Home News Tecno Pova 6 Neo 5G: త్వరలో లాంచ్ కానున్న పోవా 6 నియో 5జీ, లీకైన వివరాలు

Tecno Pova 6 Neo 5G: త్వరలో లాంచ్ కానున్న పోవా 6 నియో 5జీ, లీకైన వివరాలు

Highlights
  • త్వరలో Tecno Pova 6 Neo 5G లాంచ్
  • టిప్‌స్టర్ ద్వారా లీకైన సమాచారం
  • ఏఐ ఫీచర్లతో వస్తోన్న డివైజ్

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno త్వరలో పోవా సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Tecno Pova 6 Neo 5G పేరుతో ఈ ఫోన్ విడుదలవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క వివరాలను టిప్‌స్టర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో డివైజ్‌కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

Tecno Pova 6 Neo 5G ఇండియా లాంచ్ వివరాలు (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ Tecno Pova 6 Neo 5G డివైజ్ వివరాలను సోషల్ మీడియా వేదిక X పై షేర్ చేశారు.

ఈ ఫోన్ త్వరలో భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుందని టిప్‌స్టర్ పోస్ట్ ద్వారా తెలుస్తోంది. ఈ డివైజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లైన.. ఏఐజీసీ పొట్రెయిట్, ఏఐ కటౌట్, ఏఐ మ్యాజిక్ ఎరేజర్, ఆస్క్ ఏఐ లతో వస్తున్నట్లు టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది.

త్వరలోనే, Tecno Pova 6 Neo 5G గురించి టెక్నో నుంచి అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే మార్కెట్ లో Tecno Pova 6 Neo 4G ఫోన్ అందుబాటులో ఉంది.

Tecno Pova 6 Neo 4G స్పెసిఫికేషన్స్

Tecno Pova 6 Neo 4G స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో గ్లోబల్‌గా లాంచ్ అయ్యింది.

డిస్ప్లే: Tecno Pova 6 Neo 4G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, పంచ్ హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

చిప్సెట్: Tecno Pova 6 Neo 4G లో మీడియాటెక్ హీలియో జీ99 అల్టిమేట్ ఆక్టాకోర్ చిప్సెట్ ఉంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. ఈ చిప్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Tecno Pova 6 Neo 4G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో యూజర్లకు గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Tecno Pova 6 Neo 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

ఇతర ఫీచర్లు: Tecno Pova 6 Neo 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, 3.5ఎంఎం ఆడియో జాక్, స్టీరియో స్పీకర్స్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 5 గిగాహెర్ట్జ్ వై-ఫై, బ్లూటూత్ 5.1 ఉన్నాయి.