Home News Tecno Pop 9 5G: 48MP Ai కెమెరాతో భారత్‌లో లాంచైన టెక్నో కొత్త ఫోన్

Tecno Pop 9 5G: 48MP Ai కెమెరాతో భారత్‌లో లాంచైన టెక్నో కొత్త ఫోన్

Highlights
  • భారత్‌లో Tecno Pop 9 5G విడుదల
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్
  • 48ఎంపి ఏఐ మెయన్ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno తాజాగా భారతీయ మార్కెట్ లో పాప్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Tecno Pop 9 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 48ఎంపి ఏఐ మెయిన్ కెమెరా, 8జిబి వరకు ర్యామ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Tecno Pop 9 5G ధర, సేల్ వివరాలు

Tecno Pop 9 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం.

4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.9,499 గా నిర్ణయించారు. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.9,999 గా పెట్టారు. ఈ ఫోన్ మిడ్నైట్ షాడో, అజూర్ స్కై మరియు అరోరా క్లౌడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అమెజాన్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం అమెజాన్ లో ప్రీ-బుకింగ్స్ చేసుకోవచ్చు.

Tecno Pop 9 5G డిజైన్

Tecno Pop 9 5G బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, రింగ్ ఎల్ఈడీ లైట్ ఉన్నాయి. ఫ్రంట్ ప్యానెల్ ఫ్లాట్ గా ఉంది. పంచ్ హోల్ కటౌట్ లో ఫ్రంట్ కెమెరా ఉంది. ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ అందించారు.

Tecno Pop 9 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Tecno Pop 9 5G లో 6.67-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

చిప్సెట్: Tecno Pop 9 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ అందించారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: Tecno Pop 9 5G స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ని ఆఫర్ చేస్తుంది. 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 8జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Tecno Pop 9 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి సోని ఐఎంఎక్స్582 ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Tecno Pop 9 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Tecno Pop 9 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

ఇతర ఫీచర్లు: Tecno Pop 9 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ54 రేటింగ్, డాల్బీ అట్మాస్, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. 4 ఏళ్ళు ల్యాగ్-ఫ్రీ పెర్ఫామెన్స్ ను కంపెనీ హామీ ఇస్తోంది.