Home News Tecno: 70W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన Pova 6 Pro 5G

Tecno: 70W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన Pova 6 Pro 5G

Highlights
  • భారత్‌లో Tecno Pova 6 Pro 5G లాంచ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్
  • Tecno Pova 6 Pro 5G ప్రారంభ ధర రూ.19,999

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno భారతీయ మార్కెట్ లో Pova 6 Pro 5G డివైజ్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై ఎల్ఈడీ లైట్స్ తో వచ్చింది. దీంతో ఫోన్ లుక్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. Tecno Pova 6 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఎన్నో మంచి ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ 24జిబి వరకు ర్యామ్ పవర్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 6.78-ఇంచ్ భారీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Tecno Pova 6 Pro 5G ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Tecno Pova 6 Pro 5G ధర, లభ్యత

Tecno Pova 6 Pro 5G డివైజ్ భారత్ లో రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Tecno Pova 6 Pro 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ బేస్ మోడల్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు.

Tecno Pova 6 Pro 5G 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.21,999 గా ఉంది.

Tecno Pova 6 Pro 5G డివైజ్ మీటియోరైట్ గ్రే మరియు కామెట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా ఫోన్ పై రూ.2,000 డిస్కౌంట్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీంతో బేస్ మోడల్ రూ.17,999 కి, టాప్ మోడల్ రూ.19,999 కి లభించనున్నాయి.

Tecno Pova 6 Pro 5G డివైజ్ ఏప్రిల్ 4వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ అమెజాన్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

Tecno Pova 6 Pro 5G స్పెసిఫికేషన్స్