Home News ఫిబ్రవరి 16 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Tecno POP 7 Pro

ఫిబ్రవరి 16 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Tecno POP 7 Pro

Highlights
  • 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న Tecno POP 7 Pro
  • తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా లాంచ్ తేదీని ప్రకటించిన టెక్నో సంస్థ
  • 2023 ఫిబ్రవరి 16 న భారత్ లో లాంచ్ అవుతోన్న Tecno POP 7 Pro

గత నెలలో ఆఫ్రికా లో Tecno POP 7 Pro డివైజ్ ని లాంచ్ చేసిన టెక్నో సంస్థ ఇప్పుడు భారత్ లో కూడా ఈ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తన అధికార సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా Tecno POP 7 Pro యొక్క లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. Tecno POP 7 Pro డివైజ్ మీడియాటెక్ హీలియో ఏ22 చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13ఎంపి మెయిన్ కెమెరా తో ఫిబ్రవరి 16 న భారత్ లో లాంచ్ అవుతోంది.

భారత్ లో Tecno POP 7 Pro లాంచ్ తేదీ ఖరారు

పైన ట్వీట్ లో కనిపిస్తున్న విధంగా, టెక్నో సంస్థ Tecno POP 7 Pro ఫోన్ ని భారత్ లో ఫిబ్రవరి 16 న లాంచ్ చేయబోతోంది. ఆఫ్రికాలో లాంచైన వేరియంట్ భారత్ లో కూడా లాంచ్ అవుతుందా లేదా మార్పులతో వస్తుందా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితేనేం, ఈ విషయం తెలిసేందుకు మనం ఎన్నో రోజులు వేచి చూడక్కర్లేదు. రేపటితో ఏ విషయం బయటపడుతుంది. ఇకపోతే Tecno POP 7 Pro డివైజ్ భారత్ లో ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్ముడుకానుంది.

Tecno POP 7 Pro స్పెసిఫికేషన్స్

Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో వస్తోంది. నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఎంట్రీ లెవెల్ బడ్జెట్ ఫోన్ కాబట్టి ఈ ఫోన్ లో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మాత్రమే ఇచ్చారు. అలాగే ఈ డివైజ్ హెచ్డీ+ స్క్రీన్ తో వస్తోందన్న విషయాన్ని కొనుగోలుదారులు గమనించాలి. దాదాపుగా ఈ ధరల శ్రేణిలో వచ్చే ఫోన్లలో హెచ్డీ+ డిస్ప్లేనే ఇస్తున్నారు.

Tecno POP 7 Pro యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 13 ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. దీంతో పాటు ఒక క్యూవీజీఏ డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇస్తున్నారు.

Tecno POP 7 Pro స్మార్ట్ ఫోన్ లో ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో ఏ22 చిప్సెట్ వాడారు. ఈ ఫోన్ 3జిబి ర్యామ్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, Tecno POP 7 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఇప్పుడు బ్యాటరీ విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. Tecno POP 7 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.