ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ TECNO త్వరలో పోవా సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. TECNO POVA 6 Neo పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై కనిపించింది. దీంతో డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫ్రంట్ డిజైన్ వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
TECNO POVA 6 Neo గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్
TECNO POVA 6 Neo స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై TECNO LI6 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
TECNO POVA 6 Neo డివైజ్ 2460*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 480 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో రానుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
TECNO POVA 6 Neo మీడియాటెక్ చిప్సెట్ తో వస్తోందని అర్థమవుతోంది. లిస్టింగ్ పై MT6789/CD అనే కోడ్ నేమ్ తో ఫోన్ కనిపించింది.
TECNO POVA 6 Neo డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉంటాయని అంచనా వేస్తున్నారు.
TECNO POVA 6 Neo స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
ఓఎస్ విషయానికి వస్తే, TECNO POVA 6 Neo డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13 కస్టమ్ స్కిన్ తో రానుంది.
TECNO POVA 6 Neo డిజైన్ (గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్)
TECNO POVA 6 Neo ఇమేజ్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.
వివరాల ప్రకారం, TECNO POVA 6 Neo డివైజ్ పంచ్-హోల్ కటౌట్ తో వస్తోంది.
TECNO POVA 6 Neo స్మార్ట్‌ఫోన్ లో కుడివైపున పవర్ బటన్ మరియు వాల్యూమ్ రాకర్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇతర వివరాలు ఏమీ రివీల్ కాలేదు.
TECNO POVA 6 Neo స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: TECNO POVA 6 Neo లో 2460*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 480 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉంటాయని లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.
- ప్రాసెసర్: TECNO POVA 6 Neo డివైజ్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ తో రానుంది.
- ర్యామ్, స్టోరేజీ: TECNO POVA 6 Neo డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఆఫర్ చేసే అవకాశం ఉంది.
- ఓఎస్: TECNO POVA 6 Neo స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
