చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ Tecno గ్లోబల్‌గా Pova 6 4G ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ Tecno Pova 6 త్వరలో భారత్ లో కూడా లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై ఎల్ఈడీ లైట్, డైనమిక్-టెక్ డిజైన్ తో వచ్చింది. టెక్నో పోవా 6 లో 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 108ఎంపి ప్రైమరీ కెమెరా, 12జిబి ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Tecno Pova 6 ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Tecno Pova 6 ధర, కలర్ ఆప్షన్స్
Tecno Pova 6 ధర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ప్రకటన వస్తుంది. అలాగే భారతీయ మార్కెట్ లో పోవా 6 ఎప్పుడు లాంచ్ కానుందో కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది.
Tecno Pova 6 కామెట్ గ్రీన్, మీటియోరైట్ గ్రే మరియు ఇంటర్‌స్టెల్లార్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Tecno Pova 6 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Tecno Pova 6 లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 2436 * 1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ హై-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ టీయూవీ రెయిన్ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Tecno Pova 6 లో మీడియాటెక్ హీలియో జీ99 అల్టిమేట్ చిప్సెట్, ఏఆర్ఎమ్ మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
- ర్యామ్, స్టోరేజీ: Tecno Pova 6 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 12జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా అందించారు. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
- కెమెరా: Tecno Pova 6 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ముందువైపు డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
- బ్యాటరీ: Tecno Pova 6 లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.
- ఓఎస్: Tecno Pova 6 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
