 6 Pro కేవలం సింగిల్ వేరియంట్ లో భారత్ లో లాంచ్ అయ్యింది. 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ వేరియంట్ ధరను టెక్నో కంపెనీ రూ.6,099 గా నిర్ణయించింది. అమెజాన్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. పీస్ఫుల్ బ్లూ, పోలార్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఇక్కడొక బండిల్ ఆఫర్ ఉంది అందేంటో తెలుసుకుందాం. Tecno POP 6 Pro కొనుగోలుతో పాటు, కేవలం రూ.399 అదనంగా చెల్లిస్తే, మీరు Boat Bassheads ని సొంతం చేసుకోవచ్చు.
Tecno POP 6 Pro స్పెసిఫికేషన్స్
Tecno POP 6 Pro లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 120హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 270 పిక్సెల్స్ పర్ ఇంచ్, డాట్ నాచ్ స్టైల్ డిస్ప్లే, 2.5డి గ్లాస్, 480 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ 8.75 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. Tecno POP 6 Pro లో మీడియాటెక్ హీలియో ఏ22 చిప్సెట్ అమర్చారు. ఇది 2 గిగా హెర్ట్జ్ స్పీడ్ కలిగిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఈ ఫోన్ లో 2జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 32జిబి ఈఎంఎంసీ5.1 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టీబీ వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
Tecno POP 6 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి కెమెరా ఉంది.
Tecno POP 6 Pro డ్యూయల్ సిమ్ సపోర్ట్ కలిగి ఉంది. ఇందులో 4g, వై-ఫై, బ్లూటూత్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఓటీజీ, బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్లో ఫేస్ అన్-లాక్ ఫీచర్ అందించారు. Tecno POP 6 Pro లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఈ ఫోన్ 42 రోజుల స్టాండ్ బై టైమ్ ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. చాలా తక్కువ బడ్జెట్ లో 4జీ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారు ఈ ఫోన్ ని ప్రయత్నించవచ్చు. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ నచ్చితే.. సాధారణ వాడకానికి Tecno POP 6 Pro ఫోన్ బాగా పని చేస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, టెక్నాలజీ, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.