హైలైట్స్
- త్వరలో లాంచ్ కానున్న Tecno Pova 4 స్మార్ట్ ఫోన్
- భారత్ లో డిసెంబర్ 7 న లాంచ్ అవుతుందని సమాచారం
- 8జిబి ర్యామ్ + 5జిబి వర్చువల్ ర్యామ్ తో లాంచ్ అవుతోన్న Tecno Pova 4
టెక్నో కంపెనీ గత నెలలో Tecno Pova 4 ని బంగ్లాదేశ్ మార్కెట్ లో లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్ భారత్ లో డిసెంబర్ 7 న లాంచ్ కానుందని 91 మొబైల్స్ కి సమాచారం అందింది. భారత్ లో Tecno Pova 4 ధర రూ.11,999 గా ఉంటుందని తెలుస్తోంది. మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీతో వస్తోన్న Tecno Pova 4 స్మార్ట్ ఫోన్ 13జిబి ర్యామ్ (8జిబి + 5జిబి) ని కలిగి ఉంటుంది.
Tecno Pova 4 అమెజాన్ ద్వారా సేల్ కి రానున్నాయి. రానున్న రోజుల్లో అమెజాన్ లో Tecno Pova 4 కి సంబంధించిన మైక్రోసైట్ కనిపించే అవకాశం ఉంది. గతేడాది లాంచైన Tecno Pova 3 కి సక్సెసర్ గా Tecno Pova 4 వస్తోంది.
91మొబైల్స్ కి వచ్చిన సమాచారాన్ని బట్టి, Tecno Pova 4 స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 7 సమీపంలో భారత మార్కెట్ లో లాంచ్ అవ్వనుంది. ఇక ఈ ఫోన్ ధర రూ.11,999 గా ఉంటుంది. Tecno Pova 4 యొక్క లాంచ్ తేదీ, ధర తో పాటు స్పెసిఫికేషన్స్ కూడా తెలిసాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.
Tecno Pova 4 స్పెసిఫికేషన్స్
Tecno Pova 4 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో లాంచ్ అవ్వనుంది. ఈ చిప్సెట్ 6 ఎన్ఎం ప్లాట్ఫామ్ పై తయారైంది. మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీ వల్లన ఈ డివైజ్ 13 జిబి ర్యామ్ తో పెర్ఫామ్ చేయగలదు. భారత్ లో ఈ స్మార్ట్ ఫోన్ 128జిబి స్టోరేజీ తో లాంచ్ అవుతోంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Tecno Pova 4 స్మార్ట్ ఫోన్ 6.82-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. భద్రత కోసం ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.
Tecno Pova 4 యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. Tecno Pova 4 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే దీనికి తోడు సెకండరీ లెన్స్ ఉంటాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. టెక్నో పోవా 4 డివైజ్ లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. త్వరలోనే ఇండియా లాంచ్ తేదీ అధికారికంగా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












