తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందిస్తూ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తోన్న టెక్నో సంస్థ త్వరలో భారతీయ మార్కెట్ లో Tecno Pova 5 సిరీస్ ని లాంచ్ చేయబోతోంది. ఈ సిరీస్ లో భాగంగా 2 మోడల్స్ లాంచ్ కానున్నాయి. అవి: Tecno Pova 5, Tecno Pova 5 Pro. టర్బో మెకా డిజైన్ తో ఈ ఫోన్లు వస్తుండటం విశేషం. అంటే నథింగ్ ఫోన్ 2 లో వాడబడిన ఎల్ఈడీ లైటింగ్ తరహా బ్యాక్ ప్యానెల్ ఈ ఫోన్లలో ఉండనుంది. సరే, ఓసారి Tecno Pova 5 సిరీస్ లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందా పదండి.
Tecno Pova 5 సిరీస్ లాంచ్ తేదీ
Tecno Pova 5 సిరీస్ లాంచ్ ని కంపెనీ తన సోషల్ మీడియా హ్యండిల్ పై షేర్ చేసింది. ఆగస్టు 11 న Tecno Pova 5 సిరీస్ మార్కెట్ లోకి రానుంది. యూజర్లను కంపెనీ ఆగస్టు 11 నుంచి ఆగస్టు 13 మధ్య కనెక్టెడ్ గా ఉండమని కూడా కంపెనీ తెలిపింది. దీంతో ఈ తేదీల్లో పలు ఉత్పత్తులను కంపెనీ లాంచ్ చేయనుందని అర్థమవుతోంది.
Tecno Pova 5 Pro డిజైన్
Tecno Pova 5 Pro వేరియంట్ ప్రత్యేకమైన డిజైన్ తో వస్తోంది. ఈ మోడల్ లో ఎల్ఈడీ బ్యాక్‌లైట్ డిజైన్, 3డీ టెక్షర్ బ్యాక్ ప్యానెల్ పై ఉంటాయి. ఇటువంటి డిజైన్ తొలిసారిగా నథింగ్ ఫోన్ లో మనం చూడటం జరిగింది. Tecno Pova 5 Pro లో బ్యాక్ ప్యానెల్ పై ఉండే ఎల్ఈడీ లైట్స్ ఏయే ఫంక్షనింగ్స్ తో వస్తున్నాయో ఇంకా తెలియదు.
Tecno Pova 5 Pro స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)
- డిస్ప్లే: Tecno Pova 5 Pro స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- చిప్సెట్: Tecno Pova 5 Pro డివైజ్ లో 6080 చిప్ వాడినట్లు సమాచారం. దీంతో పాటు ఫోన్ లో జెడ్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉంటుందని తెలుస్తోంది.
- స్టోరేజీ: Tecno Pova 5 Pro స్మార్ట్ ఫోన్ లో 8జిబి ర్యామ్ + 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
- బ్యాటరీ: Tecno Pova 5 Pro లో పవర్ బ్యాప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించనున్నారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: Tecno Pova 5 Pro స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉంటాయి.
- ఓఎస్: Tecno Pova 5 Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Tecno Pova 5 Pro స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ సిమ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
