Home News 7000mAh బ్యాటరీతో వస్తోన్న Tecno Pova Neo 3; స్పెసిఫికేషన్స్ షేర్ చేసిన కంపెనీ!

7000mAh బ్యాటరీతో వస్తోన్న Tecno Pova Neo 3; స్పెసిఫికేషన్స్ షేర్ చేసిన కంపెనీ!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Tecno Pova Neo 3
  • గ్లోబల్ గా టీజ్ చేసిన టెక్నో సంస్ఠ
  • 4జీ, 8జిబి ర్యామ్ తో వస్తోన్న డివైజ్

చవకైన మరియు మన్నికైన ఫోన్లను తయారు చేస్తోన్న టెక్నో సంస్థ తక్కువ సమయంలోనే తనకంటూ మంచి మార్కెట్ ని ఏర్పరచుకుంది. నేడు, తన అధికార ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా Tecno Pova Neo 3 డివైజ్ సమాచారాన్ని షేర్ చేసింది. త్వరలోనే ఈ హ్యాండ్సెట్ ని లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. Tecno Pova Neo 3 డివైజ్ స్పెసిఫికేషన్స్ ని కూడా టెక్నో పంచుకుంది. 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో Tecno Pova Neo 3 వస్తోంది. సరే, ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Tecno Pova Neo 3 స్పెసిఫికేషన్స్

Tecno Pova Neo 3 ధర (అంచనా)

Tecno Pova Neo 3 స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ, ధర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ప్రాసెసర్ వివరాలు తెలిసాక, ఈ హ్యాండ్సెట్ 4జీ కనెక్టివిటీతో వస్తోందని క్లారిటీ వచ్చింది. అలాగే ఈ ఫోన్ ధర కూడా తక్కువ బడ్జెట్ లోనే ఉంటుందని అంచనా వేయవచ్చు. అఫీషియల్ స్పెసిఫికేషన్స్ ని బట్టి, Tecno Pova Neo 3 ధర రూ.11,000 నుంచి 13,000 మధ్య ఉంటుందని చెప్పవచ్చు. అయితే, కచ్చితమైన ధర వివరాల కోసం కంపెనీ నుంచి రాబోవు తదుపరి ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.