Home News Tecno Pova 6 Neo 5G: రూ.12,999 ధర, 108MP కెమెరాతో భారత్‌లో టెక్నో కొత్త ఫోన్ విడుదల

Tecno Pova 6 Neo 5G: రూ.12,999 ధర, 108MP కెమెరాతో భారత్‌లో టెక్నో కొత్త ఫోన్ విడుదల

Highlights
  • భారత్‌లో Pova 6 Neo 5G లాంచ్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 16జిబి వరకు ర్యామ్ పవర్

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno నేడు భారతీయ మార్కెట్ లో పోవా సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Tecno Pova 6 Neo 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. ఈ ఫోన్ లో 108ఎంపి మెయిన్ కెమెరా, 16జిబి వరకు ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Tecno Pova 6 Neo 5G ధర, లభ్యత

Tecno Pova 6 Neo 5G స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.13,999 గా పెట్టారు.

Tecno Pova 6 Neo 5G డివైజ్ పై లాంచ్ ఆఫర్ లో భాగంగా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తోంది.

Tecno Pova 6 Neo 5G స్మార్ట్‌ఫోన్ మిడ్నైట్ షాడో, అజూర్ స్కై మరియు అరోరా క్లౌడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అమెజాన్ సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఈ ఫోన్ సేల్‌కి వస్తోంది.

Tecno Pova 6 Neo 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Tecno Pova 6 Neo 5G లో 6.67-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 720*1600 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 90 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 480 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 20:09 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.

చిప్సెట్: Tecno Pova 6 Neo 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్. ఈ చిప్‌కి మాలి జీ57 ఎంసీ2 జీపీయూ గ్రాఫిక్స్‌ను జత చేశారు.

మెమొరీ: Tecno Pova 6 Neo 5G స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ సాయంతో 16జిబి వరకు ర్యామ్ పవర్ పెంచుకోవచ్చు. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Tecno Pova 6 Neo 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. మెయిన్ కెమెరాలో 3ఎక్స్ లాస్-లెస్ ఇన్-సెన్సర్ జూమ్ ఫీచర్ అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Tecno Pova 6 Neo 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: Tecno Pova 6 Neo 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

కనెక్టివిటీ: Tecno Pova 6 Neo 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Tecno Pova 6 Neo 5G లో లైట్ సెన్సర్, ఏఐ సూట్ (ఏఐజీసీ, ఏఐ మ్యాజిక్ ఎరేజర్, ఏఐ కటౌట్, ఏఐ వాల్‌పేపర్, ఏఐ ఆర్ట్‌బోర్డ్, ఆస్క్ ఏఐ) ఉన్నాయి.